telugudanam.co.in

      telugudanam.co.in

   

జొన్నవాడ

నెల్లూరు పట్టణంలో వున్న రంగనాధ ఆలయం కాక ఈ జిల్లాలో ప్రసిద్ధి కలిగిన రెండవ క్షేత్రం జొన్నవాడ. ఈ వూరు నెల్లూరుకు పదిహేను కి.మీ దూరంలో బుచ్చిరెడ్డిపాలెం మండలంలో ఉంది. నెల్లూరు నుంచి జొన్నవాడకు సరాసరి బస్సులు ఉన్నాయి. త్రేతాయుగంలో కశ్యపమహర్షి ఇక్కడ ఒక గొప్ప యజ్ఞం చేశాడట. ఆ యజ్ఞ్గుగుండంలో నుంచి పరమశివుడు ఆవిర్భవించి, మహర్షి కోరిక మేరకు ఇక్కడే వుండి పోయాడు. భర్తను వెదుక్కుంటూ వచ్చిన పార్వతీ దేవి శివుని అభీష్టం ప్రకారం కామాక్షీదేవి పేరుతో ఇక్కడే వుండి పోయింది. ఇక్కడ వెలసివున్న శివుని పేరు మల్లికార్జునుడు. కాని ఈ క్షేత్రం కామాక్షి అమ్మవారి మహిమ వల్లనే ప్రసిద్ధిలోకి వచ్చింది. కశ్యపమహర్షి యజ్ఞం చేసిన స్ధలం కనుక ఇది మొదటి యజ్ఞవాటికగా మారి చివరకు జొన్నవాడ అయింది. ఆదిశంకరాచార్యులవారు ఈ అమ్మవారిని దర్శించి ఆమె ఎదుట ఒక శ్రీచక్రం ప్రతిస్టించారని స్ధలపురాణం వివరిస్తుంది. అమ్మవారి ఆలయం ప్రక్కనే ఆదిశంకరాచార్యులవారి విగ్రహమూర్తి ఉంది. ఆలయంలోని అమ్మవారి మూర్తి చాలా చిన్నదిగా ఉంటుంది. ఆలయప్రాంగణంలోనే విఘ్నేశ్వర ఆలయాలు కూడా ఉన్నాయి. ఆలయం అంత పెద్దది కాకపోయినా ఉన్నంతలో శిల్పలావణ్యం చాలా బాగుంటుంది. ఆలయాన్ని ఆనుకునే ప్రవహిస్తున్న పెన్నానది 'కశ్యతీర్ధం' అని పిలువబడుతూ అత్యంత శోభాయమానంగా ఉంటుంది. తిక్కనామాత్యుడు ఈ క్షేత్రంలో యజ్ఞం చేసి 'సోమయాజి' అనిపించుకున్న తరువాతనే భారత గ్రంధరచన ప్రారంభించాడని స్ధలపురాణం జొన్నవాడలో చెప్పుకోదగిన వసతి సౌకర్యాలు లేవు. నెల్లూరు నుంచి బస్సులో వెళ్ళి వచ్చేయడం మంచిది.

Telugudanam.co.in
వెనుకకు | మొదటి పేజీ | తెలుగుదనం బ్లాగు | మాగురించి | సలహాలు | పత్రికలలో తెలుగుదనం                                సందర్శకుల సంఖ్య: