telugudanam.co.in

      telugudanam.co.in

   

పిల్లల ఆటలు (కొన్ని)

డైలాగ్స్ గేమ్

ఎంతమంది ఆడవచ్చు : ఎంతమందైనా.
కావలసిన వస్తువులు : పేపరు, పెన్ను.
ఆడే స్థలం : ఎక్కడైనా.

ఈ గేమ్‌కి అన్ని ముందుగానే ప్రిపేర్ చేసుకోవాలి. ఈ గేమ్‌కి తెల్లపేపర్ మీద సినిమాలలో ఊతపదంలా వాడే పదము లేదా సెంటెన్స్ రాయాలి. ఆ వాక్యాన్ని ఎవరు ఉపయోగించారో ఏ సినిమాలోదో వ్రాయమనాలి.


ఉదా:


నేను మోనార్క్‌ని : ప్రకాశ్‌రాజ్, సుస్వాగతం
రంగు పడుద్ది : ఎ.వి.యస్., ఘటోత్కచుడు
అంతవద్దు ఇది చాలు : చిరంజీవి, హిట్లర్
దేవుడా దేవుడా దేవుడా : శ్రీదేవి, క్షణక్షణం
నా ట్రాక్ ఎ సెపరేటు : మోహన్‌బాబు, అల్లరి మొగుడు

ఈ విధంగా కొత్త లేదా పాత సినిమాలోని వాక్యాలను లీడర్ ఇష్టమైన విధంగా వ్రాసుకొని వైట్ పేపర్ మీద జవాబులు వ్రాయకుండా వ్రాసి జిరాక్సులు తీయించి కిట్టీలో గేమ్ కండక్ట్ చెయ్యాలి. మామూలుగానే వన్ మినిట్‌లో వ్రాయమనాలి. ఎవరు ఎక్కువ వ్రాయగలిగితే వారే విన్నర్.


[ వెనుకకు ]


గోళీలతో గేమ్

ఎంతమంది ఆడవచ్చు : ఎంతమందైనా.
కావలసిన వస్తువులు : గోళీలు, ఒక బౌల్
ఆడే స్థలం : హాలు లాంటి ప్రదేశంలో

ఈ గేమ్ కి గోళీలు, ఒక బౌల్ ఉంటే చాలు. హాలు లాంటి ప్రదేశంలో అయితే ఒకవైపు గోళీలను క్రింద పోయాలి. వాటికి దూరంగా బౌల్ ఉంచాలి. గేమ్ ఏమిటంటే వన్‌మినిట్ వెళ్ళి గోళీలను తీసుకొచ్చి బౌల్‌లో వేయాలి. ఒక్కొక్క గోళీ చొప్పున తీసుకొచ్చి బౌల్‌లో వేయాలి. అలాఎన్ని వేయగలిగితే అన్ని ఉన్న మెంబర్స్ అందరి చేత వేయించాలి. ప్రతి ఒక్కరు ఎన్ని గోళీలు వేసారో లెక్క పెట్టాలి. ఎవరు ఎక్కువ వేయగలిగితే వారే విన్నర్.


[ వెనుకకు ]


పదంతో పందం గేమ్


ఎంతమంది ఆడవచ్చు : ఎంతమందైనా.
కావలసిన వస్తువులు : పేపరు, పెన్ను.
ఆడే స్థలం : హాలు లాంటి ప్రదేశంలో

ఈ గేమ్‌కి ముందుగా ప్రిపేర్ చేసుకోవాలి. గేమ్ ఏమిటంటే మనం తెలుగులో రెండు ఇంగ్లీషు పదాల అర్థం వచ్చేటట్లు సెంటెన్స్ ఇస్తే గేమ్ ఆడేవారు ఆ రెండు ఇంగ్లీషు పదాలను వ్రాయాలి సుమా. అది కూడా హోస్ట్ ఇచ్చే సెంటెన్స్‌లోని రెండు ఇంగ్లీషు పదాలు ఒక దాంట్లో ఒకటి ఉంటాయి. అదే పదంలో పదం .

ఉదాహరణకి ఇక్కడ కొన్ని ఇస్తున్నాం. హోస్ట్ పదాలను అదే విధంగా తయారు చేసుకొని కండెక్ట్ చేసుకోవచ్చు.ఉదా:

తెలుగు ఇంగ్లీష్
1. మందులో కంబళి Drug - Rug
2. గుండెలో కళ Heart - Art
3. అక్కడలో ఇక్కడ There - Here
4. కుర్చీలో జుట్టు Chair - Hair
5. వ్యక్తపరచటంలో ముద్రణ Expression - Press
6. అవసరంలో కొడుకు Want - Ant
7. జైలులో కొడుకు Prison - Son
8. చల్లదనంలో ముసలిదనం Cold - Old
9. మామిడిపండులో మనిషి Mango - Man
10. సంవత్సరంలో చెవి Year - Ear
11. కిరీటంలో కాకి Crown - Crow
12. రంగులో నొప్పి Paint - Pain
13. మరల లో లాభం Again - Gain
14. పద్నాలుగులో నాలుగు Fourteen - Four
15. గడ్డంలో చెంతువు Beard - Bear
16. గ్రహంలో వల Planet - Net

హొస్ట్ మాత్రం సెంటెన్సులు ప్రిపేర్ చేసి ఒక ఉదాహరణ మాత్రం ఇచ్చి పేపర్ ప్రిపేర్ చెయ్యాలి. వీటిని జిరాక్స్ తీసి అందరికి ఇచ్చి వన్‌మినిట్‌లో అందరిని వ్రాయమనాలి. మామూలుగానే ఎవరు ఎక్కువ వ్రాయగలిగితే వారే విన్నర్.


[ వెనుకకు ]


క్యాసెట్ గేమ్

ఎంతమంది ఆడవచ్చు : ఎంతమందైనా.
కావలసిన వస్తువులు : టేప్ రికార్డర్ క్యాసెట్స్ 25
ఆడే స్థలం : ఎక్కడైనా

ముందుగా టేప్ రికార్డర్ క్యాసెట్స్‌ను 25 క్యాసెట్స్‌ను కలెక్ట్ చేసి ఉంచండి. ఇది వన్ మినిట్ గేం. ఒక టేబుల్ మీద ఒకవైపు క్యాసెట్ మరొక వైపు క్యాసెట్ బాక్స్‌లు పెట్టాలి. ఆడే మెంబర్‌ని వచ్చి నిల్చొమనండి. 1 నిమిషంలో వారిని క్యాసెట్ తీసి క్యాసెట్ బాక్స్‌లో పెట్టి ప్రక్కన ఉంచమనండి. అలా ఆపకుండా ఒక్కనిమిషంలో ఎన్ని సెట్ చేయగలరో చూసి కౌట్ చేయండి. అలా ప్రతి ఒక్కరిచేత ఆడిపించాలి. ఎవరు వన్ మినిట్‌లో ఎక్కువ సెట్ చేస్తారో వారే ఫస్ట్.

గమనిక :క్యాసెట్ బాక్స్ కొంచెం తెరిచినట్టు ఉన్నా అది కౌంట్‌లోకి రాదు.


[ వెనుకకు ]


బ్లాస్టింగ్ బెలూన్ గేమ్

ఎంతమంది ఆడవచ్చు : ఎంతమందైనా.
కావలసిన వస్తువులు : బూరలు, దారం
ఆడే స్థలం : విశాలంగా ఉన్న స్థలంలో

ఈ గేమ్‌కి కొంచెం చిన్న వయసు వారు ఆడితే సరదాగా ఉంటుంది. దీనికి కావలసిందల్లా బూరలు, దారం మాత్రమే. ఉన్న మెంబర్స్ అందర్నీ రెండు గ్రూపులుగా విడదీయండి. ఇప్పుడు మొదటి గ్రూపు వారికి బూరని ఊది గట్టిగా ముడివేసి ఒక మూర దారం వదిలి తెంపి దానిని కాలి బొటనవేలుకి కట్టుకోమనండి. అందరు అలా చేసిన తర్వాత విశాలస్థలంలో రౌడ్ గీయండి. గీసిన రౌడ్‌లో బూర కట్టుకున్న వారిని ఒకరిని నుంచీమనండి. తరువాత రెండో గ్రూపు వారి నుంచి ఒకరిని వచ్చి నుంచోమనండి. గేమ్ ఏమిటంటే రౌడ్ లోనే ఇద్దరూ ఉండాలి. బూరకట్టుకున్న వారిని క్లిసి క్రింద ఆనించి తీస్తూ ఉండాలి. ఆనించినప్పుడు అవతలి వారు చాలా షార్ప్‌గా ఆ బెలూన్‌ని పగలగొట్టాలి. ఇది వన్ మినిట్‌లో జరగాలి. పగల కొట్టగలిగితే మార్క్ లేదా జీరో. ఇలా ఇద్దరిద్దరి చేత ఆడించాలి. అందరు అయిపోయిన తరువాత ఇదే పద్దతిలో రెండో గ్రూపు వారి చేత ఆడించాలి. ఎవరికి ఎక్కువ పాయింట్స్ వస్తే ఆ గ్రూప్ విన్ అయినట్టు.


[ వెనుకకు ] [ ముందుకు ]

Telugudanam.co.in
వెనుకకు | మొదటి పేజీ | తెలుగుదనం బ్లాగు | మాగురించి | సలహాలు | పత్రికలలో తెలుగుదనం                                సందర్శకుల సంఖ్య: