www.telugudanam.co.in         చీరాల

తెలుగు పాఠాలు

చిన్నపిల్లల కోసం

మాగురించి

పత్రికలలో తెలుగుదనం

               మా అనుబంధ వెబ్‌సైట్..

సంస్కృతి, సంప్రదాయాలు

వనితల కోసం

సైట్‌మ్యాప్

తెలుగుదనం బ్లాగు

సాహిత్యం

అందరికోసం

సలహాలు

మా గీతా.కో.ఇన్

పిల్లల పాటలు (కొన్ని)

కృష్ణమ్మా...

వీడేనమ్మా కృష్ణమ్మా వేణువు వూదే కృష్ణమ్మా

ఆవులు కాసే కృష్ణమ్మా వీడే ముద్దుల కృష్ణమ్మా

కాళ్ళగజ్జెలు చూడండి మొలలో గంటలు చూడండి

మెడలో దండలు చూడండి తలలో పింఛం చూడండి

చదువులనిచ్చే కృష్ణమ్మా సంపదలిచ్చే కృష్ణమ్మా

పాపల కాచే కృషమ్మా బాల బంధుడీ కృష్ణమ్మా

వీడేనమ్మా కృష్ణమ్మా వేణువు వూదే కృష్ణమ్మా

రుచులు...

మామిడి పండు తీపి - దక్ష్రా పండు తీపి

జామపండు తీపి - ఆపిల్ పండు తీపి

చింత చిగురు పులుపు - చింతకాయ పులుపు

నారింజ పులుపు - నిమ్మకాయ పులుపు

కాకరకాయ చేదు - కాకరాకు చేదు

వేపకాయ చేదు - వేపాకు మహాచేదు

వెలక్కాయ వగరు - ఉసిరికాయ వగరు

కరక్కాయ వగరు - నేరేడు కూడా వగరు

మిరియాలు కారం - మిరపకాయ కారం

వండిన కూర కారం - ఎండిన లవంగం కారం

సముద్రం నీరు ఉప్పు - పట్టిన చెమట ఉప్పు

వచ్చే కన్నీరు ఉప్పు - తెలియని వంట ఉప్పు

గొబ్బెమ్మ పాట...

గొబ్బియ్యలో గొబ్బియ్యల్లో గొబ్బియ్యల్లో

మన సీతాదేవి వాకిట వేసిన గొబ్బియ్యల్లో                                 || గొబ్బియ్యల్లో ||

మాణిక్యాల ముగ్గులు వేసి గొబ్బియ్యల్లో

ఆ ముగ్గులు మీద మల్లెపూలు గొబ్బియ్యల్లో                             || గొబ్బియ్యల్లో ||

నవరత్నాల ముగ్గులు వేసి గొబ్బియ్యల్లో

ఆ ముగ్గుల మీద మొగలీ పూలు గొబ్బియ్యల్లో                          || గొబ్బియ్యల్లో ||

ధాన్యపురాశుల ముగ్గులు వేసి గొబ్బియ్యల్లో

ఆ ముగ్గుల మీద సంపెంగలు గొబ్బియ్యల్లో                               || గొబ్బియ్యల్లో ||

రంగురంగుల ముగ్గులు వేసి గొబ్బియ్యల్లో

ఆ ముగ్గుల మీద మందారాలు గొబ్బియ్యల్లో                             || గొబ్బియ్యల్లో ||

భూదేవంతా ముగ్గులు వేసి గొబ్బియ్యల్లో

ఆ ముగ్గుల మీద నక్షత్రాలు గొబ్బియ్యల్లో                                 || గొబ్బియ్యల్లో ||

లక్ష్మీ రధముల ముగ్గులు వేసి గొబ్బియ్యల్లో

ఆ ముగ్గుల మీద తులసీదళములు గొబ్బియ్యల్లో                     || గొబ్బియ్యల్లో ||

రామాలాలీ...

రామాలాలీ మేఘశ్యామా లాలీ

తామరసనయన దశరధతనయా లాలీ                                         || రామాలాలీ ||

అబ్జవదన ఆటలాడి అలసినావురా నీ

బొజ్జలో పాలరుగగానే నిద్రబోవేరా                                                 || రామాలాలీ ||

అద్దాల తొట్టెలోనేమో అనుమానించేవూ

ముద్దుపాపలున్నారని ముత్రిసి చూచూవూ                                   || రామాలాలీ ||

ఎంతో ఎత్తు మరిగినావు ఏమి సేతురా

ఇంతుల చేతుల కాకకు మేనెంతో కందునురా                              ||రామాలాలీ ||

జోలపాడి జో కొట్టితే ఆలకించేవు

చాలించి మరి యూరకుంటే సైగలు చేసేవు                                  || రామాలాలీ ||

వెన్న పాలు ఉగ్గు నెయ్యి బాలుడ నీవు

తిన్నగ సేవించవయ్య తియ్యగ నుండు                                         || రామాలాలీ ||

ముద్దుగారే...

ముద్దుగారే యశోద ముంగిట ముత్యము వీడు

దిద్దరాని మహిమల దేవకి సుతుడు                                             || ముద్దుగారే ||

పంతమాడే కంసుని పాలి వజ్రము

కాంతుల మూడు లోకల గరుడపచ్చబూ

చెంతల మాలోనున్న చిన్ని కృష్ణుడూ                                          || ముద్దుగారే ||

రతికేళి రుక్మిణికి తంగు మోవి పగడము

మితి గోవర్ధనపు గోమేధికము

సతమై శుంఖు చక్రాల సందుల వైడూర్యము

గతియై మమ్ము గాచేటి కమలాక్షుడు                                          || ముద్దుగారే ||

కాళింగుని తలలపై గప్పిన పుష్యరాగము

యేలేటి శ్రీ వెంకటాద్రి యింద్రనీలము

పాలజనిధిలోన బాయని దివ్య రత్నము

బలుని వలె దిరిగీ బద్మనాభు(డు                                                || ముద్దుగారే ||

భోగిపళ్ళ పాట...

శశిముఖులారా రారే

మన పసి బాలురకు భోగిపళ్ళు పోయుదాము                             || శశి ||

అద్దంపు చెక్కిళ్ళు ముద్దుటుంగరాలు

దిద్దిన కస్తూరి తిలకము మెరయగ                                             || శశి ||

మంగళాకారూలు మదన సందరూలు

రంగైన పీఠముపై రమణీ పసి బాలురకు                                     || శశి ||

మూడేసి దోసిళ్ళు మురియుచూ శిరమున

వేడుకతో మన బాలురకు పోయుదము                                      || శశి ||


వెనుకకు | మొదటి పేజీ | ఆఖరి సారి మెరుగు పరిచిన తేది: 25-03-2009 | హక్కులు: తెలుగుదనం.కో.ఇన్  | రూపకర్త: గీతా.కో.ఇన్ | ప్రశ్నలు, సలహాలు, సూచనలకు: editor@telugudanam.co.in