www.telugudanam.co.in         చీరాల

తెలుగు పాఠాలు

చిన్నపిల్లల కోసం

మాగురించి

పత్రికలలో తెలుగుదనం

               మా అనుబంధ వెబ్‌సైట్..

సంస్కృతి, సంప్రదాయాలు

వనితల కోసం

సైట్‌మ్యాప్

తెలుగుదనం బ్లాగు

సాహిత్యం

అందరికోసం

సలహాలు

మా గీతా.కో.ఇన్

పిల్లల పాటలు (కొన్ని)

ఆటలంటే మాకిష్టం...

ఆటలంటే మాకిష్టం - పాటలంటే మాకిష్టం

ఆటల కన్నా పాటల కన్నా - అల్లరి పనులే మాకిష్టం

సినిమాలంటే మాకిష్టం - మిఠాయిలంటే మాకిష్టం

సినిమా కన్నా మిఠాయి కన్నా - షికార్లు కొట్టుట మాకిష్టం

పిట్టలంటే మాకిష్టం - పువ్వులంటే మాకిష్టం

పిట్టల కన్నా పువ్వుల కన్నా - చెట్లు ఎక్కడం మాకిష్టం

కొత్త బట్టలు మాకిష్టం - పౌడరు స్నోలు మాకిష్టం

బట్టల కన్నా పౌడరు కన్నా - మట్టిలో ఆటలు మాకిష్టం

టీచర్లంటే మాకిష్టం - పాఠాలంటే మాకిష్టం

టీచరు కన్నా పాఠం కన్నా - బడి సెలవంటే మాకిష్టం

వెన్నెలంటే మాకిష్టం - వానలంటే మాకిష్టం

వెన్నెల కన్నా వానల కన్నా - అమ్మ ముద్దులే మాకిష్టం

ఉయ్యాల...

లాల ఉయ్యాలమ్మ జోల ఉయ్యాల

ఊగేటి మా పాప తూగుటూయ్యాల

చిల్లి ఉయ్యాలమ్మ పొట్టి ఉయ్యాల

పట్టి ముద్దులపాప పసిడి ఉయ్యాల

పాల ఉయ్యాలమ్మ గాలి ఉయ్యాల

ఆకాశవీధిలో కెగురు ఉయ్యాల

బాల ఉయ్యాలమ్మ జోల ఉయ్యాల

పాలబుగ్గ పాప మేలి ఉయ్యాల

జగతిపై రామయ్య...

జగతిపై రామయ్య జన్మించినాడు

సత్యమ్ము లోకాన స్థాపించినాడు

తల్లిదండ్రుల మట చెల్లించినాడు

ఇల్లాలితోపాటు హింసపడ్డాడు

అయోధ్య రామయ్య అన్నయ్య మాకు

వాలుగన్నల సీత వదినమ్మ మాకు

నల్లని వాడయ్య...

నల్లని వాడయ్య ఆ చిన్ని కృష్ణయ్య

అందుకోబోతేను అందరాడమ్మ

కాళీయ మర్ధనం చేసినాడమ్మా

వేణునాదపు విద్య నేర్చినాడమ్మ

ఉట్టిపై వెన్నను కృష్ణయ్య తీస్తేను

ఉట్టిలో టెంకాయ మీరు కొట్టండి

ఉల్లాసమొప్పంగ ఉట్టికెగరండయ్య

ఉట్టిలో టెంకాయ ఎగిరి కొట్టండయ్య

కొట్టి తినండయ్య కొబ్బరి బెల్లాలు

ఉట్టి అదిగో వేగము ఉరికి రారండి...

మంచి గంధం మాచికాయ

మంచి గంధం మాచికాయ

ఊదొత్తి ఉమ్మకాయ

కప్పురంబు కచ్చోరంబు

కస్తూరికాగై రికమ్ము

సన్నవేరు సాంబరాణి

గంధ ధూపములు గండాదీపం

హారతి హోమం అగ్ని ధూమములు

దేవత సత్తువ దివికె జోతల

పురిటి సుద్దికే పున్నెము జోతలు

చిలుకల్లు చిలుకల్లు...

చిలుకల్లు చిలుకల్లు అందురేకాని

చిలుకలను రూపేమి పలుకులేగాని

హంసల్లు హంసల్లు అందురేగాని

హంసలకు రూపేమి ఆటలేగాని

పావురాలు పావురాలు అందురేగాని

పావురాలకు రూపేమి పాటలేగాని

కోయిల్లు కోయిల్లు అందురేగాని

కోయిల్లకు రూపేమి ఘోషలేకాని

చిలుకల్లు మా ఇంటి చిన్ని కోడళ్ళు

హంసల్లు మా ఇంటి ఆడపడుచుల్లు

పావురాలు మా ఇంటి బాలపాపల్లు

కోయిలలు మా ఇంటి కొత్తకోడళ్ళు

ఎంతోమంది పనివాళ్ళు...

ఎంతోమంది పనివాళ్ళు - ఎంతో మంచి పనివాళ్ళు

మడకను దున్నే మాదన్నా - కొడవలి పట్టిన కొండమ్మా

గుడ్డలు నేసే గురవయ్యా - బట్టలు ఉతికే బాలమ్మా                                         || ఎంతోమంది ||

కుండలు చేసే కుమరయ్యా - కొలిమిని ఊదే కోనయ్యా

చెప్పులు కుట్టే చెన్నయ్యా - దుస్తులు కుట్టే మస్తానూ                                       || ఎంతోమంది ||

చదువును నేర్పే సాంబయ్యా - యంత్రం నడిపే ఏసయ్యా

పనివాళ్ళంతా సమానమే - అని చెప్పేదే సమాజమూ                                       || ఎంతోమంది ||

వెనకా వెనకా వేముల తోట

వెనకా వెనకా వేములతోట

కనకా పండ్లు కాముని రూపులు

వాగూ నీళ్ళు వనముల పత్రి

మెత్తని కాళ్ళు మేచక శంకలు

దూదీ మడుగులు దుప్పటి రేకులు

తెల్లని గూళ్ళో నల్లని వినాయక

నాలుగు చేతులు బారెడు తొండం

నస్కారమయ్యా పార్వతీ తనయా!!


వెనుకకు | మొదటి పేజీ | ఆఖరి సారి మెరుగు పరిచిన తేది: 25-03-2009 | హక్కులు: తెలుగుదనం.కో.ఇన్  | రూపకర్త: గీతా.కో.ఇన్ | ప్రశ్నలు, సలహాలు, సూచనలకు: editor@telugudanam.co.in