telugudanam.co.in

      telugudanam.co.in


రాబోవు కార్యక్రమాలు
     
సామెత: ఉదాయాన్నే వచ్చిన చట్టం ఉదాయాన్నే వచ్చిన వాన ఉండవు.

మంచిమాట: ఆత్మవిశ్వాసం నిజమైన సంతోషానికి గీటురాయి - మనుధర్మ శాస్త్రం.

నీతి కథ : పేద - గొప్ప [ వివరాలకు... ]

మహనీయ వ్యక్తి: టంగుటూరి ప్రకాశం [ వివరాలకు... ]

ఆట : జంతువుల పేర్లు పేర్చడం [ వివరాలకు... ]

తెలుగు సైటు: ది హిందూ టెంపుల్ ఆఫ్ అట్లాంటా [ వివరాలకు... ]




తెలుగుదనం విషయ సూచిక


సంస్కృతి, సాంప్రదాయాలు


సాహిత్యం


చిన్నపిల్లల కోసం


వనితల కోసం


అందరి కోసం


 

గురువులకిదే మా వందనం

చదువు నేర్పే గురులకిదె మా వందనం
జ్ఞాన దాతల చరనధూళికి వందనం
శాంతమూర్తులు స్వచ్చకీర్తులు
సుజన చంద్రులు - సుగుణసాంద్రులు
గురులు - సుతరులు || చదువు ||
రామునికి - విలువిద్య నేర్పెను 
మౌని విశ్వామిత్రుడు
కృష్ణునే చదివించే
సాందీప జ్ఞాని పవిత్రుడు
ఎంత ఘనులకునైన గాని
గురువులే ప్రత్యక్ష దేవులు || చదువు ||
రాధాకృష్ణులు - రామకృష్ణులు
విశ్వకవులు - వివేకానందులు
శంకరులు - వేదవ్యాసులు
ఎందరెందరో జగద్గురువులు || చదువు ||
కోటి సూర్యులున్న - కోటి చంద్రులున్న
గురువు మాట లేకుండా - ఎద చీకటి పోతుందా?
జ్ఞానజ్యోతి వెలిగించి మము ప్రగతికి నడిపించె
గురువే బ్రహ్మ గురువే విష్ణువు - గురువే మహేశ్వరుడు
ఆ త్రిమూత్రి రూపునకిదె వందనం
ఆ దరుంతరంగున కిదె వందనం || చదువు ||
Telugudanam.co.in
వెనుకకు | మొదటి పేజీ | తెలుగుదనం బ్లాగు | మాగురించి | సలహాలు | పత్రికలలో తెలుగుదనం                                సందర్శకుల సంఖ్య: