telugudanam.co.in

      telugudanam.co.in

   

క్రికెట్

క్రికెట్ ఆట నిబంధనలు

  • క్రికెట్ మ్యాచ్ రెండు జట్ల మధ్య ఆడబడును. ఒక్కొక్క జట్టులో పదకొండు మంది ఆడతారు.
  • జట్టుకు సారధ్యము వహించుటకు కెప్టెను ఉన్నా కెప్టెన్ హాజరుకాని పక్షములో వైస్ కెప్టెన్ ఆతని స్థానములో వ్యవహరించును.
  • ఆటగాడు గాయపడినా, అనారోగ్యమైనా ప్రత్యామ్నాయ ఆటగానిని అనుమతించవచ్చును. ప్రత్యామ్నాయ ఆటగాడు ఫీల్డింగ్ చేయుట లేక వికెట్ల మధ్య పరుగెత్తుటకు అనుమతించబడును. అతను బౌలింగ్, బ్యాటింగ్ చేయుటకు అనుమతించరాదు.
  • ఇన్నింగ్స్ ప్రారంభమునకు ముందు రెండు చివర్లు, ఆట పర్యవేక్షణకు ఇద్దరూ 'అంపైర్లు' నియమించబడతారు. ఆట ప్రారంభ సమయానికి 30నిమిషాలు ముందుగా అంపైర్లు తమ స్థానాలలో ఉండాలి. ఆట పూర్తి అగు వరకు వారు తమ విధి నిర్వహణలో ఆట స్థలంలో ఉండాలి.
  • పరుగులు, బౌలింగ్ వివరములు, 'స్కోరు షీట్' లో రికార్డు చేయుడానికి 'స్కోరర్లు' నియమించబడతారు. వారు అంపైర్లు యిచ్చు తాఖీదులు (Instructions) , సంజ్ఞలు (Signals) ప్రకారం స్కోరు రికార్డు చేయాలి. అంపైర్ల సిగ్నల్స్ కు అందినట్లుగా జవాబు చెప్పవచ్చును.
  • అనుమానము ఏదైన కలిగిన స్కోరరు పరుగులు, మొదలగునవి రికార్డు చేయడానికి ముందు అంపైర్లను సంప్రదించవచ్చును.
  • క్రికెట్ బ్యాటు 4 1\2 అంగుళాల వెడల్పు మించి యుండరాదు. ఆలాగే పొడవు 38 అంగుళాలు మించరాదు.
  • బంతి బరువు 5 3\4 అవున్సులు మించకుండా, 5 1\2 అవున్సులు తగ్గకుండా ఉండాలి. మరియు పరిధి 9 అంగుళాలు మించకుండా, 8 13\16 అంగుళాలు తగ్గకుండా ఉండాలి.
  • క్రికెట్ పిచ్ 5 అడుగులు వెడల్పు కలిగి, వికెట్ల మధ్యనుండి 2 1/2 అడుగులు రెండువైపుల కలిగి బౌలింగ్ క్రీస్ వద్దయుండి, వికెట్ల మధ్య కలిసి ఉండాలి.
  • ఆట ప్రారంభమునకు ముందు పిచ్ ఎంపిక, తయారుచేయు బాధ్యత వహించువారిపై కలదు. ఆట ప్రారంభము అయిన తర్వాత పిచ్ ను జాగ్రత్తగా కాపాడవలసిన బాధ్యాత అంపైర్లకు కలదు.
  • ఆట మధ్యలో 'పిచ్' ను మార్చరాదు. అయితే, రెండు జట్ల కెప్టెన్‌లు ఇష్టపడితే మార్చవచ్చును.
  • వికెట్ అనగా మూడు 'స్టెంప్స్', వాటిపై యుండే రెండు 'బెయీల్స్' నేలపై నిలబెట్టబడి రెండు వికెట్ల మధ్య దూరం 22 గజాలు యుండి, ఒకదానికి మరొకటి తిన్నగా, ఎదురుగా ఉండాలి.
  • వికెట్ల మధ్యదూరము 9 అంగుళాలు కలిగి, స్టంప్స్ పై గల బెయీల్స్ అర అంగుళాలు కలిగి, స్టంప్స్ పై గల బెయీల్స్ అర అంగుళము మించి పైకి కనిపించరాదు.
  • పిచ్‌ను ఆట ప్రారంభము ముందు, మరియు ఆ రోజు ఆట ప్రారంభమునకు ముందు 'రోల్' చేయాలి. రెండు జట్ల కెప్టెన్లు అంగీకరించినను, ఆట సమయంలో అవసరమనిపించినను చేయవచ్చును. అటువంటి సమయంలో పిచ్ ను తడపుట, రోలింగ్ 7 నిమిషాలు మించి చేయరాదు.
  • బ్యాట్స్‌మన్ పిచ్‌ను తన బ్యాట్ తో కొట్టి పరీక్షించవచ్చును. వాతావరణం తడిగా యుండినప్పుడు పిచ్ పై బౌలర్స్ బంతి వలన బ్యాట్స్‌మన్, ఇతర ఆటగాళ్ళ వలన ఏర్పడిన రంధ్రాలు, గోతులను అంపైర్లు శుభ్రము చేయించి, చదును చేయించి ఆటకు ఆటంకము లేకుండా చేయాలి.
  • 'బౌలింగ్ క్రీజ్' ఎనిమిది అడుగుల, ఎనిమిది అంగుళాల పొడవు కలిగి స్టంప్స్‌తో సమానరేఖ వలే ఉండాలి. స్టంప్స్ మధ్యలో ఉండి, 'రిటన్ క్రీజ్'ని వికెట్ల వెనుకగా, స్టంప్స్‌కు సమకోణము కలిగి ఉండాలి.
  • 'పాసింగ్ క్రీజ్', ' బౌలింగ్ క్రీజ్' లకు నాలుగు అడుగులు ముందు సమాంతరముగా ఉండాలి. పొడవు ఎంతైనా యుండవచ్చును.
  • మ్యాచ్ లో ఒక్కొక్క జట్టు రెండు ఇన్నింగ్స్ ఆడాలి. జట్లు ఒకటి విడిచి మరొక ఇన్నింగ్ ఆడాలి. మూడు రోజులు అంతకన్న మించిన రోజుల పోటీలో ఒక జట్టు 150 పరుగులకన్న ఎక్కువ తేడా మొదటి ఇన్నింగ్స్ లో సాధించి యుండిన, రెండవ రోజు పోటీలో 100 పరుగుల కన్న ఎక్కువ తేడా యుండిన, ఒక రోజు పోటీలో 75 పరుగులు కన్న ఎక్కువ తేడాయుండిన, ఎక్కువ పరుగులు సాధించిన మొదటి జట్టులో 'ఫాలో-ఆన్' కోరే హక్కు కలదు. అప్పుడు తక్కువ పరుగులు చేసిన రెండవ జట్టు రెండవ ఇన్నింగ్ ఆడవలిసిన (బ్యాటింగ్) చేయచుండును.
  • ఆట విరామం, ఆ రోజు ఆట సమాప్తి, లేక ఆట అనంతరం అంపైర్లు 'టైమ్ ' ప్రకటించి, రెండు వైపుల వికెట్ల పైగల 'బైయీల్స్ ' తొలగించాలి.
  • బంతి ఆటలో ఉండగా, బ్యాట్స్‌మన్ బంతిని తన బ్యాట్‌తో కొట్టి లేక మరే విధంగానైన రెండవ చివర్ల గల 'పాపింగ్ క్రీజ్' కు పరుగు (రన్) చేయవలెను.
  • బ్యాట్స్‌మన్ 'రన్ ' పూర్తిచేయక (షార్ట్ రన్ ) తిరిగి తన స్థానమును క్రీజ్ వద్దకు చేరిన, లేక స్ట్రెయికర్ 'కాట్' (బంతిని పట్టుకొన్న) పరుగు (రన్) లభించదు. బ్యాట్స్‌మన్ రన్-అవుట్ అయిన కూడా రన్ లెక్కించబడదు.
  • ఆట ప్రారంభమునకు ముందు ఆటస్థలం సరిహద్దులు (బౌండరీస్) నిర్ణయించబడును. స్ట్రెయికర్ హిట్ చేసిన బంతి బౌండరీ సరి హద్దును దాటినా లభించే పరుగులను కూడా ఆట ప్రారంభమునకు ముందు నిర్ణయించాలి.
  • ఓవర్-త్రో వలన బౌండరీ లభించిన, బ్యాట్స్‌మన్ అప్పటికి చేసిన పరుగులను బౌండరీ వలన లభించిన పరుగులు కలుపబడును.
  • ఆటలో గల బంతి కనిపించనియెడల, ఫిల్డ్ మాన్ 'లాస్ట్ బాల్ ' అనవచ్చును. దీనికి బ్యాట్స్‌మన్‌కు ఆరు పరుగులు లభించును. 'లాస్ట్ బాల్ ' అని ప్రకటించకముందు, ఆరుకన్న ఎక్కువ పరుగులు చేసిన యెడల, ఆ విధంగా చేసిన అన్ని పరుగులు అతని స్కోరుకు చేర్చబడును.
  • ఓవర్‌కు 6 లేక 8 బంతులు. ఆట ప్రారంభించుటకు ముందు ఓవరుకు ఎన్ని బంతులు అనేది నిర్ణయం జరగాలి. ఓవరు ఒక వికెట్ వైపు పూర్తి అయిన రెండవ వికెట్ వైపు ప్రారంభించాలి.
  • బౌలర్ ఓవర్ పూర్తి చేయాలి. కాని గాయపడిన లేక 'టెక్నికల్ ఫాల్ట్ ' కు తాత్కాలికముగా సస్పెండ్ చేసిన మినహాయింపు, 'నో-బాల్ ' లేక 'వైడ్-బాల్'లు ఓవర్‌ల బాల్ చేయబడిన బంతులలో లెక్కించరాదు.
  • బంతి గనుక వికెట్-కీపర్, లేక బౌలర్ చేతిలోకి వెళ్ళిన లేక బౌండరీ దాటిన ఆ బంతిని 'డెడ్ ' అంటారు. బౌలర్ పరుగు ప్రారంభించుట లేక బౌలింగ్ చర్యలో యుండగా కూడా 'డెడ్ ' అగును.
  • బౌలర్ గనుక బౌలింగ్ క్రీజ్‌కు ఒక అడుగు వెనుక యుండనిచో, లేక విసరిన లేక జెర్కి యిచ్చిన బౌల్ చేయని యెడల అంపైర్ 'నో-బాల్'గా నిర్ణయించాలి. అయితే 'నో-బాల్' 'డెడ్-బాల్' అవదు. బ్యాట్స్‌మన్ ఆ బంతిని హిట్ చేయుట, పరుగులు చేయుట జరిగిన ఆ పరుగులు ఆతని స్కోరుకు చేర్చబడును. ఏ ఒక్క పరుగు చేయకపోయిన, ఆతని స్కోరుకు ఒక పరుగు చేర్చబడును.
  • 'నో-బాల్ ' ఆడిన బ్యాట్స్ మన్ బౌల్డ్ అయిన లేక 'కాట్' అయిన అతను 'అవుట్ ' కాదు.
  • బంతి గనుక బాగా ఎత్తుగా, లేక బాగా దూరంగ, వికెట్లకు అవతలిగా బ్యాట్స్ మన్ కు అందకుండా బౌల్ చేసిన, అంపైర్ ఆ బంతిని 'వైడ్-బాల్ ' గా నిర్ణయించాలి.
  • 'నో బాల్' వలే 'వైడ్-బాల్ కూడా 'డెడ్' అవదు. అంపైర్ స్కోరుకు మరొక పరుగు చేర్చాలి.
  • బంతి గనుక 'వైడ్ ' లేక 'నో-బాల్ ' గాక, బ్యాట్స్‌మన్ యొక్క బ్యాట్ కు తాకకుండా, లేక అతని శరీరమునకు తగలకుండా దాటిన, అతను చేసిన పరుగులను 'బై-రన్స్' గా లెక్కించాలి.
  • బంతిగనుక బ్యాట్స్‌మన్ దుస్తులు లేక శరీరమునకు, చేతులు మినహాయించి తగిలినప్పుడు చేసిన పరుగులను అంపైర్ 'లెగ్-బై'గా సంజ్ఞ చేయాలి.
  • బంతి లేక బ్యాట్స్‌మన్ బ్యాట్ లేక వ్యక్తి స్టంప్స్ పై గల 'బైయీల్స్' తొలగించిన, వికెట్ కోల్పోయినట్లు, బ్యాట్స్‌మన్ అవుట్ అయినట్లుగా ప్రకటించాలి.
  • బ్యాట్ యొక్క ఏ ఒక్క భాగం అతని చేతిలో లేక స్వాధీనములో లేక 'పాపింగ్-క్రీజ్' లైన్ వెనుక నేలను తగలియుండిన బ్యాట్స్‌మన్ 'స్టంప్డ్ - అవుట్' అగును.
  • బంతి బ్యాట్‌కు తగిలి స్ట్రోక్ వలన గాలిలోయుండగా లేక దానికి తగిలిన తర్వాత అది నేలకు లేవక ముందు ఫీల్డ్స్-మన్ పట్టుకొనిన 'కాట్' అగును.
  • బ్యాట్స్‌మన్ బంతిని తిరిగి బ్యాట్ తో కొట్టిన (స్ట్రయిక్స్ ) కాక శరీర ఏ ఒక్క భాగంతో, చేతులతో మినహాయించి కొట్టి ఆ విధంగా ఉద్దేశ పూర్వకముగా వికెట్లను రక్షించుటకు చేసిన అతను 'హిట్ ది బాల్ ట్వయిస్' (బంతిని రెండు సార్లు కొట్టినట్లు)గా డిక్లేర్ చేయాలి.
  • బ్యాట్స్‌మన్ బంతిని కొట్టుటకు ప్రయత్నించుచు, తన వికెట్లను తన బ్యాట్ తో లేక శరీరంలోని ఏ ఇతర భాగంతో అయిన కొట్టినా ఆ బ్యాట్స్‌మన్ 'హిట్-వికెట్' అవుట్ అగును.
  • బ్యాట్స్‌మన్ చేతులతో మినహాయించి, బైయీల్స్ ఎత్తులో ఉండే, తన శరీర ఏ భాగానికో అయిన, బ్యాట్స్‌మన్ ఆడటానికి ప్రయత్నించినప్పుడు, అతనికి బంతి తగిలితే అప్పుడు బ్యాట్స్‌మన్, వికెట్ల మధ్య సమాంతర రేఖ దారిలో శరీరభాగం అడ్డుకొన్నట్లుగా, అంపైర్ భావిస్తే అప్పుడు ఆ బ్యాట్స్‌మన్ ఎల్.బి.డబ్ల్యు,(లెగ్ బిఫోర్ వికెట్) గా అంపైర్ ప్రకటించును.
  • బ్యాట్స్‌మన్ ఉద్దేశ్యపూర్వకంగా బంతిని ప్రయత్నించకుండా తన 'ప్యాడింగ్' తో బంతిని అడ్డగించినట్లు అంపైర్ ఉద్దేశపడితే ఎల్.బి.డబ్ల్యుగా నిర్ణయించకపోవచ్చును.
  • బ్యాట్స్‌మన్ పరుగులు చేస్తునప్పుడు లేక మరే కారణము చేత అయిన తన క్రీజ్‌కు అవతల ఉండినప్పుడు, బంతి ఆటలో ఉండినప్పుడు, అతని వికెట్ కనుక ఏ ఒక్క ఫీల్డింగ్ ఆటగానిచే బంతితో కొట్టిన, అతని 'రన్-అవుట్ ' అగును.
  • వికెట్ కీపర్ పూర్తిగా వికెట్ల వెనుక ఉండాలి. బౌలర్ విడుదల చేసిన బంతి బ్యాట్స్‌మన్ బ్యాట్‌కు లేక బ్యాట్స్‌మన్ శరీరమునకు తగలుట, లేక వికెట్లను దాటి వెళ్ళిన, లేక బ్యాట్స్‌మన్ పరుగుకు ప్రయత్నించు వరకు అతను వికెట్ల వెనుకగా విధిగా ఉండాలి.
  • ఫీల్డ్ మన్ బంతిని తన శరీర ఏ భాగముతో అయిన నిలుపుదల చేయవచ్చును. అతను ఉద్దేశపూర్వకముగా తన ట్రోపీతో లేక మరే వస్తువుతో అయిన ఆపిన, బ్యాట్స్‌మన్ చేసిన పరుగు, లేక పరుగులకు అయిదు పరుగులు అదనముగా చేర్చాలి.
  • ఆట ప్రారంభమునకు ముందు, ఆట సమయంలో ఆట నిబంధనల ప్రకారం ఆడునట్లుగా మరియు ఉపయోగించు పరికరములు నిబంధనల ప్రకారం ఉండునట్లుగా అంపైర్ నిర్ధారణ చేసుకోవాలి. ఆటస్థలం స్వభావం ఆటకు అనువుగా ఉన్నది లేనిది నిర్ణయించే హక్కు అంపైర్లకు మాత్రం కలదు. అన్ని విధములైన ఘర్షణలు అంపైర్లు సరిచేయాలి. ప్రేక్షకులు, లేక ఏ ఆటగాడు అయిన తన నిర్ణయమును మార్చుటకు, తీర్పును త్రోసి పుచ్చడానికి తనపై వత్తిడి చేయుటకు అనుమతించరాదు.
  • బ్యాట్స్‌మన్ 'బౌల్డ్ అవుట్ ' లేక 'స్టంప్డ్-అవుట్ ', లేక 'రన్-అవుట్' లేక 'కాట్-అవుట్'పై అంపైర్ ద్రుష్టికి తెచ్చుటకు ఫీల్డ్ మన్ ఎవరైనా 'హౌ ఈజ్ దట్ ' అనవచ్చును. అంపైర్ నిర్ణయం పై కూడా ఆ విధంగా అనవచ్చును.
  • ఆటను పర్యవేక్షించచున్న ఇద్దరు అంపైర్‌లలో ఏ ఒకరైన బ్యాట్స్‌మన్ 'నాట్-ఆవుట్' ని నిర్ణయించిన, రెండవ అంపైర్ తన అధికారములో గల ప్రాంతములో జరిగిన నిర్ణయంపై సరైన కాలములో ఫీల్డ్‌మన్ 'అఫీల్' కు జవాబు తేల్చవచ్చును.
  • మరుసటి బంతి బౌలింగ్‌కు ముందు లేక 'టైమ్' ప్రకటన చేయక ముందు రెండవ జట్టు అపీల్ చేయనిచో అంపైర్ బ్యాట్స్‌మన్‌ను 'అవుట్' గా ప్రకటించరాదు.
  • బౌలర్ వికెట్ వైపుగల అంపైర్ అన్ని 'అపీల్స్'కు రెండవ అంపైర్ కన్న ముందు రన్ అవుట్ హిట్-వికెట్, స్టంప్డ్‌కు మినహాయించి జవాబు చెప్పాలి.
  • రెండవ జట్టు కన్న ఎక్కువ పరుగులు రెండు పూర్తి ఇన్నింగ్ లలో చేసిన జట్టు విజయం సాధించినట్లు.

