telugudanam.co.in

      telugudanam.co.in

   

మ్యూజిక్ ఇన్‌స్ట్రుమెంట్ కొనేటప్పుడు

సంగీతం సృజనాత్మకత జీవితానికి ఆలంబన. మనో ప్రపంచాన్ని ఉల్లాసపరిచే ప్రక్రియ. సంగీతమంటే శాస్త్రీయ సంగీతమనేకాదు. సినిమా సంగీతం, పాటలు వింటూ మురిసిపోయేవారు ప్రతి ఇంట్లోనూ ఉంటారు. పాటలు వినాలన్న తహతహ వయసుతో నిమిత్తం లేకుండా అందరికీ ఉంటుంది. ఇందుకోసం ఒక్కో ఇంటిలో రకరకాల సాధనాలుంటాయి. ఒకప్పుడు రేడియోలో వచ్చినప్పుడే వినే అలవాటు ఉండేది. కానీ ఇప్పుడు ఎన్ని అవకాశాలో! రేడియో, వాక్‌మన్, టూ ఇన్ వన్, డెక్, సిడిప్లేయర్, డివిడి ప్లేయర్, కంప్యూటర్, సెల్ ఇలా ఎన్నిరకాల సాధనాలో! కొన్నిసార్లు ఇవన్నీ ఒకే ఇంటిలో ఉంటున్నాయి. మ్యూజిక్ సిస్టమ్స్ ఎప్పటికప్పుడు కొత్త సాంకేతిక పరిజ్ఞానంతో వస్తున్నాయి. కనుక ఏడాది కిందట కొన్నది మనకే పాతబడ్డట్టుగా అనిపిస్తుంటుంది. అందుకే కొత్తవాటిని కొనాలన్న ఆరాటం ఎక్కువగా ఉంటుంది. అలాంటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి.

మొదట మీ ఇంట్లో ఇప్పుడు సంగీతం, పాటలు వినడానికి ఉన్న అవకాశాలేమిటో అంచనా వేసుకోవాలి. అవి సరిపోవనుకుంటే కొత్తవి కొనాలి. కొత్తగా కొనేటప్పుడు అత్యున్నత సాంకేతిక పరిజ్ఞానంతో అప్‌డేట్ అయిన వాటినే కొనాలి. కొత్తవి వచ్చినా పాతవి మార్కెట్లోంచి వెళ్ళిపోవు. కనుక ఎవరయినా తమ ఆర్థికస్థోమతకు తగినట్టుగా ఉన్నవాటిలో ఉత్తమమైనది ఎంచుకోవాలి. అది రేడియో, వాక్‌మన్, టూ ఇన్‌వన్, డెక్, డివిడి, ఎల్‌సిడి టీవీ, డిజిటల్ మ్యూజిక్ ఇన్‌స్ట్రుమెంట్ ఇలా ఏదైనా కావచ్చు. అలాగే ఇప్పుడు కొత్తగా ప్యాకెట్ సైజులో వస్తున్నాయి. వీటిని కొనేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి.


మూలం : వార్త ఆదివారం 16 ఏప్రిల్ 2006

Telugudanam.co.in
వెనుకకు | మొదటి పేజీ | తెలుగుదనం బ్లాగు | మాగురించి | సలహాలు | పత్రికలలో తెలుగుదనం                                సందర్శకుల సంఖ్య: