telugudanam.co.in

      telugudanam.co.in

   

ధీరుబాయ్ అంబానీ

ధీరుబాయ్ అంబానీ
పేరు : ధీరుబాయ్‌ అంబానీ.
చదివిన ప్రదేశం : కాన్పూర్‌.
తండ్రి పేరు :

(తెలియదు).

తల్లి పేరు :

(తెలియదు).

పుట్టిన తేది : 28-12-1932.
పుట్టిన ప్రదేశం : "ఛోర్వాడ్" అనే గ్రామంలో (గుజరాత్‌‌‌) లో జన్మించాడు.
గొప్పదనం : ఆశ, ఆశయం, కృషి ఈ మూడు ఆయనను గొప్పవాడిని చేశాయి.
స్వర్గస్తుడైన తేది : 6-7-2002.

"అతను వచ్చాడు! చూశాడు! గెలిచాడు!" అంటూ అలెగ్జాండర్ గురించి వర్నిస్తాడొక ఆంగ్ల రచయిత. (He came! He saw! He conquered!) ధీరుబాయ్ అంబానీ గురించి చెప్పాలంటే కూడా పై వాక్యం సరిగ్గా సరిపోయింది.

నిరంతర కృషితో అంచెలంచెలుగా ఎదుగుతూ అత్యున్నత స్థాయికి చేరుకున్న అంబానీ లాంటి వారు ఏ రంగానికి చెందిన వారైనా, ఏ కాలానికి చెందిన వారైనా వారు యువతకు ఆదర్శనీయులే. "ఆత్మకు మరణం లేదు" అన్న శ్రీకృష్ణుని (భగవద్గీత) మాటలు నిజమనిపిస్తాయి. అంబానీ లాంటివారి స్ఫూర్తితో విజయాలు సాధించామని ఎవరైనా చెబుతున్నపుడు. గుజరాత్‌ రాష్ట్రంలోని ఛోర్వాడ్‌లో 1932వ సంవత్సరం డిశెంబర్ 28వ తేదీన జన్మించిన ధీరుబాయ్ అంబానీ తన 17 సంవత్సరాల వయసులో ఏడెన్ (ప్రస్తుతం యెమెన్‌లో వున్నది) వెళ్ళి అక్కడి ఎ బేస్సే అండ్ కో కంపెనీలో పనిచేశారు.

1958వ సంవత్సరంలో భారతదేశానికి తిరిగివచ్చిన ధీరుబాయ్ బొంబాయ్‌లో 'రిలయన్స్ కమర్షియల్ కార్పొరేషన్' ను ప్రారంభించారు. తరువాతి కాలంలో 1966వ సంవత్సరంలో టెక్స్‌టైల్ మిల్‌ను అహ్మదాబాద్‌లోని బరోడా (గుజరాత్) నందు స్థాపించారు. అది అంబానీకి కీలక మలుపు ఇక అక్కడినుండి ధీరుబాయ్ వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. 1977వ సంవత్సరంలో పబ్లిక్ ఇష్యూ రంగంలోకి ప్రవేశించిన 'రిలయన్స్' కంపెనీకి నేడు దాదాపు నాలుగు మిలియన్లకు పైగా ఇన్వెస్టర్లు ఉన్నారు.

1991వ సంవత్సరంలో 'హజారియా' గ్యాస్ క్రాకర్ ప్లాంట్ ఏర్పాటు గురించి ప్రకటించారు. ప్రపంచ మార్కెట్లో జిడిఆర్ ఇష్యూను జారీ చేయడం ద్వారా ఆ విధంగా చేసిన తొలి భారతీయ కంపెనీగా 'రిలయన్స్' చరిత్ర సృష్టించింది. అంతేకాక రిలయన్స్ కంపెనీ తన సామ్రాజ్యాన్ని వివిధ రంగాల్లోకి విస్తరించడం ప్రారంభించింది. అందులో భాగమే ప్లాస్టిక్స్ మరియు పివిసి (1993), హజిరా గ్యాస్ ప్లాంట్ (1994) వంటిది.

1996వ సంవత్సరంలో విద్యుత్ మరియు టెలికాం రంగాల్లోకి ప్రవేశించిన రిలయన్స్ కంపెనీ రూ. 1000/- కోట్ల ప్రాఫిట్ స్ధాయినందుకున్న తొలి భారతీయ కంపెనీగా చరిత్ర సృష్టించింది. 1997వ సంవత్సరంలో హజీరా ప్లాంట్‌లో ప్రపంచంలోనే అతిపెద్దదైన 'మల్టీఫీడ్‌ క్రాకర్' ను నెలకొల్పారు. 1999వ సంవత్సరంలో గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో ప్రపంచంలోనే అతిపెద్దదైన 'గ్యాస్‌ రూట్ రిఫైనరీ' ని రిలయన్స్ కంపెనీ ప్రారంభించింది.

" వెయ్యిమైళ్ళ ప్రయాణమైనా ఒక్క అడుగుతోనే మొదలవుతుంది" అన్న ఆర్యోక్తి భౌతికరూపం ధీరుభాయ్ అంబానీ అని నిస్సందేహంగా చెప్పవచ్చు.

ఒక మామూలు పాఠశాల అధ్యాపకుని కుమారునిగా జన్మించిన ధీరూబాయ్ అంబానీ, తిరిగి వెళ్ళేనాటికి దాదాపు అరవైఐదు వేలకోట్ల రూపాయల 'రిలయన్స్' మహా సామ్రాజ్యాధినేత. ఇది అంబానీకి ఎలా సాధ్యమైంది? ఆశ, ఆశయం, కృషి - యీ మూడూ అంబానీని సామాన్యుడి స్ధాయినుండి అసామాన్య స్ధాయికి చేర్చాయి. ఆధునిక భారతదేశ చరిత్రలో విశిష్ట చరిత్రను ఆపాదించాయి.

1986వ సంవత్సరంలో తొలిసారి గుండెపోటు రావడంతో ధీరూబాయి అంబానీ విశ్రాంతి తీసుకుని, ప్రధాన బాధ్యతలన్నీ కుమారులు ముఖేష్ అంబానీ మరియు అనిల్ అంబానీలకు అప్పగించారు. తండ్రి బాటలోనే సాగిన అనిల్, ముఖేష్‌లు 'రిలయన్స్' ను మరింత ఉన్నత శిఖరాలకు చేర్చారు.

2002వ సంవత్సరం జులై 6వ తేదీన మరోసారి తీవ్రమైన గుండెపోటు రావడంతో తన 'రిలయన్స్' వ్యాపార సామ్రాజ్య బాధ్యతలను పూర్తిగా తన కుమారులకప్పగించి ధీరుబాయ్ అంబానీ శాశ్వతంగా విశ్రాంతి తీసుకున్నారు.


మూలం: భారతీయం, ఆదెళ్ళ శివకుమార్, ఓం పబ్లికేషన్స్.

[ వెనుకకు ] [ ముందుకు ]

Telugudanam.co.in
వెనుకకు | మొదటి పేజీ | తెలుగుదనం బ్లాగు | మాగురించి | సలహాలు | పత్రికలలో తెలుగుదనం                                సందర్శకుల సంఖ్య: