www.telugudanam.co.in         చీరాల

తెలుగు పాఠాలు

చిన్నపిల్లల కోసం

మాగురించి

పత్రికలలో తెలుగుదనం

               మా అనుబంధ వెబ్‌సైట్..

సంస్కృతి, సంప్రదాయాలు

వనితల కోసం

సైట్‌మ్యాప్

తెలుగుదనం బ్లాగు

సాహిత్యం

అందరికోసం

సలహాలు

మా గీతా.కో.ఇన్

పెద్దల ఆటలు (కొన్ని)

అంత్యాక్షరి

ఈ ఆటను ఎంతమంది అయినా ఆడవచ్చు, ఒక్కరుగా ఆడవచ్చు లేదా గ్రూపులు గ్రూపులుగా ఆడవచ్చు. ఈ ఆట ఆడే వారికి సినిమా పాటలు తెలిసి ఉంటే చాలు. మొదట ఆట నిర్వహించే వారు ఒక అక్షరం చెబితే ఆ అక్షరం మీద మొదటి వారు లేదా మొదటి గ్రూపు వారు పాట మొదలు పెడతారు, తరువాత వారు ముందు వారు ఆపిన పాట చివర అక్షరంతో మొదలు పెట్టాలి, ఇలా ఆడుతూ ఉండాలి. అంటే ఎలా అంటే

ఉదా: ఆట నిర్వహించే వారు '' అనే అక్షరం ఇస్తే, మొదటి వారు ''  అనే అక్షరం మీద పాట పాడాలి.

"ౌనం గానే ఎదగ మని మొక్క నీకు చెబుతుంది ఎదిగిన కొద్ది ఒదగమని అర్ధమందులో ఉంది.

అపజయాలు కలిగిన చోటే గెలుపు పిలుపు వినిపిస్తుంది ఆకులన్ని రాలిన చోటే కొత్త చిగురు కనిపిస్తుంి."

ఇప్పుడు '' అనే అక్షరం మీద రెండవ వారు పాట పాడాలి.

"ాయి దాయిదామ్మా కునికే కుందనాల బొమ్మ  నీతో పనివుందమ్మా నడిచే కొండపల్లి బొమ్మ"

ఇప్పుడు 'మ' అనే అక్షరం మీద తరువాత వారు ఇలా ఆడుతూ ఉండాలి.

మీకు అంత్యాక్షరి ఆడుకోవటానికి పల్లవులు కావాలంటే ఇక్కడ క్లిక్ చేయండి

ఆడవారు పెట్టుకొనే ఆభరణాలపేర్లుచెప్పే ఆట

ఈ ఆటను నిర్వహించేవారు ముందుగా అందరికీ తెల్ల కాగితం, పెన్ను ఇచ్చి వారి పేరు వ్రాసి ఉంచుకోమని చెప్పాలి. తరువాత అందరినీ ఆడవారు పెట్టుకొనే బంగారు ఆభరణాల పేర్లని వ్రాయమనాలి. తలలో పెట్టుకొనే వస్తువుల నుంచి కాలివరకు ఏమి వస్తువులు ఉంటాయో వ్రాయాలి.

 

ఉదా: గీగరం, సూర్యుడు, చంద్రుడు, రాళ్ళపిన్నులు, రాళ్ళ క్లిప్పులు, బంగారపు జడ దగ్గరనుంచీ వడ్డాణం , తాళాలగుత్తి, మొదలైనవి అన్నమాట. సమయం ఎంత పెట్టాలి అనేది నిర్వహించేవారి ఇష్టం. ఒక్క  నిముషం కానీ లేదా మూడు నిమిషాలు కానీ పెట్టుకోవచ్చు. మాములుగానే అందరు వ్రాసిన వస్తువులను చూసి లెక్కపెట్టి ఎవరు ఎక్కువ రాస్తే వారే గెలిచినట్టు.

అక్షరాలతో పదాలు

ఈ ఆట కూడా ఒక్క నిమిషము ఆడే ఆట. దీనికి కావలసినవి పేపరు మరియు పెన్ను. నిర్వహించేవారు అందరికీ పేపరు, పెన్ను ఇచ్చి ఈ ఆటలో పాల్గొనేవారందరి పేర్లు రాయమని చెప్పండి. లేదా మీరే అందరి పేర్లు పేపర్లో రాసి ఇస్తే ఇంకాతేలిక.

ఆ పేపరును ఈ విధంగా సెట్ చేయండి.

ఉదా:

పేరు

    సీరియల్ పేరు

     సినిమాపేరు

కమల

కలిసుందాం రా

కార్తీకదీపం

రాధ

...

...

అలా అన్నీ వరుసగా మీ ఆటలో పాల్గొనేవారి పేర్లురాసి పేపర్లు పంచండి.

ఈ ఆటలో పాల్గొనేవారు సీరియల్ పేరు, సినిమాపేరు వ్రాయాలి. ఒక్క నిముషములో ఎవరైతే ఎక్కువ రాస్తారో వారే గెలిచినట్లు.

అష్టాదశ శక్తిపీఠాలు పేర్లు

ఈ ఆట లో పాల్గొనే వారందరికీ ఆట నిర్వహించేవారు పేపరు పెన్ను ఇవ్వాలి. ఆట ఏమిటంటే ఒక్క నిముషంలో అష్టాదశ శక్తిపీటాల పేర్లు వ్రాయాలి. ఎవరైతే ఎక్కువ రాస్తారో వారే విన్నరు.

నిర్వహించేవారి కోసము

అష్టాదశ శక్తిపీఠాలు

శ్రీ శాంకరీ దేవి

-

శ్రీలంక

శ్రీ కామాక్షి దేవి

-

కంచి

శ్రీ సింహళ దేవి

-

ప్రద్యుమ్నం

శ్రీ చాముండీ దేవి

-

కంసపట్టణం

శ్రీ జోగుళాంబా దేవి

-

అలంపురం

శ్రీ భ్రమరాంబా దేవి

-

శ్రీశైలం

శ్రీ మహాలక్ష్మీ దేవి

-

కొల్లాపురం

శ్రీ ఏకవేణికా దేవి

-

మహారాష్ట్ర

శ్రీ మహాకాళీ దేవి

-

ఉజ్జయినీ

శ్రీ పురుహుతికా దేవి

-

ఉజ్జయినీ

శ్రీ గిరిజా దేవి

-

ఒఢ్వాణం

శ్రీ మాణిక్యా దేవి

-

చిత్రకూటం

శ్రీ కామరూపా దేవి

-

హరిక్షేత్రం

శ్రీ మాధవీశ్వర దేవి

-

ప్రయాగ

శ్రీ వైష్ణవీ దేవి

-

జ్వాలాక్షేత్రం

శ్రీ సర్వమంగళా దేవి

-

గయ

శ్రీ విశాలక్ష్మీ దేవి

-

వారణాసి

శ్రీ సరస్వతీ దేవి

-

కాశ్మీర్

కంపెనీ ఉత్పత్తుల యొక్క పేర్లు

ఈ ఆటకి, ముఖ్యమైన వ్యక్తి,  ఆట నిర్వహించేవారు, ఆటలో పాల్గొనే వారందరికీ పేపరు, పెన్ను ఇవ్వాలి.

ఈ ఆట ఏమిటంటే సోప్స్, షాంపూస్, పేస్టూ, సర్ఫ్, చీరలు లాంటి ప్రొడక్ట్స్ కొన్ని ఇచ్చివాటి కంపెనీ పేర్లు వ్రాయమనాలి.

ఎవరైతే ఎక్కువ ప్రొడక్ట్స్ యొక్క కంపెనీ పేర్లని వ్రాస్తే వారే గెలిచినట్లు.


వెనుకకు | మొదటి పేజీ | ఆఖరి సారి మెరుగు పరిచిన తేది: 25-03-2009 | హక్కులు: తెలుగుదనం.కో.ఇన్  | రూపకర్త: గీతా.కో.ఇన్ | ప్రశ్నలు, సలహాలు, సూచనలకు: editor@telugudanam.co.in