www.telugudanam.co.in         చీరాల

తెలుగు పాఠాలు

చిన్నపిల్లల కోసం

మాగురించి

పత్రికలలో తెలుగుదనం

               మా అనుబంధ వెబ్‌సైట్..

సంస్కృతి, సంప్రదాయాలు

వనితల కోసం

సైట్‌మ్యాప్

తెలుగుదనం బ్లాగు

సాహిత్యం

అందరికోసం

సలహాలు

మా గీతా.కో.ఇన్

పిల్లల పాటలు (కొన్ని)

ఎందుకు?

మనిషిగ పుట్టిన దెందుకురా?

మంచిని పెంచేటందుకురా

బడికి వెళ్ళే దెందుకురా?

చదువులు నేర్చేటందుకురా

చదువులు నేర్చే దెందుకురా?

జ్ఞానం పొందే టందుకురా

జ్ఞానం పొందే దెందుకురా?

ప్రగతిని పెంచే టందుకురా

ప్రగతిని పెంచే దెందుకురా?

చక్కగ బ్రతికే టందుకురా

సుభాషితాలు

కలసిమెలసి తిరుగు

స్నేహమపుడే పెరుగు

చేయి చేయి కలుపు

శాంతి గీతి పలుకు

ధర్మమెపుడు విడకు

దారి అదియే కడకు

నీతి విడుట తప్పు

జాతి కదియే ముప్పు

నయము తప్పవద్దు

నడత చెడిన దిద్దు

మంచిమాట నుడువు

మందితోడ నడువు.

పాము

భలే భలే పామురా

బారెడు పొడుగుందిరా

పడగ విప్పుతుందిరా

నాట్యమాడుతుందిరా

బుస్సుమంటుందిరా

పేరు నాగుపామురా

అరటి

అరటి చెట్టు చూడరా

అందమైన చెట్టురా

ఆకులన్ని పచ్చన

అరటిపండు తియ్యన

హంస

రాజహంస తెల్లన

దాని నడక చక్కన

రామచిలుక పచ్చన

దాని పలుకు కమ్మన

కోకిలమ్మ నల్లన

దానిపాట తియ్యన

సీతాఫలం

సీతాఫలం ఎంతోబలం

అందులో ఉంది తియ్యని గుజ్జు

బుజ్జీ గుజ్జును తినేసెయ్

గింజలు విసిరి పారేసెయ్

జామ

తియ్య జామ పండు

తింటే మంచిగుండు

జబ్బు చేయకుంటె

ఇవ్వు నాకు రెండు.

నారింజ

నారింజకాయ

నిన్నుచూడగానే

నోరూరుచుండు

తొనవొలిచి తింటే

అబ్బబ్బ పులుపు

బొమ్మలు

బొమ్మలమ్మా బొమ్మలు

రంగురంగు బొమ్మలు

రకరకాల బొమ్మలు

సింగారాల బొమ్మలు - బంగారు బొమ్మలు

ఆడేపాడే బొమ్మలు - అందమైన బొమ్మలు

నీతిని నేర్చే బొమ్మలు - ఖ్యాతిని కూర్చే బొమ్మలు

బంతి

బంతి బంతి - ఇది నాబంతి

కాళ్ళులేవు - చేతుల్లేవు

గుండ్రని పొట్ట - పొట్టనిండ గాలి

ఎగురును దుముకును - ఇది నా బంతి

పోలీసు

పోలీసువాణ్ణి నేనైతే

జోరుగ కాకీ డ్రెస్సేస్తా

చేతిలో లాఠీ పట్టేస్తా

దొంగలందరిని పట్టేస్తా

చిట్టి చిట్టి బొమ్మలు

చిట్టి పొట్టి బొమ్మలు

చిత్రాల బొమ్మలు

నవ్వే పువ్వులు

నడిచే మువ్వలు

చుక్కల్లో చంద్రుడు

చూడంగవచ్చే

పాపాయి కన్నులు

పాపాయి కన్నులు కలువ రేకుల్లు

పాపాయి జులపాలు పట్టు కుచ్చుల్లు

పాపాయి దంతాలు మంచిముత్యాలు

పాపాయి పలుకులు పంచదార చిలకలు

కోడిగుడ్డు

వావ వచ్చి వంకలు పారె

కోడి వచ్చి గుడ్డు పెట్టె

తాత వచ్చి తొంగి చూసె

అవ్వ వచ్చి గుడ్డు తీసె

అమ్మ వచ్చి అట్టు చేసె

అన్న వచ్చి గుటుక్కున మింగె

నాకు మాత్రం - లేనే లేదు

చిన్నోడమ్మా చిన్నోడు

చిన్నోడమ్మా చిన్నోడు

చిన్ని సైకిలు కొన్నాడు

రాళ్ళ మీద తిప్పాడు

కాలు జారి పడ్డాడు

ఆసుపత్రిలో చేరాడు

మందు బిళ్ళలు మింగాడు

మళ్ళీ ఇంటికి వచ్చాడు

మంచం ఎక్కి పన్నాడు

మా తాత

మా తాత ముఖము

అందమైన ముఖము

మా తాత గుండు

గుమ్మడి పండు

మా తాత మీసం

రొయ్యల మీసం

మా తాత పిలక

పంచదార చిలక

పుట్టిన రోజు

పుట్టిన రోజు పండుగనాడు చుట్టాలొచ్చారు

కాజాలడ్డూ తాజాగారెలు తెచ్చీపెట్టారు

ఇరుగుపొరుగూ పిల్లాపెద్దా ఇంటికివచ్చారు

చిందులు తొక్కే చిట్టిపాపకి దీవెనలన్నారు


వెనుకకు | మొదటి పేజీ | ఆఖరి సారి మెరుగు పరిచిన తేది: 25-03-2009 | హక్కులు: తెలుగుదనం.కో.ఇన్  | రూపకర్త: గీతా.కో.ఇన్ | ప్రశ్నలు, సలహాలు, సూచనలకు: editor@telugudanam.co.in