telugudanam.co.in

      telugudanam.co.in

   

సాల్మన్‌ రష్దీ

సాల్మన్‌ రష్దీ .
పేరు : అహమద్‌ సాల్మన్‌ రష్దీ
తండ్రి పేరు :

(తెలియదు).

తల్లి పేరు :

(తెలియదు).

పుట్టిన ప్రదేశం : మహరాష్ట్ర (నేటి బొంబాయి) లో జన్మించారు.
చదివిన ప్రదేశం : ఇంగ్లాండ్‌.
పుట్టిన తేది : 19-6-1947.
గొప్పదనం :

(తెలియదు).


భారతదేశానికి చెందిన సుప్రసిద్ధ ఆంగ్ల రచయితలలో సాల్మన్‌ రష్దీ ప్రముఖులు. పలు ఇంగ్లీషు నవలలను చక్కని సాహితీ విలువలతో, ఆకట్టుకునే శైలితో రచించి పాఠకులకు దగ్గరయ్యారు సాల్మన్‌ రష్దీ.

మహారాష్ట్రలో బొంబాయి (నేటి ముంబై) నగరంలో 1947వ సంవత్సరం జూన్ 19వ తేదీన సామాజికంగా, ఆర్ధికంగా ఉన్నతకుటుంబంలో అహమద్ సాల్మన్ రష్దీ జన్మించారు. రష్దీ తండ్రి వ్యాపారస్తుడు. సాల్మన్ రష్దీ విద్యాభ్యాసం అంతా ఇంగ్లండ్‌లోనే జరిగింది కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయం నుండి ఉన్నత విద్యాభ్యాసం పూర్తయింతరువాత, ఒక అడ్వర్టైజింగ్ కంపెనీలో కాపీరైటర్‌గా సాల్మన్‌రష్దీ తన ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించారు. సాల్మన్ రష్దీ రచించిన తొలి నవల 'Grimus' 1975వ సంవత్సరంలో ప్రచురితమైంది. కానీ, సాల్మన్ రష్దీ ద్వితీయ రచన అయిన 'Midnight Children', సాల్మన్‌రష్దీకి పలువురి నుంచి ప్రశంలందేలా చేసింది.

ఆధునిక భారతదేశంలోని పరిస్థితులను గురించి వర్ణిస్తూ సాల్మన్ రష్దీ రచించిన 'Midnight Children' రష్దీకి అంతర్జాతీయంగా పేరుప్రఖ్యాతలు సంపాదించి పెట్టింది. తరువాత 1983వ సంవత్సరంలో, పాకిస్తాన్‌లోని రాజకీయ పరిస్థితుల గురించి వర్ణిస్తూ సాల్మన్ రష్దీ 'Shame' అన్న నవల వ్రాశారు. 1988వ సంవత్సరంలో సాల్మన్‌రష్దీ రచించిన 'Satanic Verses' నవల విడుదలై, సంచలనం సృష్టించింది. ముస్లింల మనోభావాలను కించపరచారంటూ పలు ఆందోళనలు రష్దీ రచనకు వ్యతిరేకంగా జరిగాయి.

చాలా దేశాల్లో ముస్లింల నుండి తీవ్ర అభ్యంతరం వ్యక్తం కావడంతో, 'Satanic Verses' పుస్తకాన్ని నిషేధించారు. మహమ్మద్ ప్రవక్తను, ఇస్లాంను కించపరచారన్న ఆరోపణతో ఇరాన్ ప్రభుత్వం సాల్మన్‌రష్దీకి మరణదండన విధించింది. ఇరాన్‌కు చెందిన అయతుల్లా ఖోమైని సాల్మన్‌రష్దీని చంపినవారికి ఆరు మిలియన్ డాలర్లు బహుమతిని ప్రకటించారు. అప్పటినుండి సాల్మన్ రష్దీ స్కాట్లాండ్ యార్డ్ పోలీసుల రక్షణలో బాహ్యప్రపంచానికి దూరంగా వుంటూనే తన రచనా వ్యాసంగాన్ని కొనసాగించారు. 'Imaginary Home lands' (1991వ సంవత్సరం) అనే వ్యాస సంకలనాన్ని, 'East-West' (1944వ సంవత్సరం) అనే కధా సంకలనాన్ని,' The Vintage Book Of Indian Writing ' 1947-97 (1997 సంవత్సరం), ' The Ground Beneath Her Feet ' (1999వ సంవత్సరం) రచనలు వెలువరించారు.

బొంబాయి (నేటి ముంబై)లో జన్మించినప్పటికీ, అధిక కాలం విదేశాలలోనే గడిపిన సాల్మన్ రష్దీ, రచయితలను ప్రభావితం చేసే వాతావరణంతో నిండి ఆహ్లాదంగా వుండే 'రైటర్స్ రిసార్ట్' ను తన పూర్వికుల స్వస్థలమైన హిమాచల్ ప్రదేశ్‌లోని సోలన్ సమీపంలో నిర్మించారు.

ఇటీవలె మోడల్, నటి అయిన పద్మలక్ష్మిని సాల్మన్‌రష్దీ వివాహం చేసుకున్నారు. పలు సంచలనాత్మక రచనలు చేసి, సాల్మన్ రష్దీ ప్రపంచ సాహిత్యరంగంలో భారత కీర్తిబావుటాను ఎగురవేసిన సాల్మన్‌రష్దీ ప్రశంసనీయులు.


మూలం: భారతీయం, ఆదెళ్ళ శివకుమార్, ఓం పబ్లికేషన్స్.

[ వెనుకకు ] [ ముందుకు ]

Telugudanam.co.in
వెనుకకు | మొదటి పేజీ | తెలుగుదనం బ్లాగు | మాగురించి | సలహాలు | పత్రికలలో తెలుగుదనం                                సందర్శకుల సంఖ్య: