www.telugudanam.co.in         చీరాల

తెలుగు పాఠాలు

చిన్నపిల్లల కోసం

మాగురించి

పత్రికలలో తెలుగుదనం

               మా అనుబంధ వెబ్‌సైట్..

సంస్కృతి, సంప్రదాయాలు

వనితల కోసం

సైట్‌మ్యాప్

తెలుగుదనం బ్లాగు

సాహిత్యం

అందరికోసం

సలహాలు

మా గీతా.కో.ఇన్

హాస్య సంపద   

[ వెనుకకు ]  [ ముందుకు ]

కొత్త కుక్క

రాము : ఓరే గోపీ మా యింటికి రారా.

మా కొత్త కుక్క పిల్లను చూద్దువుగాని

గోపి : అమ్మో! అది కరవదా?

రాము : ఆ విషయం తెలుసుకోవడానికే నిన్ను పిలుస్తున్నది.

గోపి : ?????

మహా పురుషుడు

మాష్టారు : కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు.మహా పురుషులౌతారు తెలుసా!

కృష్ణ : అంటే మీరు గట్టిగా కృషి చేయలేదనుకుంటా మాష్టారు

మాష్టారు : ?????

వడ్డీయో?

సబ్ ఇన్స్పెక్టర్ : సంవత్సరం క్రితం మీ ఇంట్లో లక్ష రూపాయిలే పోయాయని చెప్పావు. మరిప్పుడు లక్షన్నర అని అంటావేమయ్యా?

వడ్డీ వ్యాపారి : మరి దానికి వడ్డీ ఎవరిస్తారయ్యా?

రైల్ సింగర్

డైరెక్టర్ : ఏమిటండి ప్రొడ్యూసర్ గారు ! మీతో పాటు  ఈ బిక్షగాడ్ని పట్టుకొచ్చారు?

ప్రొడ్యూసర్ : రైల్లో పాటలు పాడు కొంటుంటే చూశానండి. పాటకు ఐదు రూపాయిలిస్తే మనం చెప్పినట్లు పాడేస్తాట్ట. మనది లోబడ్జెట్ గదా! ప్లే బ్యాక్ సింగర్ గా పనికొస్తాడని.

పిచ్చెవరికి?

పుల్లయ్య : డాక్టరూ! మా ఆల్లుడికి పిచ్చిపట్టిందయ్యా!

డాక్టర్ : అలాగా ఇప్పుడతడు ఎక్కడున్నాడు?

పుల్లయ్య : ఇదిగో నా జేబులో...

డాక్టర్ : ?????

ఇష్టం

తండ్రి : ఒరే గోపీ, మీ స్కూల్లో ఎవరంటే నీకెక్కువ ఇష్టంరా!

గోపి : గంట కొట్టే రంగయ్య అంటే నాకిష్టం డాడీ!

తండ్రి : ?????

చేపలు

టీచరు : చేపలు సముద్రాల్లోనూ, చెరువుల్లోనూ, ఇంకా ఎక్కడెక్కడుంటాయో చెప్పు రాము.

రాము : మార్కెట్టులలో గూడా ఉంటాయి మేడం!

టీచర్ : ?????

తిట్టడమా!

మామగారు : ఏంటయ్యా అల్లుడూ! నువ్వెప్పుడూ మా అమ్మాయిని తిడుతూనే ఉంటావట.

అల్లుడు : ఆ ముదనష్టపు దాన్ని నేను తిడుతున్నానని చెప్పి చచ్చిందా చచ్చు పీనుగ.

నేను నా చేతి రాతను చదవగలను

శేఖర్ : ఇతరులు చేయలేని పనిని ఏదైనా మీరు చేయగలరా?

నారాయణ : నేను నా చేతి రాతను చదవగలను.

ప్రతిసారి మీరు మీ కళ్ళు మూసుకుంటారు

ఒక లావుపాటి రోగి డాక్టరును, నోరు తెరుచుకొని నిద్రపోకుండా ఉండేందుకు ఏదైనా మందును సిఫారసు చేయమని అడిగారు.

తప్పకుండా చేయగలను. మీరు మీ బరువును తగ్గించుకోవాలి అని డాక్టరు లావుపాటి రోగికి జవాబు ఇచ్చాడు.

"నా బరువా? మీ మందుకూ, నా బరువుకూ ఏమి సంబంధం?" అని లావుపాటి వ్యక్తి తన నిరసనను తెలియజేశాడు. "చూడండి అసలు రహస్యం మీ లావులోనే ఉంది. మీ వంటి బరువు కారణంగా మీ చర్మం బాగా బిగిసుకున్నప్పుడంతా మీ నోరు తెరుచుకుంటుంది.

మాష్టారు:

వెయ్యిలోనుండి ఒకటి తీస్తే ఎంత సుశీలా ?

'మూడు సున్నాలు సార్'.

డాక్టర్:

మావారికి పిచ్చికుక్క కరిచింది. మీరు వెంటనే రావాలి.

ఆంది తాయారు కంగారుగా.

మీరేం గాభరా పడకండి నేవచ్చేదాకా మంచం మీదే

పడుకోబెట్టండి అన్నాడు డాక్టర్.

చీ--చీ-- పిచ్చికుక్కని మంచం మీదెలా పడుకోబెడతాం ఆంది తాయారు.

చుట్టాలు

నాన్నా నాన్నా కాకి అరిస్తే చుట్టాలు వస్తారటగా అడిగింది ఆరేళ్ళ ఆలివేణి.

అవునమ్మా ఆంటారు, చెప్పాడు తండ్రి

మరీ, వచ్చిన చుట్టాలు పోవాలంటే ఎవరు అరవాలి: అడిగింది ఆలివేణి.

'మీ అమ్మ' నెమ్మదిగా అన్నాడు.

పెళ్లి

నేను మిమ్మల్ని కాకుండా మరెవరినైనా  పెళ్లి చేసుకుని ఉంటే ఎలా ఉండేదాన్నని మీరు ఎప్పుడన్నా ఆలోచించారా! పరంధామయ్యతో అన్నది అష్టలక్ష్మి,

నేనెప్పుడూ పరుల నాశనాన్ని కోరుకోను ప్రశాంతంగా జవాబు యిచ్చాడు పరంధామయ్య.

ఉద్యోగం

మీ ఆఫీసులో పెళ్ళయిన వారికే ఉద్యోగం యిస్తామని ప్రకటన యిచ్చారు కారణం అడిగాడు అప్పారావు.

పెళ్ళయిన వాళ్ళఅయితే ఆఫీసరు తిట్టే తిట్లకు ఏమి అనుకోరు ఎందుకంటే భార్యల చివాట్లకు అలవాటు పడివుంటారు కదా! చెప్పాడు చిదానందం.

టూత్ బ్రష్

అదేమిటండీ, మీకూ, పిల్లలకీ, నాకూ ఆందరికీ బ్రష్‌లు పట్టుకురమ్మంటే ఒకే ఒక బ్రష్ పట్టుకువచ్చారు ఆశ్చర్యంగా అడిగింది  అలివేణి.

ఓసి పిచ్చిమొద్దూ ? ఇంటిల్లిపాదికి పనికివచ్చే ఒకే ఒక టూత్ బ్రష్ అని రేడియోలోమొత్తుకుంటున్నారు ఆ మాత్రం తెలిదా! నవ్వుతూ చెప్పాడు ఆనందం.

కళ్లజోడు

నీకెన్ని సార్లు చెప్పిచచ్చాను కళ్లజోడు లేకుండా వండవద్దని. చూడు కూర నిండా ఎన్ని వెంట్రుకలున్నాయో ఎలా కనిపిస్తున్నాయో విసుకున్నాడు భర్త.

కళ్లజోడు లేకుండా తినవద్దని మీకు ఎన్ని సార్లు చెప్పాను. అవి వెంట్రుకలు కావు. కొత్తిమీర కాడలు సరిగ్గా చూసుకోండి మరింత విసుగ్గా చెప్పింది భార్య.

కొత్త యిల్లు

భృగమూర్తికి కోపము జాస్తి అతనికి దారిలో దానయ్య ఎదురుపడి. ఏంటోయ్ మూర్తి కొత్త యిల్లు కట్టిస్తున్నావని విన్నాను అడిగాడు. వెధవ! చచ్చుప్రశ్నలు నీవూను, కొత్తది కాకపోతే పాతకొంప ఎవడైనా కట్టిస్తాడా? కోపముగా అరిచాడు భృగమూర్తి.

 నమ్మకం

ఈలోకంలో ఎవర్నీ నమ్మకండి  అంది భార్య

"ఎందుకూ? అడిగాడు భర్త.

'మన పనిమనిషి రెండు పళ్ళాలు ఎత్తుకెళ్ళింది.

"ఏ పళ్ళాలు?"

అవేనండి! మనం రైల్లో విశాఖపట్నం వస్తునప్పుడు మీల్స్ అబ్బాయితో ఇచ్చేస్తా మని చెప్పి సూట్కేసులో దాచేసిన పళ్ళాలు చెప్పింది భార్య

కళ్లజోడు

ఏ విషయాన్నయినా బాగా పరిశీలించాలంటే ఏమి చెయ్యాలిరా బుజ్జి, తల్లి అడిగింది.

'కళ్లజోడు పెట్టుకోవాలమ్మా'.

ప్రాముఖ్యత

"దసరా" పండుగ ప్రాముఖ్యత ఏమిట్రా రవీ? అడిగారు ప్రయివేటు మాస్టారు.

"బడికి సెలవు" సార్.

థియేటర్

కొత్తగా జాయిన్ అయ్యింది పరంథామయ్య డాక్టర్ వద్ద మాలతి అనే నర్సు.

ఈ పేషంట్‌ని ప్రక్క థియేటర్‌కి తీసుకెళ్లు అన్నాడు.

'ఏం పిక్చర్ రిలీజ్ అయ్యింది సార్ ఇవ్వాళ ఠక్కున అడిగింది'.

 రిటైర్ అయిపోయాను

ఏమేవ్! మన అల్లుళ్ళందరూ రేపు వచ్చే పండక్కి ఇక రాలేమని రాశారే!

'అయ్యో! అదేమిటండి అలాగా?'

నేను పోయిన నెలేగా రిటైర్ అయిపోయాను అని వ్రాశానులే.

రీసెర్చ్

కాపీకి రీసెర్చ్ కి తేడా ఏమిటి? అడిగాడు గంగారావు.

'ఒక విషయాన్ని ఒకే పుస్తకంలోంచి చూసి రాస్తే కాపీ, అదేకొన్ని పుస్తకాల్లోంచి చూసిరాస్తే అదే రీసెర్చ్ చెప్పాడు సీతారాం.

గేదె  దూడ

ఈ గేదె ఎవరిది? అడిగాడు సూర్యం.

గేదె సంగతి ఏమోగాని దూడ ఎవరిదో మాత్రం చెప్పగలను అన్నాడు. కామేశం.

'పోని దూడ ఎవరిదో చెప్పండీ అడిగాడు సూర్యం. ఆ గేదెదే చెప్పాడు కామేశం.

బైనాక్యులర్స్

టి.వి కొందామంటే బైనాక్యులర్స్ కొందామంటారేంటి చిరాగ్గా అన్నది భార్య.

బైనాక్యులర్స్ వుంటే మేడమీద నుంచి ఎదురింటి టి.వి చూడవచ్చు చెప్పాడు భర్త.

ఏనెంబరు బస్సు ఎక్కాలి

భార్యని జూకి తీసుకువెళ్లాడు ముకుందం. అక్కడ పులుల్ని, సింహాల్ని చూసిన తరువాత.

'ఏమండి వున్నట్టుండి మిమ్మల్ని ఏ పులో సింహమో తినేస్తే నేను ఒక్కర్తినే ఇంటికి వెళ్లాలంటే ఏనెంబరు బస్సు ఎక్కాలి అని అడిగింది ముకుందం భార్య.

ఈత

చూడు ప్రమీలా నువ్వు రోజు రోజుకీ లావెక్కిపోతున్నావు. రోజూ ఈతకొడితే సన్నబడతావు. చెప్పింది డాక్టర్.

భలేవారే డాక్టర్ ఎప్పుడు సముద్రంలో ఉండే తిమింగిలం సన్నబడిందా? అబ్బేలేదు అంది ప్రమీల.

గాడిదెక్కాలని

చూశావే సుబ్బులూ వీడికి గాడిదెక్కాలని వుందట అన్నాడు కొడుకును ఆడిస్తూ సత్యం.

"అలాగా అయితే మీ వీపుమీద కూర్చొబెట్టుకోండి వంట గదిలోంచి చెప్పింది సుబ్బులు".

మొక్కు

ఏమిట్రా హరి అంతలా జుట్టు పెంచుతున్నావు? మొక్కా! సందేహంగా అడిగాడు సురేంద్ర.

మొక్కా పాడా? మా ఆవిడ సవరం కట్టించుకుంటదట  తాపీగా చెప్పాడు.

క్రమశిక్షణ

ఏరా రవీంద్రా క్రమశిక్షణ అంటే ఏమిట్రా?

ఒక్కొక్కరిని శిక్షించడం సార్.

కేన్వాసింగ్

కేన్వాసింగ్ అంటే ఏమిటి సుజాతా? ప్రయివేటు క్లాసులో టీచర్ అడిగారు.

"కేన్వా" అంటే అతని ఇంటి పేరు, "సింగ్" అంటే అతని పేరు టీచర్.

ఒక్క మాటకూడా చెప్పలేదు

ఏమయ్యా! సూర్యం పాపం మొన్న మీ ఫాదర్ పోయారటగా? పోయేముందు ఏం చేప్పారు? అడిగాడు సూర్యం పెద్దకొడుకుని ప్రక్కింటి కవి.

ఒక్క మాటకూడా చెప్పలేదు. ఆఖరి క్షణం వరకు అమ్మ ఆయన ప్రక్కనే ఉంది గదండీ అన్నాడు పెద్దకొడుకు నిట్టూరుస్తూ.

మెదడు

మెదడు పనిచేయకుండా మనిషి ఎన్నాళ్లు బ్రతకవచ్చమ్మా? అడిగాడు చంటి.

ఏమో సరిగా తెలియదుగాని  అయినా ఓ సారి మీ నాన్నగార్ని వయసెంతో అడిగిరారా! తాపీగా అంది తల్లి నాగలక్ష్మి.

 టునాట్‌ఫోర్

ఏ మోయ్ టునాట్‌ఫోర్! టోపీ లేకుండా స్టేషన్‌కి ఎందుకొచ్చావు అడిగారు యస్.ఐ. ఇంటి నుండి టోపీతోనే బయలుదేరాను సార్! కానీ దారిలో ఎవడో కొట్టేశాడు సార్.

 రేషన్ కార్డు

మీ వంటికి బియ్యం, పంచదార, గోధుమ,నూక, బియ్యం పడవు కాబట్టి.... అని డాక్టర్ చెపుతుండగా!

పేషంట్ : నా రేషన్ కార్డు మాత్రం చస్తే యివ్వను.

పార్టీ

మాదో పెద్ద పార్టీ నోయి! దానికి నేనే నాయకుడ్ని. నే ఎలా చెపితే మా వాళ్లు అలా నడుచుకోవాలి. ఐతే మీదేం పార్టీ సార్?

'బ్యాండ్ పార్టీ'.

కొండముచ్చు

ఏరా సుబ్బారావ్! మీ అక్కయ్య గుమ్మంలో నిలబడి, అస్తమాటు నన్నే చూస్తోంది. ఎందుకని? అడిగాడు సూర్యారావు హీరోలా ఫోజు పెట్టి.

అదాండీ! మా అక్కయ్యకు కొండమచ్చులంటే భలే యిష్టం.

నేను ఈ ప్రశ్నకు రేపు జవాబు చెబితే?

టీచర్: రాము వాయిదావేయడమును నిర్వచించు.

రాము: టీచర్ నేను ఈ ప్రశ్నకు సమాధానము రేపు చెబితే పరవాలేదా?

అదేవిధంగా నా గుండెనొప్పి..

డాక్టరు (కోపముతో): మీరు నాకు ఇచ్చిన చెక్కు మంచిచెక్కు కాదు. అది తిరిగి వచ్చింది.

రోగి: అలాగా! అయితే నాగుండె నొప్పి కూడా నా చెక్కులాగే తిరిగి వచ్చింది. మరి దాని సంగతేమిటి?

[ వెనుకకు ]  [ ముందుకు ]  


వెనుకకు | మొదటి పేజీ | ఆఖరి సారి మెరుగు పరిచిన తేది: 24-05-2008 | హక్కులు: తెలుగుదనం.కో.ఇన్  | రూపకర్త: గీతా.కో.ఇన్ | ప్రశ్నలు, సలహాలు, సూచనలకు: editor@telugudanam.co.in