|
www.telugudanam.co.in చీరాల |
పత్రికలలో తెలుగుదనం |
మా అనుబంధ వెబ్‌సైట్.. |
|||
| తెలుగుదనం బ్లాగు | |||||
| మా గీతా.కో.ఇన్ |
డైటింగ్
సరైన ఆహారనియంత్రణ, వ్యాయామాల సమ్మేళనమే డైటింగ్. డైటింగ్ కేవలం బరువు తగ్గించుకోవడానికి కాకుండా అనవసరమైన క్యాలరీలు శరీరంలో పేరుకుపోయి తద్వారా శరీర సహజక్రియలు సరిగా పనిచేయక ఆ ప్రభావం ఆరోగ్యం మీదా మీ రోజువారీ కార్యక్రమాల మీద పడకుండా ఉండడానికి దోహదం చేస్తుంది. ఏ వయసులోనైన ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉండడానికి దోహదం చేస్తుంది. డైటింగ్ చేస్తున్నవారు ఏఏ సమయాల్లో ఎలాంటి ఆహారాన్ని తీసుకోవాలి. ఏ ఆహారపదార్థాలు నిషిద్దం, తీసుకోవాల్సిన జాగ్రత్తలు తెలుసుకుందాం.
ఉదయంపూట అల్పాహారం
గోరువెచ్చటి పాలు, కార్న్‌ప్లేక్స్, బ్రెడ్డు గుడ్డులోని తెల్లని పదార్థాలు రెండు, పండ్లు, ఇడ్లీ, బిస్కెట్లు, టీ.
స్నాక్స్ సమయంలో
పండ్లు, బ్రెడ్డు, బిస్కెట్లు, కొబ్బరినీళ్ళు, మధ్యాహ్నం ఆహారంలో గోధుమ రొట్టెలు, అన్నం, పప్పులు, కూరగాయలు, పెరుగు, పండ్లూ లేదా సూప్, రోస్ట్ లేదా గ్రిల్ చేసిన చికెన్ లేదా చేపలు, మాకరోని.
రాత్రిభోజనం
చపాతీలు, అన్నం, సూప్, కూరగాయలు, సలాడ్‌లు, చేపలు, చికెన్.
పైన చెప్పినవన్నీ మామూలుగా డైటింగ్ చేసేవారే కాక మామూలు వారు కూడా అనుసరించవచ్చు. ఒకవేళ, మీరు లావు తగ్గించుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లైతే ఎలాంటి ఆహార జాగ్రత్తలు పాటించాలో క్రింద ఇచ్చిన వివరాలు చూడండి.
తప్పనిసరిగా చేయాల్సినవి
రెండు బిస్కెట్లు, పండ్లు, బ్రెడ్డు, (ఒక స్లైసు చాలు) ఇడ్లీలు, వెన్నతీసిన పాలు, కార్న్‌ప్లేక్స్.
తీసుకోకూడనివి
ఫ్రై చేసిన పదార్థాలు (ఉదా. ఒక వడాపావ్‌లో 10 బ్రెడ్డు ముక్కలకు సమానమైన క్యాలరీలు ఉంటాయి) కొవ్వుశాతాలు ఎక్కువగా ఉండే వెన్న, మీగడ, పెరుగు, నెయ్యి, మాంసం, గుడ్డులోని పచ్చసొన, అరటి పండ్లు, సోయాబీన్, పండ్లరసాలు, కృత్రిమంగా తయారైన సూప్‌లు.
పాటించాల్సిన ఆహారపు అలవాట్లు
తీపిపదార్థాలు, వేపుడు పదార్థాలు వీలయినంత వరకు తగ్గించండి.
తక్కువ మొత్తంలో ఎక్కువసార్లు తింటుండండి. గంటకు ఒకసారి కొంతకొంత తినడం ఉత్తమం. దీనిద్వారా అసిడిటీకి దూరంగా ఉండవచ్చు.
తినేటప్పుడు ఒకేసారి కంచంలో మొత్తం వడ్డించుకోకుండా కొద్దికొద్దిగా పెట్టుకొని తినండి.
ఆహారంలో ఎక్కువగా సలాడ్స్ ఉండేలా చూసుకోండి. దీనివల్ల ఏదైనా జీర్ణంకాని పదార్థాలు మీ జీర్ణవ్యవస్థను ఇబ్బంది పెడుతుంటే ఈ సలాడ్స్ ఎంతో ఉపయోగకరంగా పనిచేస్తాయి.
మీరు తీసుకొనే ఆహారానికి సరిపడా శ్రమ మీ శరీరం చేస్తున్నట్లయితే మీరు 20 ఏళ్ళ వయసులో ఎంత బరువున్నారో 50 ఏళ్ళకు, 60 ఏళ్ళకు కూడా అలాగే ఉండవచ్చు. అంతే ఉత్సాహంగా కూడా. ఇవన్నీ చేసే ముందు డైటింగ్ చేయడం మీకు అవసరమేనా అనే విషయాన్ని వైద్య సలహా తీసుకోవడం ముఖ్యం. లేనట్లయితే మీ ఆరోగ్యాన్ని మీరే చేజేతులారా పాడుచేసుకున్న వారవుతారు.
వెనుకకు | మొదటి పేజీ | ఆఖరి సారి మెరుగు పరిచిన తేది: 25-03-2009 | హక్కులు: తెలుగుదనం.కో.ఇన్ | రూపకర్త: గీతా.కో.ఇన్ | ప్రశ్నలు, సలహాలు, సూచనలకు: editor@telugudanam.co.in