|
www.telugudanam.co.in చీరాల |
పత్రికలలో తెలుగుదనం |
మా అనుబంధ వెబ్సైట్.. |
|||
| తెలుగుదనం బ్లాగు | |||||
| మా గీతా.కో.ఇన్ |
బాదం పప్పు
చూడగానే నోట్లో వేసుకోవాలనిపించే బాదం పప్పు ఏ వంటకంలో వేసినా దాని రుచిని పెంచుతుంది. కేవలం రుచి కాకుండా పోషక విలువలు అధికమోతాదులో ఉండి చూపుకే చిన్నది కాని ఆరోగ్యవిలువల్లో పెద్దదే అనిపించే బాదం గురించి కొంచెం తెలుసుకుందాం.
బాదంలో సహజమైన పోషకత్వం వల్ల వ్యాధులు లేని ఆరోగ్యవంతమైన జీవితాన్ని గడపడానికి తోడ్పడుతుంది. అందరూ అనుకున్నట్లుగా బాదం పప్పులో కొలెస్ట్రాల్ అస్సలు ఉండదు.
దీంట్లో విటమిన్ 'ఇ' అధికంగా లభిస్తుంది. విటమిన్ 'ఇ' రోజువారీ దినచర్యలో శరీర కణాలకు నష్టం వాటిల్లకుండా అడ్డుకుంటుంది.
మాంసంలో ఉండే ప్రొటీన్లకు సమానమైన ప్రొటీన్లు బాదంపప్పులో దొరుకుతాయి. అది కూడా కొలెస్ట్రాల్ లేకుండానే.
పావు కప్పు బాదంపప్పులో, పావు కప్పు పాలలో ఉండే కాలిష్యం, ఒక ఆపిల్ లేదా కమలా పండులో ఉండే ఫైబర్ ఉంటుంది. ఇది జీర్ణక్రియకు తోడ్పడుతుంది. కాల్షియం ఎముకలు, పళ్ళు కండరాలకు బలాన్ని చేకూర్చుతుంది.
బాదంలో ఉండే పొటాషియం, మెగ్నీషియంలు సక్రమమైన రక్తప్రసరణకు, శరీరంలో తయారైన శక్తిని కండరాలకు చేరవేయడంలో చురుకైన పాత్రను నిర్వహిస్తాయి.
రోజుకు రెండు పడికిళ్ళ బాదంపప్పు తిన్నాకూడా ఎలాంటి గుండెసంబంధిత జబ్బులు దరిచేరలేవని టొరంటో విశ్వవిద్యాలయం గతంలో జరిపిన పరిశోధనలో వెల్లడయింది. బాదంలో హానికరమైన కొవ్వు లేకపోవటం వల్ల దీనిని ఎంత మోతాదులో నిత్యం తిసుకున్నప్పటికీ ఆరోగ్యమే కాని అనారోగ్యం ఉండదని వివిధ పరిశోధనల్లో వెల్లడయింది.
బాదం పప్పులోని చాలా తక్కువ మోతాదులో ఉండే సాచ్యురేటెడ్ కొవ్వుల వల్ల ఆరోగ్యవంతమైన, ఖచ్చితమైన డైటింగ్ బాగా పెరగకపోగా అదే బరువును కొనసాగించడానికి తోడ్పడుతుంది.
బాదంపప్పులు శరీరంలోని వేడిని పెంచుతాయని అనుకోవడం పూర్తిగా అసంబంధమైనదే. దీనిని 365 రోజులూ నిరభ్యంతరంగా తినవచ్చని పరిశోధకులు అంటున్నారు.
వీటిల్లో కాలిఫోర్నియా బాదంపప్పు ఆహారానికి రుచిని పెంచడంలోనూ, సువాసనను చేర్చడంలోనూ అన్ని రకాల కంటే ముందుంది.
బాదంలు కొనేటప్పుడు పై భాగం శుభ్రంగా ఉండి, ఎలాంటి పగుళ్ళు లేనివి పెద్ద పరిమాణంలో ఉన్నవి కొనాలి.
ప్రస్తుతం ఎక్కువగా వాడుకలో ఉన్న కాలిఫోర్నియా రకం బాదంపప్పు పై పొట్టు చేత్తో నలిపితే వచ్చేస్తుంది. ఇవి పరిమాణంలో పెద్దగా ఉంటున్నాయి. దేశీయ రకం బాదంపప్పు పైపొట్టు కాస్త గట్టిగా ఉంటుంది.
వీటిని గాలి చొరబడని డబ్బాలో వేసి చల్లని చీకటి ప్రదేశంలో నిల్వచేస్తే చాలాకాలం పాటు తాజాగా ఉంటాయి.
కాంతి, రేడియేషన్ ప్రభావం వల్ల కంటిలోని సున్నిత కణజాలం ఆక్సిడేటివ్ స్ట్రెస్‌కు గురవుతుంది. దీన్ని ఎదుర్కొనడానికి, శుక్లాలను నివారించడానికీ విటమిన్ 'ఎ' కూడా ఉపయోగపడుతుంది. ఇది నానబెట్టిన బాదం పప్పుల్లోనూ, గోధుమ మొలకల ద్వారానూ సమృద్దిగా లభిస్తుంది.
వెనుకకు | మొదటి పేజీ | ఆఖరి సారి మెరుగు పరిచిన తేది: 25-03-2009 | హక్కులు: తెలుగుదనం.కో.ఇన్ | రూపకర్త: గీతా.కో.ఇన్ | ప్రశ్నలు, సలహాలు, సూచనలకు: editor@telugudanam.co.in