telugudanam.co.in

      telugudanam.co.in

   

సన్మార్గ జీవితం

మన మనస్సు, మాట, ప్రవర్తన నిష్కల్మషంగా ఉండాలంటే ఒకటే మార్గం. ఎప్పుడూ సదాలోచనలతో, సత్కార్యాలు చేస్తూండాలి. సమర్ధ రామదాసు, తులసీదాసు, అప్పయ్య దీక్షితారు, తాయుమానపర్, పట్టినత్తార్ మొదలైన భక్తులు, తేవారం మొదలైన వాటిని రచించిన అందరూ భగవంతుని భక్తులుగా ఉంటూ మనసులోగానీ, చేతల్లోగానీ, ప్రవర్తనలోగానీ ఏనాడూ ఎట్టి పాపం ఆచరించలేదు.

ఒకప్పుడు ఒక వృద్ధ సన్యాసిని మనస్సులో కామాన్ని పోగొట్టుకున్నావని అడిగినప్పుడు మనసులో కామం ఉద్భవించినప్పుడు నేను తీరిక లేకుండా ఉండడం గ్రహించి కామం దానంతట అదే వెళ్ళిపోయింది అని జవాబు చెప్పాడు. మనస్సు ఖాళీగా ఉంచుకునే మానవుడు వ్యర్ధ ప్రలాపాలు ప్రారంభిస్తాడు. మనం దానికి వశులమైపోతే కామం అనేది సులభంగా మనస్సులో సుస్థిరంగా చోటుచేసుకుంటుంది. మనం సర్వదా అన్ని సమయాల్లోనూ మంచి పనులతో తీరిక లేకుండా ఉంటే పాపం దానంతట అదే దూరంగా పోతుంది. దుస్సంగాన్ని వదులుకోవాలంటే మంచివారితో స్నేహం చేసుకుంటూ సత్సంగాన్ని ప్రవృద్ధి చేసుకుంటుండాలి. పాప చింతన పోవాలంటే నిరంతరం మంచి పనులలో మునిగి ఉండాలి. అప్పుడు మనలో పాపం దానంతట అదే నశించిపోతుంది. ఎప్పుడూ మంచి పనులే చేస్తూ మనస్సుకు తీరికలేకుండా చేసుకోవాలి. ఊరికే ధ్యానం చేయడం, జపం చేయడం చాలదు.

సుప్రసిద్ధ సంస్కృత కవి అప్పయా దీక్షితులు ఒకసారి కంచి శ్రీ వరదరాజస్వామిని గురించి వ్రాస్తూ - "ఇతర కవులు ఎంతోమంది ఉండవచ్చు. ఓ పరమాత్మా! నీమీద వారు అతి శీఘ్రంగా ఎన్నెన్నో పద్యాలు వ్రాయగలరు. కాని నేను చాలా మెల్లిగా వ్రాసే కవిని. వారి అదృష్టం కంటే నాది మంచి అదృష్టం. నేను పద్యం వ్రాయాలని యాతనపడుతుంటే ప్రకాశవంతమైన నీ దివ్య స్వరూపం మీద నా మనస్సు ఎంతోసేపు సంచరిస్తూ ఉంటుంది".

ఈవిధంగా మంచి చేసే ఉద్యమంతో పాపం దానంతట అదే మన మనస్సులో నుంచి మాయమైపోతుంది. గొప్ప గొప్ప యోగులు, భక్తులు దేవుని కీర్తించేటప్పుడు ఈ విధంగా మనస్సును మంచి మార్గంలో పెట్టుకున్నారు. కాబట్టి పాపానికి దూరంగా ఉండాలంటే పాపం పోవాలని కాదు. సదా మంచినే చింతిస్తూ, మంచినే మాట్లాడితే, సత్సంగాన్ని ప్రోత్సహించాలి.


- కంచి పరమాచార్య

Telugudanam.co.in
వెనుకకు | మొదటి పేజీ | తెలుగుదనం బ్లాగు | మాగురించి | సలహాలు | పత్రికలలో తెలుగుదనం                                సందర్శకుల సంఖ్య: