www.telugudanam.co.in         చీరాల

తెలుగు పాఠాలు

చిన్నపిల్లల కోసం

మాగురించి

పత్రికలలో తెలుగుదనం

               మా అనుబంధ వెబ్‌సైట్..

సంస్కృతి, సంప్రదాయాలు

వనితల కోసం

సైట్‌మ్యాప్

తెలుగుదనం బ్లాగు

సాహిత్యం

అందరికోసం

సలహాలు

మా గీతా.కో.ఇన్

పిల్లల పాటలు (కొన్ని)

మా బడి

అదిగో నండీ మాబడి

నేర్పును మాకు చక్కని నడవడి

శ్రద్దగా చదువులు చదివెదమండి

చక్కగ కలిసి ఉంటామండి

పాఠాలెన్నో చదివామండీ

పంచతంత్రం విన్నామండీ

అందులో నీతి తెలిసిందండీ

ఎప్పుడు తప్పులు చేయంలేండీ!

చక్కగ బుద్దిగ ఉంటామండీ

మంచి పనులు చేస్తామండీ

కలిసి అందరం ఉంటామండీ

ఆనందంగా జీవిస్తామండీ

తగువులు ఎప్పుడూ పడమింకండి

కలిసి కట్టూగా ఉంటామండీ

కలిసి మెలిసి పనిచేస్తామండీ

కంచుకోట నిర్మిస్తామండీ

కోటకు జెండా కడ్తామండీ

ఆకాశాన ఎగరేస్తామండీ

ఆ ఎగిరే జెండా మాదేనండీ

అది మాభారత జెండా సుమండీ!

సిరిమల్లె

సీతమ్మ వాకిట సిరిమల్లె చెట్టు

సిరిమల్లె చెట్టేమో విరగబూసింది

చెట్టు కదలకుండా కొమ్మ వంచండి

కొమ్మ విరగకుండా పూలు కోయండి

అందులో పూలన్నీ దండ గుచ్చండి

దండ తీసుకుని వెళ్ళి సీతకియ్యండి

దాచుకో సీతమ్మ రముడంపేడు

దొడ్డి గుమ్మంలోన దొంగలున్నారు

దాచుకో సీతమ్మ దాచుకోవమ్మా

దాచుకోకుంటేను దోచుకుంటారు.

బొమ్మరిల్లు

చిట్టి చిట్టి మిరియాలు చెట్టుకింద పోసి

పుట్ట మన్ను తెచ్చి బొమ్మరిల్లు కట్టి

అల్లం వారింటికి చల్లకు పోతే

అల్లం వారి కుక్క భౌ భౌ మన్నది

నాకాళ్ళ గజ్జెలు ఘల్లు ఘల్లుమన్నది

చంకలో పాప కేర్ కేర్ మన్నది

సాయంత్రం

స్కూలు నుండి వచ్చాము

బుక్సు బ్యాగులో సర్దాము

స్నానం చక్కగ చేశాము

వెచ్చని పాలు తాగాము

నాన్నగారు వచ్చారు

లడ్డూ మిఠాయి తెచ్చారు

నాకు అన్నకు ఇచ్చారు

మంచి కథలు చెప్పారు

మార్కుల లిస్టు చూపితిమి

మంచి మార్కులు వచ్చిన వనిరి

మెచ్చిన చోటుకు వెల్దామంటిమి

నాన్నతో కలిసి పార్కుకు వెలితిమి

అక్కడ నేను చూసాను

కోతి, జింకల ఆటలను

ఇంకా దగ్గరికెళ్ళాము

హాయిగా నవ్వుకున్నాము

సింహం వద్దకు వెళ్ళాము

గాండ్రింపులు కూడా విన్నాము

వాటికి టాటా చెప్పాము

చక్కగా ఇంటికి వచ్చాము

వారాలు - బాలుడు

ఆదివారం పుట్టిన బాలుడు - అద్భుతంగా చదువుతాడు

సోమవారం పుట్టిన బాలుడు - సత్యమునే పలుకుతాడు

మంగళవారం పుట్టిన బాలుడు - మంచి పనులు చేస్తాడు

బుధవారం పుట్టిన బాలుడు - బుద్దిమంతుడై ఉంటాడు

గురువారం పుట్టిన బాలుడు - పరోపకారం చేస్తాడు

శుక్రవారం పుట్టిన బాలుడు - సహనం కలిగి ఉంటాడు

శనివారం పుట్టిన బాలుడు - శాంతముగా ఉంటాడు

మా వూరి ఏరు

పేరొకటి వున్నదని నా కెరుకలేదు

నీరు కూడ నిరంతర ముండబోదు

పేరు, నీరును లేని ఏరైన నేమి!

మా యూరి కీయేరే గంగాభవాని!

చూడచక్కని ఏరు మావూరి ఏరు!

ఏడాది కొకసారి ముచ్చటగా పారు!

తెల్లవారక ముందె చలిచెలమచేరి

చల్లన్ని నీటితో తబిలె నాడించి

తలకెత్తుకొనివచ్చు అమ్మలక్కలను

తిలకించలేదేమొ కవి శిఖామణులు

తిలకించియుండిన ఈపాటి కెపుడొ

తులలేని కావ్య మొక్కటి పుట్టియుండు!

ఏటి మధ్యను గలవు నల్లని గుండ్లు

ఏటి కిరువైపులా మొగలి పొదరిండ్లు

పొదరిండ్లలో దాగి మొగలి మొగ్గల్లు

మధుర సుగంధమ్ము దిక్కులకు చల్లు

పూల నాశించి మే మటకు చనరాదు

మొగలి చెట్లలోన మిన్నాగులుండు!

వాన బాగుగ కురిసి చెరువుల్లు నిండి

వరద వచ్చిన వేళ చూడాలి మీరు

ఉప్పొంగి మా ఏరు ప్రవహించుతుంది

ఉరవడితొ మా ఏరు ప్రవహించుతుంది

హొరు హొరున రొదలు విను వీధి ముట్ట

హొయలుగా మా ఏరు ప్రవహించుతుంది

ఎంత ఎర్రటి నీరు మా ఏటి నీరు

ఎంతగా చేస్తుంది అది కారు బారు!

చూడవలెనేగాని చెప్పంగ లేము

మూణ్ణాళ్ళతిరుణాల మా ఏటి వరద!

ఆ పైన ఆ పొంగు ఏమౌనొగాని

ఆశ్చర్యముగ ఏరు యింకిపోతుంది

ఇంకిపోయిననేమి, మా ఏటిలోన

ఇసుక తిన్నెలుకనుల పండువై యుండు

దినకరుండస్తాద్రి గ్రుంకేటి వేళ

తిన్నెల్లపై మేము కొలువు తీరెదము

ఎవ్వరేమనుకొన్న మాకేమి కొఱత

మా ఏరె మాకొక్క ఉద్యానవనము!


వెనుకకు | మొదటి పేజీ | ఆఖరి సారి మెరుగు పరిచిన తేది: 25-03-2009 | హక్కులు: తెలుగుదనం.కో.ఇన్  | రూపకర్త: గీతా.కో.ఇన్ | ప్రశ్నలు, సలహాలు, సూచనలకు: editor@telugudanam.co.in