[ వెనుకకు ]


టెక్నిక్‌లు:

  1. బ్యాటింగ్
  2. ఫీల్డింగ్
  3. బౌలింగ్

బ్యాటింగ్:

బ్యాట్స్‌మన్ 'స్టంప్స్' కు వరుసలో స్థానం ఎంచుకుంటాడు మిడిల్ లేక లెగ్ స్టంప్ వరుసలో ముఖ్యంగా ఎంచుకుంటాడు. బౌలర్ బంతి విసురుటకు ముందు తీసుకొను పరుగు సమయం నుండి దానిని విడుదల చేయువరకు అతని కదలికలో క్రింది వాటిని బ్యాట్స్‌మన్ పరిశీలించాలి.

  • బంతిని జాగ్రత్తగా చూడాలి.

  • ఏ స్ట్రోక్ ఉపయోగించవలసింది నిర్ణయించాలి.

  • పరిస్థితి ననుసరించి బంతిని సరైన సమయంలో 'షాట్ ' కొట్టాలి.

గ్రిప్:

రెండు చేతులు దగ్గరగా, ఒకదానిపై మరొకటి లేకుండా, బ్యాట్ యొక్క హాండిల్ మధ్యలో తూచి పట్టుకోవాలి. వేళ్ళు, బొటన వేళ్ళుతో హాండిల్ చుట్టూ గట్టిగా పట్టుకోవాలి. ఎడమచేతితో బ్యాట్‌ను గట్టిగా, అనువుగా పట్టుకోవాలి.


పొజిషన్:

రెండు పాదములు 'పాపింగ్ క్రీజ్' కు సమాంతరంగా లైనుకు రెండు వైపుల రెండు పాదములు వుంచి నిలబడాలి. రెండు పాదముల మధ్యదూరము సుమారు ఆరు అంగుళాలు ఉండాలి. వెనుక పాదము, క్రీజ్ లోపల ఉండాలి. శరీర బరువు సమానంగా, మోకాళ్ళు కొద్దిగా వదులుగా, కదలికకు వీలుగా ఉంచాలి.


బ్యాట్‌ను ఉపయోగించే విధానము:

బ్యాట్‌ను బాగా పైకి ఎత్తవద్దు. ఆటలో బంతికొరకు ప్రయత్నంలో అవసరమయినంత ఎత్తు వరకు మాత్రం ఎత్తాలి. బ్యాక్-లిఫ్ట్ కొరకు బ్యాట్స్‌మన్ బ్యాట్‌ను మిడిల్ స్టంప్‌కు సమానంగా ఎడమ మోచేతిని కొద్దిగా వంచి, కుడిచేతిని బ్యాట్ వైపుకు త్రిప్పి ఉపయోగించాలి. బ్యాక్ డిఫెన్సు షాట్, మీడియం ఫేస్‌ల సమయంలో కూడా బ్యాట్‌ను జాగ్రత్త వహించి ఉపయోగించాలి.


[ వెనుకకు ] [ ముందుకు ]

Telugudanam.co.in
వెనుకకు | మొదటి పేజీ | తెలుగుదనం బ్లాగు | మాగురించి | సలహాలు | పత్రికలలో తెలుగుదనం                                సందర్శకుల సంఖ్య: