|
www.telugudanam.co.in చీరాల |
పత్రికలలో తెలుగుదనం |
మా అనుబంధ వెబ్‌సైట్.. |
|||
| తెలుగుదనం బ్లాగు | |||||
| మా గీతా.కో.ఇన్ |
అన్నం - ఔషధం
దక్షిణ భారతదేశంలో ప్రధానంగా ఆంధ్ర దేశంలో
సాధారణంగా అందరూ తినే ప్రధాన ఆహారం అన్నం. ప్రతి రోజూ తినే అన్నం గురించి, దానికోసం
వాడే బియ్యం గురించి ఆలోచించం మనం. అంటే దానిలోని గుణాన గురించి, పోషక విలువల
గురించీ ఆలోచించం. సాధారనంగా అందరూ ఆలోచించేది అన్నం అందంగా, తెల్లగా,
విడివిడిలాడుతూ కనబడుతోందా లేదా అని మాత్రమే. అయితే కంటికి ఇంపుగా అన్నాన్ని
తయారుచేసే పద్దహ్తిలో, అందులో ఉన్న పోషక విలువలు పోతున్నాయి. దంపుడు బియ్యంతో వండిన
అన్నం కంటికి ఇంపుగా ఉండదు.కానీ ఒంటికి మాత్రం ఖచ్చితంగా మంచిది. బియ్యాన్ని పాలిష్
చేసి, ఆకర్షణీయంగా చేసే పద్ధతిలో అందులోని జీవ పదార్ధం, ఆరోగ్య రక్షణకి ఎంతగానో
అవసరమైన బీ-కాంప్లెక్స్ విటమిన్లు పోతున్నాయి. అయితే కావాలని కోరుకున్నా, ఇప్పుడు
పట్టణాలలో దంపుడు బియ్యం కనపడ్డం కష్టం. పాలిష్ చెయ్యని గోధుమలతో తయారైన బ్రౌన్
బ్రెడ్ మాత్రం దొరుకుతోంది. దాని విలువని ప్రజలు గుర్తిస్తున్నారు.
ప్రత్యేక గుణాలు :
బియ్యంలో ప్రధానంగా పిండిపదార్ధాలు ఉన్నాయి. ఇందులో ప్రోటీన్లు తక్కువగా వున్నా, ఉన్న ప్రోటీన్లు మాత్రం శరీరానికి అత్యవసరమైనవి.
ఇది చాలా తేలికగా అరుగుతుంది. శరీరానికి పూర్తి శక్తిని ఇస్తుంది. శరీరంలోని ప్రతి అవయవానికీ, కణానికీ శక్తిని అందించి,వాటిని సక్రమంగా పని చేయిస్తుంది.
ఇందులో పీచు పదార్ధం లేదు. కనుక జీర్ణమండలం మీద చాలా మృదుగుగా పనిచేస్తుంది.
దంపుడు బియ్యంలో ఉండే విటమిన్ బి-కాంప్లెక్స్ శరీరం ఆరోగ్యంగా, ఉత్సాహంగా ఉండడానికి చాలా ఉపయోగపడుతుంది. ఇది చర్మానికీ, రక్తనాళాలకీ పోషణ అందిస్తుంది.
అన్నం తేలికగా జీర్ణమయ్యే పదార్ధం కనుక ఎన్నో అనారోగ్యాలకు ఇది పథ్యం. పధ్యం అంటే శరీర అవయవాలకు అనుకూలమైనది. అంటే శరీరానికి మంచిది అన్నమాట.
చంటి పిల్లలకి విరేచనాలు అవుతూంటే బియ్యాన్ని వేయించి పొడి చేసి, జావలా చేసి, దానిని మజ్జిగలో కలిపి కొద్దికొద్దిగా తినిపిస్తుంటే విరేచనాలు తగ్గుతాయి. డీహైడ్రేషన్ సమస్య రాదు.
శరీరానికి పూర్తి పోషణ అందడానికి మెత్తగా వండిన అన్నంలో పాలు కలిపి ప్రతిరోజూ తినాలి. పాలు, అన్నం కలిపి తినడం వలన ప్రోటీన్లు కూడా అందుతాయి. రెండూ కలిపి తినడం వలన ఆహారంలో తీసుకున్న ఇనుము సక్రమంగా రక్తంలోకి చేరుతుంది.
టైఫాయిడ్, అల్సర్, విరేచనాలు, పైల్స్ లాంటి అనేక ఆరోగ్య సమస్యలలో మెత్తగా అండిన అన్నంలో ఒక గ్లాసు మజ్జిగ, ఒక అరటిపండు కలిపి యిస్తే మంచిది. తేలికగా అరుగుతుంది. అరగడమే కాదు, ఇదే ఒక ఔషధంగా పనిచేసి జీర్ణమండలాన్ని రక్షిస్తుంది.
కాలిన గాయం మీద బియ్యపు పిండి జల్లితే త్వరగా తగ్గిపోతుంది.
గడ్డల మీద ఉడికించిన బియ్యపు పిండిని వేడివేడిగా చేసి, కట్టుకట్టితే ఆరంభంలో ఉన్నవి అణగిపోతాయి. కొంతకాలం అయినవైతే త్వరా పగిలి చీము పోతుంది.
ఇక మీదట అన్నం తినేటప్పుడు పరబ్రహ్మ స్వరూపమైన అన్నంలోని ఆరోగ్య రక్షక గుణాలు తలుచుకుని తినాలి. మనసు కూడా ప్రశాంతంగా, ఆరోగ్యంగా ఉంటుంది.
వెనుకకు | మొదటి పేజీ | ఆఖరి సారి మెరుగు పరిచిన తేది: 25-03-2009 | హక్కులు: తెలుగుదనం.కో.ఇన్ | రూపకర్త: గీతా.కో.ఇన్ | ప్రశ్నలు, సలహాలు, సూచనలకు: editor@telugudanam.co.in