www.telugudanam.co.in         చీరాల

తెలుగు పాఠాలు

చిన్నపిల్లల కోసం

మాగురించి

పత్రికలలో తెలుగుదనం

               మా అనుబంధ వెబ్‌సైట్..

సంస్కృతి, సంప్రదాయాలు

వనితల కోసం

సైట్‌మ్యాప్

తెలుగుదనం బ్లాగు

సాహిత్యం

అందరికోసం

సలహాలు

మా గీతా.కో.ఇన్

లాలి పాటలు (కొన్ని)

జో జో జో జో శ్రీ కృష్ణ

జో జో జో జో శ్రీ కృష్ణ

జో జో యని పాడెదాను జో జో జో జో శ్రీ కృష్ణ

పొంగుచూను లాలబోసి అంగరక్ష బెట్టి నీకు

అద్దాల తొట్టెలోన ముద్దుగా పవళింపజేతూ ||జో||

ముంగురులు దువ్వి నీకు ముత్యాల హారమేసి

మొలకును గజ్జాలు కట్టి మురళినీ చేతికిత్తు ||జో||

దేవకీ వసుదేవులాకు సుతుడవై జన్మించినావు

ధరలోన దాసురాలి మొర విని నను బ్రోవరావా ||జో||

పవళింపు పాట

పవళింప వేంచేయు సమయము స్వామీ ||ప||

పసిడి పాదుకలూని పడతి సీత కేలూని ||ప||

రసిక జనుల గొల్వ రత్న పాదుకలూని

వసియింప వేంచేయి సమయము స్వామీ ||ప||

ముసిముసి నగవుల మోహనకారుడై

ముదమున వేంచేయు సమయము స్వామీ ||ప||

దశరధాత్మజుడిదె దయతోడ నరసింహ

దాసుని ప్రార్ధన సకలము చేకొని ||ప||

శ్రీ రంగనాయకా పవళించరా

చెలమేలరా దయజూడరా ||శ్రీ||

తళుకు మోమునా తిలకము మెరయా

జిలిబిలి నవ్వుల సింగారముతో శ్రీరంగా పవళించరా ||శ్రీ||

శ్రీభూనీళలూ శ్రీపతి నీదూ శ్రీపాదమ్ముల

సేవలు సేయా శ్రీరంగా పవళించరా ||శ్రీ||

కపురంపు విడెములు కాంతలందివ్వగ

కనుల పండువగు కనకంపుశయ్యా శ్రీరంగా పవళించరా ||శ్రీ||

చాలగ భక్తులా సంరక్షింపా హేలాపురమున

వెలసినదేవా శ్రీరంగా పవళించరా ||శ్రీ||

మా పాప మామల్లు

మా పాప మామల్లు మత్స్యావతారం

కూర్చున్న తాతల్లు కూర్మావతారం

వరసైన బావలు వరాహవతారం

నట్టింట నాయత్త నరశింహావతారం

వాసిగల బొట్టెల్లు వామనావతారం

పరమ గురుదేవ పరశురామావతారం

రక్షించు రామయ్య రామావతారం

బంటైన బంధువులు బలభధ్రావతారం

బుధ్ధితో మా చిట్టి బుధ్ధావతారం

కలివిడితో మా యన్న కలికావతారం

వర్ధిల్లు పసిపాప వర్ధిల్లు నా తల్లి

చిట్టి నా కన్నోడ శ్రీ కృష్ణానావతారం

ముద్దుగారే

ముద్దుగారే యశోద ముంగిట ముత్యము వీడు

తిద్దరాని మహిమల దేవకి సుతుడు ||ముద్దుగారే||

అంత నింత గొల్లెతల అరచేత మాణికము

పంతమాడే కంసుని పాలి వజ్రము

కాంతుల మూడు లోకాల గరుడపచ్చబూ

చెంతల మాలోనున్న చిన్ని కృష్ణుడు ||ముద్దుగారే||

రతికేళి రుక్మిణికి రంగు మోవి పగడము

మితి గోవర్ధనపు గోమేధికము

సతమై శంఖు చక్రాల సందుల వైడూర్యము

గతియై మమ్ము గాచేటి కమలాక్షుడు ||ముద్దుగారే||

కాళింగుని తలలపై గప్పిన పుష్యరాగము

యేలేటి శ్రీ వెంకటాద్రి యింద్రనీలము

పాలజలనిధిలోన బాయని దివ్యరత్నము

బాలునివలె దిరిగీ బద్మనాభుడు ||ముద్దుగారే||

రామా లాలీ

రామా లాలీ మేఘశ్యామా లాలీ

తామరసనయన దశరథతనయా లాలీ   ||రా||

అబ్జవదన ఆటలాడి అలసినావురా నీ

బొజ్జలో పాలరుగగానే నిదురబోవరా    ||రా||

అద్దాల తొట్టెలో నేమో అనుమానించేవూ

ముద్దులపాపలున్నారని మురిసి చూచేవూ   ||రా||

ఎంతో యెత్తు మరిగినావు యేమి సేతురా

ఇంతుల చేతుల కాకకు మేనెంతో కందునురా   ||రా||

జోలపాడి జోకొట్టితే ఆలకించేవు

చాలించి మరియూరకుంటే సైగలు చేసేవు   ||రా||

వెన్న పాలు ఉగ్గు నెయ్యి బాలుడ నీవు

తిన్నగా సేవించివయ్య తియ్యగ నుండు   ||రా||

లాలి పాట

లాలనుచు నూచేరు లలనలిరుగడల

బాల గండవర గోపాల నినుజాల లాలీ లాలీ

ఉదుటు గుబ్బల సరము లుయ్యాలలూగ

పదరి కంకణరవము బహుగతుల మ్రోగ

ఒదిగి చెంపలకొప్పు లొక్కింత వీగ

ముదురు చెమటల నళికములు తొప్పదోగ ||లాలీ||

మలయ మారుతగతులు మాటికి చెలంగ

పలుకు కపురపుతావి పైపై మెలంగ ||లాలీ||

బలుగానలహరి ఇంపుగ రారగంగ

అలసి వినువారి బడలిక తొలంగ

లలనా జనాపాంగ లలిత సుమాచాప

జలజలోచన దేవ సద్గుణకలాప

తలపులోపల మెలగు తత్వప్రదీప

భళిర గండవరేశ పరమాత్మరూప ||లాలీ||


వెనుకకు | మొదటి పేజీ | ఆఖరి సారి మెరుగు పరిచిన తేది: 25-03-2009 | హక్కులు: తెలుగుదనం.కో.ఇన్  | రూపకర్త: గీతా.కో.ఇన్ | ప్రశ్నలు, సలహాలు, సూచనలకు: editor@telugudanam.co.in