www.telugudanam.co.in         చీరాల

తెలుగు పాఠాలు

చిన్నపిల్లల కోసం

మాగురించి

పత్రికలలో తెలుగుదనం

               మా అనుబంధ వెబ్‌సైట్..

సంస్కృతి, సంప్రదాయాలు

వనితల కోసం

సైట్‌మ్యాప్

తెలుగుదనం బ్లాగు

సాహిత్యం

అందరికోసం

సలహాలు

మా గీతా.కో.ఇన్

ఓ చిన్నదానా విడవనె చెంగు

ఓ చిన్నదానా విడవనె చెంగు

ఓ చిన్నదానా వదలనె కొంగు

బందారు చిన్నదాన బాజాబందూలదాన

బాజాబందూల మీద మోజేల లేదే                        ..ఓ చిన్నదానా..

గుంటూరు చిన్నదాన గుళ్ళా పేరులదానా

గుళ్ళాపేరుల మీద కళ్ళూపోలేదే                          .. ఓ చిన్నదానా..

కాకినాడ చిన్నదానా  కాసూల్ కంటేలదానా

కాసూల్ కంటేల మీద మనసేలలేదే                      .. ఓ చిన్నదానా..

అర్ధారూపాయి పెట్టి అద్దాల రయిక కొంటె

అద్దాల రయిక మీద ముద్ధేల లేదే                         .. ఓ చిన్నదానా..

నల్లానల్లానిదాన నడుమూసన్నానిదాన

తళుకూసేపలమల్లె కులుకూ సూపులదానా            ...ఓ చిన్నదానా..

నిన్ను సూసీ మనసు నిలవకున్నాదోలె                 .. ఓ చిన్నదానా..

 

వేళజూడ వెన్నెలాయె వెండిలట్ల కిన్నెరాయె

వేళజూడ వెన్నెలాయె వెండిలట్ల కిన్నెరాయె

మల్లెపూల పందిరాయె వయ్యారి రావె

                                    నవ్వులోనె తెల్లవారును

 

కొండగోగులు పూసెనేమొ కొండనిమ్మలు కాసెనేమొ

దొండపండులాంటి పెదిమె వయ్యారి రావె

                                    మనసు ఇవరిపాలుజేతును

 

మల్లెపూవులు పూసినట్లు మళ్ళి మళ్ళి మాటలాడు

మల్లెపూల వంటి మనసు వయ్యారి రావె

                                    పూవులెవరిపాలుజేతును

 

నంది పూసె కందిగాసె కందికొసలు నందిమేసె

అందమైన మేలినడల వయ్యారి రావె

                                    గంధమైన పంపబోతిని


వెనుకకు | మొదటి పేజీ | ఆఖరి సారి మెరుగు పరిచిన తేది: 25-03-2009 | హక్కులు: తెలుగుదనం.కో.ఇన్  | రూపకర్త: గీతా.కో.ఇన్ | ప్రశ్నలు, సలహాలు, సూచనలకు: editor@telugudanam.co.in