|
www.telugudanam.co.in చీరాల |
పత్రికలలో తెలుగుదనం |
మా అనుబంధ వెబ్‌సైట్.. |
|||
| తెలుగుదనం బ్లాగు | |||||
| మా గీతా.కో.ఇన్ |
పిల్లల పాటలు (కొన్ని)
ఇల్లు అలికీ - ముగ్గూ వేసి
పీటవేసి - ఆకువేసి
పప్పువేసి - పాయసం వేసి
అన్నంపెట్టి - అప్పచ్చీ పెట్టి
పాలు పెట్టీ - పెరుగు వేసి
కూరవేసి - చారు వేసి
నెయ్యి వేసి - ముద్దా జేసి
నోట్లో పెట్టి - తినిపించి
చేయి కడిగి - మూతి కడిగి
చేయి తుడిచి - మూతి తుడిచి
తాతగారింటికి - దోవేదంటే
అత్తారింటికి - దోవేదంటే
ఇట్లాపోయి - అట్లాపోయి
ఇదిగో వచ్చాం - అదిగో వచ్చాం
చంకా ఎత్తి - చక్కిలి గిలిగిలి
చక్కిలి గిలిగిలి - చక్కిలి గిలిగిలి
పిల్లల్లారా రారండి
పిడికెడు బియ్యం తెండి
ఆడుకుందాం రారండి
అట్టుముక్కలు తెండి
చిన్న చిన్న బండి
చిత్రమైన బండి
కొత్త గుర్రాల బండి
కొనుక్కుందాం రండి
చందమామ ఇల్లుకట్టి
చుక్కల ముగ్గులు చక్కగబెట్టి
పాప తలపై ముత్యాలు పోసి
ఆడుకుందాం రారండి.
చిట్టీ చిట్టీ చెల్లెమ్మా!
పలకాబలపం తేవమ్మా!
అక్షరాలు నేర్వమ్మా
చదువు బాగా చదువమ్మా
తెలివిని బాగా పెంచమ్మా
ఇంటికి పేరు తేవమ్మా
నేస్తమొచ్చిందమ్మ నేస్తమొచ్చింది!
నీ నేస్త మొచ్చి వాకిటను నిలిచింది!
జలదాల చెఱసాల కమ్ములను దాటి
చరచరా తరులపై గిరులపై జారి
మనయూరి రామన్న గుడి గోపురాన
కనక కలశాలపై తళతళా మెరిసి
నేస్త మొచ్చిందమ్మ నేస్త మొచ్చింది
నీ నేస్తమొచ్చి వాకిటను నిలిచింది!
వెన్నెలను పేరుగల వెలిగేటి పాప
కన్నులకు విందైన కడు మంచి పాప
తల్లి మనసును బోలు చల్లని పాప
అల్లి తామరవంటి తెల్లని పాప
పొంగువారిన పాల సంద్రమ్ము వోలె
సింగారముల జిలుకు బంగారు పాప
మన పూలతోట పూపొదరిండ్ల క్రింద
తన చిన్న వ్రేళ్ళతో ముద్దులొలు కంగ
వెలుగు చీకట్ల ముగ్గులు వేసి వేసి
అలసి సాయపడంగ నిన్ను రమ్మంది
నేస్త మొచ్చిందమ్మ నేస్త మొచ్చింది
నీ నేస్తమొచ్చి వాకిటను నిలిచింది.
నారాయణ నారాయణ అల్లా అల్లా
మాపాలిటి తండ్రీ నీ పిల్లలమే ఎల్లా
మతమన్నది నా కంటికి మసకైతే
మతమన్నది నా మనసుకు మబ్బైతే
మతం వద్దు గితం వద్దు మాయా మర్మం వద్దు
ద్వేషాలు రోషాలు తెచ్చేదే మతమైతే
కలహాలు కక్షలు కలిగించేదే గతమైతే
మతం వద్దు గతం వద్దు మారణ హొమం వద్దు
మతమన్నది గాంధీజీ హితమైతే
మతమన్నది లోకానికి హితమైతే
హిందువులం ముస్లిములం
అందరమూ మానవులం అందరమూ సోదరులం
వెనుకకు | మొదటి పేజీ | ఆఖరి సారి మెరుగు పరిచిన తేది: 25-03-2009 | హక్కులు: తెలుగుదనం.కో.ఇన్ | రూపకర్త: గీతా.కో.ఇన్ | ప్రశ్నలు, సలహాలు, సూచనలకు: editor@telugudanam.co.in