www.telugudanam.co.in         చీరాల

తెలుగు పాఠాలు

చిన్నపిల్లల కోసం

మాగురించి

పత్రికలలో తెలుగుదనం

               మా అనుబంధ వెబ్‌సైట్..

సంస్కృతి, సంప్రదాయాలు

వనితల కోసం

సైట్‌మ్యాప్

తెలుగుదనం బ్లాగు

సాహిత్యం

అందరికోసం

సలహాలు

మా గీతా.కో.ఇన్

పరీక్షలకు చదివేటప్పుడు ఎలా...

ఏకాగ్రతగా చదివితేనే, ఒత్తిడికిగురికాకుండా చదివిందంతా ఒక పద్ధతిప్రకారం సమీక్షించుకోగలిగితేనే పరీక్షలలో మంచి ఫలితాలు పొందవచ్చు. తేలికగా వుండే శ్వాస వ్యాయామాలు...చాలాసేపు కదలకుండా కూర్చుని చదవగలిగే ఏకాగ్రతనిస్తాయి. రిలాక్సేషన్ వ్యాయామాలు మనసు మీద వత్తిడి పడకుండా చూస్తాయి. అసలే పరీక్షల హడావుడిలోవుంటే ఈ గొడవేంటని విసుక్కోకుండా ఈ చిన్నచిన్న వ్యాయామాలు చేసి చూడండి ఎంత తేడా ఉంటుందో మీకే తెలుస్తుంది. ఏమేమి చేయవచ్చంటే...

పరీక్షలముందు సెలవులు కూడా ఇస్తుంటారు. కాబట్టి ఇక గంటల తరబడి కదలకుండా కూర్చున్నా ఆశ్చర్యం లేదు. పాఠ్యగ్రంథాలను ఓ పట్టు పట్టేస్తుంటాము. అయితే అలా కూర్చోవడం వల్ల నడుంనొప్పి, మెడనొప్పి రావడం సహజం. వ్యాయామం చేసి ఆరోగ్యంగా వుంటే ఈ నొప్పులేవీ రావు. వాకింగ్ కి వెళ్ళేటప్పుడు వంటరిగా కాకుండా స్నేహితురాలినో, అన్నయ్యనో, అమ్మనో వెంటబెట్టుకొని వెళ్ళండి. చదువు విషయాలు కాకుండా వేరే విషయాలు మాట్లాడుకుంటూ నడవండి. అలాగే సాయ్రంత్రం వేళ కుటుంబసభ్యులతో కలిసి కాసేపు షటిల్ ఆడితే సరదాగా ఉంటుంది. మనసు సేదతీరడానికి ఇలాంటి వ్యాయామాలు ఎంతో ఉపకరిస్తాయి. శరీరం ఆరోగ్యంగా వుంటే ఏకాగ్రతా పెరుగుతుంది. ఆశావాహ దృక్పధం అలవడుతుంది. ఆత్మవిశ్వాసం పెరిగి పరీక్షలను సమర్ధంగా ఎదుర్కొన గలిగే ధైర్యం పెరుగుతుంది. కాబట్టి రోజూ కాసేపు  చదువు మధ్యలో లేచి అలా ఒళ్ళు విరుచుకొని ఒక ఆట ఆడిరండి. రెట్టించిన ఉత్సాహంతో మళ్ళీ చదువులో నిమగ్నం కావచ్చు.

నేటి పోటీప్రపంచం పిల్లల మెదడును అవసరానికి మించి శ్రమకు గురి చేస్తూ, శరీరాన్ని శ్రమకు, ఆటలకు దూరం చేస్తున్నది. అయితే ఇది అంత మంచిది కాదు.


వెనుకకు | మొదటి పేజీ | ఆఖరి సారి మెరుగు పరిచిన తేది: 25-03-2009 | హక్కులు: తెలుగుదనం.కో.ఇన్  | రూపకర్త: గీతా.కో.ఇన్ | ప్రశ్నలు, సలహాలు, సూచనలకు: editor@telugudanam.co.in