telugudanam.co.in

      telugudanam.co.in

   

మేడం కేమా

మేడం కేమా
పేరు : మేడం కేమా.
తండ్రి పేరు :

(తెలియదు).

తల్లి పేరు :

(తెలియదు).

పుట్టిన తేది : 24-09-1861.
పుట్టిన ప్రదేశం : బొంబాయి.
చదివిన ప్రదేశం :

(తెలియదు).

చదువు :

(తెలియదు).

గొప్పదనం :

(తెలియదు).

స్వర్గస్తుడైన తేది : 13-08-1936.

ఉన్నత పార్శీ కుటుంబంలో పుట్టిన భికాయ్ సోరల్ పటేల్, రుస్తుం కేమాను వివాహమాడి బికాయ్‌జీ రుస్తుం కేమా అయింది.

1896లో బొంబాయిలో ప్లేగు వ్యాధి వ్యాపించింది. భికాయ్‌జీ వ్యాధిగ్రస్తుల సేవలో పాల్గొంది. ఆ దశలో ఆమెకు కూడా ప్లేగు వ్యాధి సోకింది. చికిత్స కోసం ఆమె లండన్‌ వెల్లింది. అప్పటికే ఆమె దేశభక్తి కార్యక్రమాలలో పాల్గొంటూ ఉండేది. అటువంటి కార్యకలాపాలు మానుకోకపొతే తిరిగి భాతదశంలో కాలుపెట్టనీయమని బ్రిటీష్ వాళ్ళ వార్త ఆమెకు చేరింది. ఆమె అందుకు ఒప్పుకోకుండా బ్రిటీష్ నుండే భారత స్వాతంత్రం కోసం ఉద్యమించింది.

ఆ తరువాత ఆమె పారిస్ వెళ్ళింది. ఆమెను అప్పగించడానికి ఫ్రాన్స్ ప్రభుత్వం నిరాకరించగా, భారతదేశం‌లో అమె ఆస్తిని బ్రిటీష్ ప్రభుత్వం హస్తగతం చేసుకుంది.

ఆమె 1907 లో జర్మనీలో 'భారత స్వాంతంత్ర పతాకం' ఎగురవేసింది. వీర సావర్కర్, శ్యామ్‌జీ కృష్ణవర్మ, కేమా కలిసి రూపొందించిన ఆ పతాకం ఆధారంగా జాతీయ పతాకం రూపుదిద్దుకుంది. " స్వేచ్ఛ లేకపోవడం అభిమానం కోల్పోవడమే" అన్న మేడం కేమా చివరి వరకూ స్వతంత్రం కోసం తపిస్తూనే ఉంది.


మూలం: సాక్షి, 13-09-08.

[ వెనుకకు ] [ ముందుకు ]

Telugudanam.co.in
వెనుకకు | మొదటి పేజీ | తెలుగుదనం బ్లాగు | మాగురించి | సలహాలు | పత్రికలలో తెలుగుదనం                                సందర్శకుల సంఖ్య: