|
www.telugudanam.co.in చీరాల |
పత్రికలలో తెలుగుదనం |
మా అనుబంధ వెబ్‌సైట్.. |
|||
| తెలుగుదనం బ్లాగు | |||||
| మా గీతా.కో.ఇన్ |
విఘ్నేశ్వరుడు
సుముఖ శ్త్చె కదంతశ్చ కపిలో గజకర్ణక:
లంబోదరశ్చ వికటో విఘ్న రాజో గణాధిప:
ధూమకేతుర్గణా ధ్యక్ష: ఫాలచంద్రో గజానన:
వక్రతుడ శూర్పకర్ణో హేరంభ స్కంధ పూర్వజ:
షోడశైతాని నామాని య: పఠేత్ శృణుయాదపి
విద్యారంభే వివాహేచ ప్రవేశే నిర్గమేతధా,
సంగ్రామే సర్వకార్యేషు విఘ్నుస్తస్య నజాయతే.
ఈ
విధంగా విఘ్నేశ్వరుని సర్వకార్యాలకు విఘ్నములు తొలగిపోయి అనుకున్న కార్యము
జయప్రదంగా నెరవేరవలెనని షోడశోపచారములతో పూజించి పూజా అక్షతలు శిరస్సున ధరిస్తారు.
గణపతి పుట్టుక అందరికీ తెలిసిందే, వివిధయుగాలలో 'గణపతి ' లీలను పరిసీలించినచో 'కృతయుగం' లో 'మహోత్కట వినాయక ' అనుపేరుతో ఉధ్భవించి దేవాంతక నరాంతక అను రాక్షసులను సం హరించెను.
'త్రేతాయుగం' లో 'మాయారేస్వర వినాయక ' అనుపేరుతో జన్మించి రాక్షసుడైన 'మహాబలి సింధువు ' ను సం హరించెను.
ద్వాపర యుగంలో 'గజానన ' అను పేరుతో జన్మించి భయంకరుడైన 'సింధూరుడు ' అను రాక్షసుని సం హరించెను.
కలియుగాంతములో 'ధూమ్రకేతు ' పేరుతో జన్మించి దుష్ట శిక్షణ చేయును అని గణేశపురాణం, ముద్గల పురాణముల ద్వారా తెలియును. అష్టవినాయకులూ
వారి పేర్లూ వాహనములు వక్రతుండ వాహనము సిం హము ఏకదంత వాహనము ఎలుక మహోదర వాహనము ఎలుక గజానన వాహనము ఎలుక లంబోదర వాహనము ఎలుక వికట వాహనము నెమలి విఘ్నరాజు వాహనము ఆది శేషువు ధూమ్ర వర్ణ వాహనము ఎలుక
శివ భక్తులు 'విఘ్నేశ్వరుని ' పూజిస్తే, విష్ణుభక్తులు వినాయకుని బదులు శంఖ చక్ర గధా హస్తములు కలిగి ఊర్ధ్వపుండ్రము ధరించి 'విష్వక్సేనుని ' పూజించెదరు. ఇతడు వైకుంఠమునందు శ్రీమహావిష్ణువు యొక్క సేనాధిపతి.
వెనుకకు | మొదటి పేజీ | ఆఖరి సారి మెరుగు పరిచిన తేది: 25-03-2009 | హక్కులు: తెలుగుదనం.కో.ఇన్ | రూపకర్త: గీతా.కో.ఇన్ | ప్రశ్నలు, సలహాలు, సూచనలకు: editor@telugudanam.co.in