telugudanam.co.in

      telugudanam.co.in

   

డా|| రాజారామన్న

డా|| రాజారామన్న
పేరు : డా|| రాజారామన్న.
చదివిన ప్రదేశం : లండన్‌.
తండ్రి పేరు :

(తెలియదు).

తల్లి పేరు :

(తెలియదు).

పుట్టిన తేది : 28-01-1925.
పుట్టిన ప్రదేశం : "కర్నాటక" రాష్ట్రంలోని మైసూర్‌లో జన్మించాడు.
చదువు : పి.హెచ్‌.డి.
గొప్పదనం : బెంగుళూర్ నగరంలో 'National Institute of Science' ను స్ధాపించారు.

భారతదేశం శాస్త్ర, సాంకేతిక రంగాలలో సంచలన విజయాలు సాధించడంలో, అద్భుతమైన ప్రగతిని సాధించడంలో కీలకపాత్ర వహించిన వారిలో డా|| రాజారామన్నగారు ఒకరు. 'భారత అణుబాంబు పిత' గా పేరొందిన డా|| రాజారామన్నగారు భారతదేశం అణుబాంబును తయారు చేయడంలో కీలకపాత్ర పోషించారు. తద్వారా భారతదేశం శత్రు భీకరంగా రూపొందడానికి తనవంతు సహాయాన్ని అందించారు.

కర్ణాటక రాష్ట్రంలోని మైసూర్‌లో జనవరి 28వ తేదీ 1925వ సంవత్సరంలో జన్మించిన రాజారామన్న ప్రాధమిక విద్యాభ్యాసం మైసూర్‌లోనే చేశారు. తరువాత బెంగుళూర్, మద్రాసు (నేటి చెన్నై) నగరాలలో ఉన్నత విద్యాభ్యాసం చేసిన రాజారామన్నగారు లండన్‌లోని కింగ్స్ కాలేజి నుండి మాలిక్యులర్ ఫిజిక్స్ (పదార్ధ భౌతికశాస్త్రం) నందు పి.హెచ్‌.డి పూర్తి చేశారు. (1948 వ సంవత్సరంలో) 1949వ సంవత్సరంలో 'టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్' లో ప్రొఫెసర్‌గా రామన్నగారు తన ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించారు. అక్కడ సుప్రసిద్ధ శాస్త్రజ్ఞుడు డా|| హోమీ జహంగీర్ బాబాగారి సహచర్యం లభించడం రాజారామన్నగారిని ప్రభావితం చేసింది.

హొమీ జహంగీర్ బాబాగారి దార్శనికత (లేదా దూరదృష్టి) భారతదేశానికి తరువాతి కాలంలో డా|| రాజారామన్నగారి వంటి పలువురు శాస్త్ర, సాంకేతిక రంగ నిపుణులను అందించింది. "తారాపూర్ అణు విద్యుత్ కేంద్రం" నిర్మాణ సమయంలో డా|| హొమీబాబాగారు బాధ్యతలను డా|| రాజారామన్నగారికి అప్పగించడం జరిగింది. వాటిని రామన్నగారు సమర్ధవంతంగా నిర్వహించడం వన హొమీబాబాగారు విమాన ప్రమాదంలో మరణించిన తరువాత భారతప్రభుత్వం 'అటామిక్ ఎనర్జీ కమీషన్‌' ఛైర్మన్‌గా, 'అటామిక్ ఎనర్జీ డిపార్ట్‌మెంట్' సెక్రటరీగా డా|| రాజారామన్నగారిని నియమించింది.

1989వ సంవత్సరంలో టాటాల ప్రోత్సాహం, ఫ్రాన్స్ నుండి ఆర్ధిక సహకారం అందడం వలన డా|| రాజారామన్నగారు తన ఉద్యోగానికి రాజీనామాచేసి బెంగుళూర్ నగరంలో 'National Institute of Science' ను స్ధాపించారు.


మూలం: భారతీయం, ఆదెళ్ళ శివకుమార్, ఓం పబ్లికేషన్స్.

[ వెనుకకు ] [ ముందుకు ]

Telugudanam.co.in
వెనుకకు | మొదటి పేజీ | తెలుగుదనం బ్లాగు | మాగురించి | సలహాలు | పత్రికలలో తెలుగుదనం                                సందర్శకుల సంఖ్య: