telugudanam.co.in

      telugudanam.co.in

   

వరంగల్‌

వరంగల్‌లో చూడవలసినవి కేవలం మూడు ప్రదేశాలు మాత్రమే. ఒకటి భద్రకాళి గుడి, రెండు వెయ్యి స్తంభాల గుడి. ముడవది కాకతీయుల కోట. ఇందులో భద్రకాళి గుడి, వెయ్యి స్తంభాల గుడి ఊరి మధ్యలోనే వున్నాయి. ఈ రెండు చోట్లకు సిటీ బస్సులో వెళ్లి చూసిరావచ్చు. వరంగల్‌కోట ఊరి బయట వుంది. రైల్వే స్టేషను నుంచి గాని, బస్సు స్టాండ్‌ నుంచిగాని స్ుమారు నాలుగు కి.మీ దూరం వుంటుంది. ఈ కోట వరకు కూడా సిటీబస్సులు ఉన్నాయి. కాని వెంట వెంటనే లేవు. విచారించుకుని వళ్లటం మంచిది. అనుకూలం ఉన్నవారు ఒక ఆటోరిక్షా కుదుర్చుకుంటే, సుమారు నాలుగు గంటల లోపు ఈ మూడు ప్రదేశాలను చూడవచ్చు. వరంగల్‌లో ఉన్న భద్రకాళి ఆలయం, మన రాష్ట్రంలోనే గాక మన దేశంలోనే వున్న అతి పురాతనమైన ఆలయాలలో ఒకటి. చాణక్య చక్రవర్తి రెండవ పులకేశి క్రీ.శ.625 వ సం||లో ఈ ఆలయంలోని అమ్మవారిని దర్శించుకున్నట్లు ఈ ఆలయంలోనం ఉన్న ఒక శాసనంలో ఉంది. అంటే అప్పటికే ఇక్కడ ప్రసిద్ధంగా ఉందన్నమాట. ఇక వెయ్యి స్తంభాల గుడి అసలు పేరు రుద్రేశ్వర ఆలయం. ఈ ప్రాంగణంలోనే, ఈ ఆలయాన్ని ఆనుకునే వెయ్యి స్తంభాలు ఉన్న ఒక కళ్యాణ మండపం ఉంది. అందువల్ల అసలు గుడినే వెయ్యి స్తంభాల గుడి అని వ్యవహరించడం సధారణమై పోయింది. పదవ శతాబ్దంలో నిర్మింపబడిన ఈ రుద్రేశ్వరాలయం తెలుగు వారందరూ తల ఎత్తి గర్వంగా చెప్పుకోవలసిన కట్టడం. దీనిని గూర్చి వర్ణించడం ఇక్కడ కుదరదు. ఇక వరంగల్‌ కోట అనబడే చోట ఉన్నవి కూడా శిధిలమైన శిల్పాల ముక్కలు చుట్టూ ఉన్న ప్రాకారపు గోడ పూర్తిగా శిధిలమైపోయి, అక్కడొకముక్క, ఇక్కడొక ముక్క వుండి, ఇక్కడొక కోట ఉండేదని మాత్రమే తెలుస్తుంది. కోట లోపల భాగమంతా ఇప్పుడు పెద్ద మైదానం లాగ వుండి, తుప్పులు, పొదలతో నిండి పోయింది. ఈ కోట లోపల చాలా ఆలయాలు, అద్భుతమైన కట్టడాలు వుండేవట. శిధిలమైపోయిన ఆ కట్టడాలలో దొరికిన కొన్ని ముక్కలను ఒక చోట చేర్చి చిన్న మ్యూజియం ఏర్పాటు చేశారు. అప్పుడున్న కోటకు నాలుగు వైపులా నాలుగు ద్వార తోరణాలు ఉండేవి. వాటిని మాత్రం జాగ్రత్తగా పదిలపరిచి ఈ మైదానం లోపల నిలబెట్టి ఉంచారు. ఆసక్తి ఉన్నవారు వరంగల్‌ నుంచి సుమారు అరవై కి.మీ. దూరంలోవున్న రామప్ప దేవాలయం చూసి రావచ్చు.

Telugudanam.co.in
వెనుకకు | మొదటి పేజీ | తెలుగుదనం బ్లాగు | మాగురించి | సలహాలు | పత్రికలలో తెలుగుదనం                                సందర్శకుల సంఖ్య: