|
www.telugudanam.co.in చీరాల |
పత్రికలలో తెలుగుదనం |
మా అనుబంధ వెబ్‌సైట్.. |
|||
| తెలుగుదనం బ్లాగు | |||||
| మా గీతా.కో.ఇన్ |
మొలకెత్తిన గింజలు చిగురించే ఆరోగ్యం
విటమిన్లు, ఖనిజలవణాలు, ప్రొటీన్లు, ఇతర ఎంజైములను శరీరానికి సమృద్దిగా అందించాలంటే ఏంచేయాలి! అందుకు సులువైన, చౌకైన, సురక్షితమైన మార్గం ఏమైనా ఉందా అందుకు సమాధానమే మొలకెత్తిన గింజలు, మొలకెత్తిన గింజల్లో కొవ్వుశాతం తక్కువ పీచుపదార్ధాల పరిమాణం ఎక్కువ కొలెస్ట్రాల్ ఆనవాళ్ళే ఉండవు. ఇంత మేలుచేసే మొలకెత్తిన గింజల నుండి ఇంటిల్లీపాదీ మరింత ప్రయోజనం పొందాలంటే మీరు దీనిని చేయాల్సిందే.
మొలకెత్తిన గింజలకు ఎందుకింత ప్రాధాన్యం?
మొలకెత్తే సమయంలో గింజల్లో క్లోరోఫిల్ శాతం పెరుగుతుంది. రక్తహీనత ఉన్నవారికి క్లోరోఫిల్ అద్భుతంగా పనిచేస్తుందని అధ్యయనాలు చెబుతున్నాయి.
గింజలు మొలకెత్తేటప్పుడు జరిగే రసాయనిక మార్పుల వల్ల విటమిన్లు, పీచుపదార్ధాల శాతం అనూహ్యంగా పెరుగుతుంది. జీర్ణమవుతాయి.
శరీరానికి ఎంతో మేలు చేసే ఎంజైముల భాడాగారం మొలకెత్తిన గింజలను పేర్కొనవచ్చు.
మొలకెత్తిన గింజలను ఎవరెవరు ఎంతెంత తీసుకోవచ్చో చూద్దాం!
ఆరోగ్యానికి మేలు చేస్తాయి కదా అని అదేపనిగా గుప్పెళకొద్దీ తింటే ఇబ్బంది తప్పదు.
వయసు, ఆరోగ్యపరిస్థితిని బట్టి వీటిని తీసుకునే పరిమాణం ఆధారపడి ఉంటుంది.
టీనేజర్లు, ముప్పయ్యేళ్ళలోపు వారు అరకప్పు మొలకెత్తిన ధాన్యాలను రోజూ తీసుకోవచ్చు.
మధుమేహంతో భాధపడేవారైతే ఉదయం పదిన్నర పదకొండుగంటల మధ్య ఓ పావుకప్పు తీసుకుంటే సరిపోతుంది.
ఆరేళ్ళు ఆపైబడిన పిల్లలకైతే మాత్రం మొలకెత్తిన గింజలను ఎండబెట్టి పొడిచేసి దానిని సూప్లాగా, రొట్టెలపిండిలో కలిపి ఇస్తే మంచిది.
ఎలాంటి వాటిని తీసుకోవచ్చు?
తృణధాన్యాలు : గోధుమ, రాగి.
చిక్కుడు జాతి గింజలు : పెసలు, సెనగలు, బఠాణీలు, రాజ్మా , సోయా బీన్స్.
నూనెగింజలు : సూర్యకాంతి, కర్భూజా.
మొలకెత్తిన ధాన్యం
పప్పు ధాన్యాలను వండినప్పుడు వాటిలోని 'బి6' పరిమాణం బాగా తగ్గుతుంది. కాబట్టి ఒంట్లో బి-విటమిన్లు తగ్గకుండా ఉండేందుకు మొలకెత్తిన మెంతులు, మొలకెత్తిన పెసలు, సోయా పాల వంటివి బాగా ఉపకరిస్తాయి. కంటిలోని సూక్ష్మరక్తనాళాలు ఆరోగ్యంగా ఉండేందుకు బయోప్లేవనాయిడ్స్ సమృద్దిగా ఉండే చెర్రీ పండ్లు, ద్రాక్ష, ఉల్లి, వెల్లుల్లి, వంటివి తీసుకోవాలి. అధిక రక్తపోటు బాధితులకు ఇవి తప్పనిసరి.
వెనుకకు | మొదటి పేజీ | ఆఖరి సారి మెరుగు పరిచిన తేది: 25-03-2009 | హక్కులు: తెలుగుదనం.కో.ఇన్ | రూపకర్త: గీతా.కో.ఇన్ | ప్రశ్నలు, సలహాలు, సూచనలకు: editor@telugudanam.co.in