www.telugudanam.co.in         చీరాల

తెలుగు పాఠాలు

చిన్నపిల్లల కోసం

మాగురించి

పత్రికలలో తెలుగుదనం

               మా అనుబంధ వెబ్‌సైట్..

సంస్కృతి, సంప్రదాయాలు

వనితల కోసం

సైట్‌మ్యాప్

తెలుగుదనం బ్లాగు

సాహిత్యం

అందరికోసం

సలహాలు

మా గీతా.కో.ఇన్

క్రికెట్

క్రికెట్ ఆట నిబంధనలు

టెక్నిక్‌లు:

1.బ్యాటింగ్

2. ఫీల్డింగ్

3.బౌలింగ్

బ్యాటింగ్:

బ్యాట్స్‌మన్ 'స్టంప్స్' కు వరుసలో స్థానం ఎంచుకుంటాడు మిడిల్ లేక లెగ్ స్టంప్ వరుసలో ముఖ్యంగా ఎంచుకుంటాడు. బౌలర్ బంతి విసురుటకు ముందు తీసుకొను పరుగు సమయం నుండి దానిని విడుదల చేయువరకు అతని కదలికలో క్రింది వాటిని బ్యాట్స్‌మన్ పరిశీలించాలి.

గ్రిప్:

రెండు చేతులు దగ్గరగా, ఒకదానిపై మరొకటి లేకుండా, బ్యాట్ యొక్క హాండిల్ మధ్యలో తూచి పట్టుకోవాలి. వేళ్ళు, బొటన వేళ్ళుతో హాండిల్ చుట్టూ గట్టిగా పట్టుకోవాలి. ఎడమచేతితో బ్యాట్‌ను గట్టిగా, అనువుగా పట్టుకోవాలి.

పొజిషన్:

రెండు పాదములు 'పాపింగ్ క్రీజ్' కు సమాంతరంగా లైనుకు రెండు వైపుల రెండు పాదములు వుంచి నిలబడాలి. రెండు పాదముల మధ్యదూరము సుమారు ఆరు అంగుళాలు ఉండాలి. వెనుక పాదము, క్రీజ్ లోపల ఉండాలి. శరీర బరువు సమానంగా, మోకాళ్ళు కొద్దిగా వదులుగా, కదలికకు వీలుగా ఉంచాలి.

బ్యాట్‌ను ఉపయోగించే విధానము:

బ్యాట్‌ను బాగా పైకి ఎత్తవద్దు. ఆటలో బంతికొరకు ప్రయత్నంలో అవసరమయినంత ఎత్తు వరకు మాత్రం ఎత్తాలి. బ్యాక్-లిఫ్ట్ కొరకు బ్యాట్స్‌మన్ బ్యాట్‌ను మిడిల్ స్టంప్‌కు సమానంగా ఎడమ మోచేతిని కొద్దిగా వంచి, కుడిచేతిని బ్యాట్ వైపుకు త్రిప్పి ఉపయోగించాలి. బ్యాక్ డిఫెన్సు షాట్, మీడియం ఫేస్‌ల సమయంలో కూడా బ్యాట్‌ను జాగ్రత్త వహించి ఉపయోగించాలి.


వెనుకకు | మొదటి పేజీ | ఆఖరి సారి మెరుగు పరిచిన తేది: 25-03-2009 | హక్కులు: తెలుగుదనం.కో.ఇన్  | రూపకర్త: గీతా.కో.ఇన్ | ప్రశ్నలు, సలహాలు, సూచనలకు: editor@telugudanam.co.in