|
www.telugudanam.co.in చీరాల |
పత్రికలలో తెలుగుదనం |
మా అనుబంధ వెబ్‌సైట్.. |
|||
| తెలుగుదనం బ్లాగు | |||||
| మా గీతా.కో.ఇన్ |
అంత్యాక్షరికి ఉపయోగపడే పల్లవులు
[అ నుంచి అః వరకు] [క నుంచి ఘ వరకు] [చ నుంచి జ వరకు] [ట నుంచి డ వరకు] [త నుంచి న వరకు] [ప నుంచి మ వరకు] [య నుంచి ఱ వరకు]
త నుంచి న వరకు
తలచి తలచి చూశా వలచి విడిచి నడిచా...
నీకై నేను బ్రతికే వుంటినీ...ఓ...ఓ..
నీలో నన్ను చూసుకొంటినీ...
తెరచి చూసి చదువు వేళ కాలిపోయే లేఖ బాలా
నీకై నేను బ్రతికే వుంటినీ...ఓ...ఓ...
నీలో నన్ను చూసుకొంటినీ. (7/G బృందవన కాలని)
తెలుసా మనసా ఇది ఏ నాటి అనుబంధమో
తెలుసా మనసా ఇది ఏ జన్మ సంబంధమో
తరిమిన ఆరుకాలాలు ఏడు లోకాలు చేరలేని ఒడిలో
విరహపు జాడలేనాడు వేడి కన్నేసి చూడలేని జతలో శత జన్మాల బంధాలా బంగారు క్షణమిది. (క్రిమినల్)
తెలుసునా తెలుసునా మనసుకీ తొలి కదలిక అడగనా అడగనా అతడిని మెల మెల్లగా
నమ్ముతాడో నమ్మడో అని తేల్చుకోలేక నవ్వుతాడో ఏమిటో అని బయటపడలేక
ఎలా ఎలా దాచి ఉంచేది ఎలా ఎలా దాన్ని ఆపేది. (సొంతం)
తెలుగోడి స్టైలే నాటు కొట్టుడు బీటే దుమ్మురేపే డ్యాన్సే స్టైల్ బేబి జిందాబాద్
స్టైలే స్టైలే నాటు స్టైలే వేసే స్టెప్పే స్టైలే స్టైల్ బేబి జిందాబాద్
స్టైలే స్టైలే అదిరే స్టైలే ఇది అందరి స్టైలే. (స్టైల్)
తకధిమితోం తకధిమితోం తరికిట తరికిట తకధిమితోం
చిందులు వేసే వయసుకి తకధిమితోం
తకధిమితోం తకధిమితోం సరిగమ పదమని తకధిమితోం ఉరకల వేసే మనసుకి తకథిమితోం
కష్టం నష్టం ఎదురైనా నచ్చినదే చేసేద్దాం
అలవాటయితే చేదైనా తకథిమితోం తప్పో ఒప్పో చేసేద్దాం
తొలి అడుగే వేసేద్దాం అనుభవమయితే ఏదైనా తకధిమితోం
కృషి వుంటే నీ వెంటే రా ఈ లోకం. (ఆర్య)
దాయి దాయిదామ్మా కులికే కుందనాల బొమ్మ నీతో పనివుందమ్మా నడిచే కొండపల్లి బొమ్మా
దాయి దాయిదామ్మా పలికే గండు కోయిలమ్మా నీపై మనసైందమ్మా నానిండు చందమామ
ఓ ఓ ఒళ్ళో వాలుమా ఓ ఓ వయసే ఏలుమా నిలువెల్ల విరబూసే నవయవ్వనాల కొమ్మ
తొలిజలై తడిమేసి సరసాల కొంటెతనమా. (ఇంద్ర)
ధగ ధగ మెరిసే మెరుపుల రాణి నేనే నీ మోనాలిసా
తెగ పొoగే వయ్యారాలే అన్నీ నీకై నే కానుక చేశా
ధగ ధగ మెరిసే మెరుపుల రాణి పదునెక్కే లేత జవాని నచ్చాయే నీలో హొయలన్నీ
నిన్నే నేనే మేచ్చా బాలా వినుకోరా మన్మధ బాలా మెప్పిస్తా అల్లేసెయ్యాలా
