|
www.telugudanam.co.in చీరాల |
పత్రికలలో తెలుగుదనం |
మా అనుబంధ వెబ్సైట్.. |
|||
| తెలుగుదనం బ్లాగు | |||||
| మా గీతా.కో.ఇన్ |
ఇల్లే జిమ్ లా...
సన్నగా మెరుపుతీగలా మెరవాలని జిమ్‌లో చేరారు మీరు. రోజూ ఉత్సాహంగా వెళుతున్నారు... ఉన్నట్టుండి ఒక రోజు 'అబ్బా బద్దకంగా ఉన్నది ఇవ్వాళ్ళొద్దులే రేపు చూద్దామంటూ డుమ్మా కొట్టారు. రెండో రోజు వెళ్ళలేక పోయారు. అటువంటప్పుడు నేనైతే ఇలా చేస్తానంటున్నారు ఓ పేరొందిన ఫిట్ నెస్ నిపుణురాలు.
జిమ్ కు వెళ్ళాలనిపించనప్పుడు ఇంట్లోనే నచ్చిన మెచ్చిన పనిని చేయాలి. ఒక గదిలో నచ్చిన సంగీతాన్ని పెట్టుకొని డాన్స్ చేయాలి. కనీసం ఒక అరగంటైనా ఇలా గడపాలి.
ప్రశాంతంగా ఎటువంటి శబ్దాలు లేకుండా ఉండటం నచ్చుతుందా! అయితే యోగా చేస్తే సరి.
ప్రతిరోజూ ఒకే రకమైన పనులు కాకుండా కొంచెం వైవిద్యం ఉండే వాటిని ఎంచుకోవాలి.
ఒక డైరీ పెట్టుకొని జిమ్‌కు వెళ్ళినప్పటినుంచి ఎంతమార్పు వచ్చిందో రాసుకోవాలి.
అద్దంలో మనల్ని మనం చూసుకోవాలి అలా చూసుకొంటే మనకు మనమే ఆదర్శమై వెంటనే జిమ్‌కు వెళ్ళడానికి సంసిద్దమౌతాము.
శరీరాకృతిలో తేడాల్ని, మార్పుల్ని, స్నేహితులను కుటుంబసభ్యులను అడుగుతుంటే... ఇంకా వ్యాయామం చేసి సన్నబడాలనిపిస్తుంది.
జిమ్ కు వెళ్ళకమునుపు మీరు ఎలా ఉన్నారో గుర్తుచేసుకోవాలి. పాత ఫొటోను పెట్టుకోవాలి. ఇంట్లో కనిపించేలా ఆ ఫొటోను పెట్టుకోవాలి. దాన్ని చూసినప్పుడల్లా సన్నబడాలనే కోరిక పెరుగుతుందని.
ఇన్ని చేసినా బద్దకంగా అనిపిస్తే అలా వాకింగ్ లా ఎడ్ మిల్ చేయాలట. ఒకేసారి వాకింగ్ చేసినట్టు ఉంటుంది. జిమ్ కు వెళ్ళినట్టు అనిపిస్తుంది.
వెనుకకు | మొదటి పేజీ | ఆఖరి సారి మెరుగు పరిచిన తేది: 25-03-2009 | హక్కులు: తెలుగుదనం.కో.ఇన్ | రూపకర్త: గీతా.కో.ఇన్ | ప్రశ్నలు, సలహాలు, సూచనలకు: editor@telugudanam.co.in