తధిగినతోంతక ధీంతక తారా తధిగినతోం నువ్వే కావాల
తధిగినతోంతక ధీంతక రసలీల తధిగినతోం తగ రంగుల రంగేళ. (లక్ష్మీ)
దిల్ దివాన మె హసీన ప్యార్ మే పాగల్ జెచురాయి నీదుడాయి కౌన్ ఏ హర్‌బల్
వేణువూది చంపుతావు వేల కాని వేలలో ఉట్టి కొట్టి పుట్టి కాస్త ముంచుతావు వాడలో
కన్నె ముద్దు వెన్న ముద్ద దోచుకున్న హాయిలో చీరనైనా వదలవాయి సిగ్గు పడ్డ ఈడులో. (జెమిని)
దేవుడా దేవుడా తిరుమల దేవుడా
చూడర చూడరా కళ్ళూ విప్పి చూడరా ||2||
నా వాళ్ళ హృదయాలు నిజమైన వజ్రాలు
నువ్వు కొంచెం సాన పెట్టరా
శక్తులన్ని వచ్చి చేరుకుంటే
స్వర్గం వెలిసెనయ్యో భూమిపైనే (చంద్రముఖి)
నడుము చూస్తే పూతరేకు తడిమి చూస్తే తమలపాకు నడక చూస్తే నెమలిసోకు ఎంత బాగుంది పిల్ల కులుకు
హే ఆగవయ్యో అంటుకోకు చీరలాగా చుట్టుకోకు మూతిలాగా ముట్టుకోకు ముద్దు తీగల్లే కుట్టిపోకు
వెన్నలాంటి కన్నె ఈడు జున్నులాగా ఉంది చూడు
చిన్న సైజు వేటగాడు చీకటైతే ఊరుకోడు బ్రహ్మరాత ప్రేమగీత ఒక్కటంటాడు
హే ఆరేసుకో అరె ఆరేసుకో నీ అందాలు నా మీద ఆరేసోకో
హే పారేసుకో వలపారేసుకో నీ మనసంత నా మీద పారేసుకో
నాని వయసే 28 నాని మనసే 8...8 నాని
నవనవ నవతల యువతల రాజకుమారుడు. (నాని)
నా చెలి రోజావే నాలో ఉన్నావే నిన్నే తలచేనే నేడే కళ్ళలో నీవే కన్నీట నీవే
కనుమూస్తే నీవే ఎదలో నిండేవే కనిపించవే అందించవే తోడు. (రోజా)
నాలో ఉన్న ప్రేమా నీతో చెప్పనా నీలో ఉన్న ప్రేమా నాతో చెప్పవా
ఇప్పుడే కొత్తగా వింటున్నట్టుగా సరదాతీరగా ఊ అంటానుగా
మనల్నే చూడగా ఎవరూ లేరుగా మనసే పాడగా అడ్డేలేదుగా
ఇద్దరికీ వద్దిక కుదరక ఇష్టసఖీ వద్దని వదలక
సిద్దపడీ పద్దతి తెలియక తలొంచి
తపించి తతంగ మడగగా ||నాలో ఉన్న||
రెప్పలలో నిప్పులే నిగనిగ నిద్దురనే పొమ్మని తరమగ
ఇప్పటితో ఆప్తుడు దొరకగ వయ్యారి వయస్సు
తయారయిందిగా. (ప్రేమంటే ఇదేరా!)
నువ్వు నేను కలిసుంటేనే నాకెంతో ఇష్టం నువ్వు నేను మనమైతేనే ఇంకెంతో ఇష్టం
నువ్వు నన్ను ప్రేమించావని నేను నిన్ను ప్రేమించానని తెలిశాకా...
నువ్విక్కడుండి నేనక్కడుంటే నువ్విక్కడుండి నేనక్కడుంటే ఎంతో కష్టం. (గంగోత్రి)
నువ్వెంత అందగతెవైనా గాని అంత బిరుసా
తెగ వెంటబడుతుంటె నీకు ఇంత అలుసా
నేనంత కానివాణ్ని కాదు గద కన్నె వయసా
నీకంటికి నేనొక చిన్న నలుసా
నిన్నే... నిన్నే... నేను కోరుకున్నది నిన్నే...
నన్నే... నన్నే... ఒప్పుకోక తప్పదింక నన్నే... (మల్లీశ్వరి)
నువ్వంటే నాకిష్టం నీ నవ్వంటే నాకిష్టం
నువ్వంటే నాకిష్టం నా నువ్వైతే నాకిష్టం
నాలో ఆలాపనా ఆగేనా ఆపినా
ఎదలో లయా వినవా ప్రియా. (నువ్వులేక నేను లేను)
నువు ఎవ్వరి ఎదలో పువ్వుల ఋతువై ఎప్పుడు వస్తావో
నిను నమ్మిన జతలో నవ్వులు చిదిమి ఎందుకు పోతావో
తెలియదే ఎవ్వరికీ తేలదే ఎన్నటికీ
అందుకే నీ కధకీ అంతులేదెప్పటీకీ
తీరాలు లేవే ప్రేమా నీదారికి. (మల్లీశ్వరి)
నువ్వంటే నా కిష్టమని అన్నది నా ప్రతి శ్వాస
నువ్వేలే నా లోకమని అన్నది నా ప్రతి ఆశా
నీ నవ్వులో శృతి కలిపి పాడగ నీ నీడలో అణువణువు ఆడగ
అనురాగం పలికింది సంతోషం స్వరాలుగా. (సంతోషం)
నేను పుట్టిందేమో నీకోసమే పెరిగింది నీకోసమే
ఓణి కట్టిందేమో నీ కోసమే విరిసింది నీ కోసమే
మీసమొచ్చిందేమో నీ కోసమే వేచి ఉన్నా నీ కోసం
లక్ష్మీ బావా లక్ష్మీ బావా నిన్నే పెళ్ళాడతా
నీకే లక్ష్మీ బావా లక్ష్మీ బావా పెళ్ళానైపోతా
మరదలు పిల్లా మరదలు పిల్లా మూడే ముళ్ళేస్తా
నీకే మరదలు పిల్లా మరదలు పిల్లా ముద్దుల మొగుడవుతా. (లక్ష్మీ)
నీ నవ్వులే వెన్నెలని, మల్లెలనీ హరవిల్లులనీ...
ఎవరేవేవో అంటే అననీ ఏంచెప్పను ఏవీ చాలవనీ... (మల్లీశ్వరి)
నే తొలి సారిగా కలగన్నదీ నిన్నే కదా నా కళ్ళెదురుగా నిలుచున్నది నువ్వే కదా
స్వప్నమా నువ్వు సత్యమో తేల్చి చెప్పవే ప్రియతమా
మౌనమో మధుర గానమో తనది అడగవే హృదయమా
ఇంతలో చేరువై అంతలో దూరమై అందవా స్నేహమా ... (సంతోషం)
నీటి ముల్లై నన్ను గిల్లి వెళ్ళిపోకే మల్లెవాన
జంటనల్లే అందమల్లె ఉండిపోవే వెండివాన
తేనెల చినుకులు చవి చూపించు కన్నుల దాహం ఇంకా పెంచి
కమ్మని కలలే మో అనిపించి కనుమరుగై కరిగావా సిరి వానా
నువ్వొస్తానంటే నేనొద్దాంటానా......... (వర్షం)
[అ నుంచి అః వరకు] [క నుంచి ఘ వరకు] [చ నుంచి జ వరకు] [ట నుంచి డ వరకు] [త నుంచి న వరకు] [ప నుంచి మ వరకు] [య నుంచి ఱ వరకు]
వెనుకకు | మొదటి పేజీ | ఆఖరి సారి మెరుగు పరిచిన తేది: 25-03-2009 | హక్కులు: తెలుగుదనం.కో.ఇన్ | రూపకర్త: గీతా.కో.ఇన్ | ప్రశ్నలు, సలహాలు, సూచనలకు: editor@telugudanam.co.in