telugudanam.co.in

      telugudanam.co.in

   

సర్వేపల్లి రాధాకృష్ణ

సర్వేపల్లి రాధాకృష్ణ
పేరు : సర్వేపల్లి రాధాకృష్ణ.
తండ్రి పేరు :

(తెలియదు).

తల్లి పేరు :

(తెలియదు).

పుట్టిన తేది : 8-9-1888.
పుట్టిన ప్రదేశం : తమిళనాడులోని తిరుత్తణిలో జన్మించారు.
చదివిన ప్రదేశం : విద్యాభ్యాసం తిరుత్తణిలోనూ, తిరుపతిలోనూ జరిగింది.
చదువు : బి.ఏ.
గొప్పదనం : మొదటి నుంచి ఉపాధ్యాయులను గౌరవిస్తూ వారి అడుగుజాడల్లో నడుస్తూ సత్ ప్రవర్తన, క్రమశిక్షణతో మెలుగుతూ డాక్టర్ రాధాకృష్ణన్ అంతర్జాతీయ స్థాయికి ఎదిగి ఖ్యాతి గడించాడు.
స్వర్గస్తుడైన తేది : 17-4-1975.

శ్రీ రాధా కృష్ణ అసలు పేరు సర్వేపల్లి రాధాకృష్ణ 1888 సెప్టెంబరు 8వ తేదీన తమిళనాడులోని తిరుత్తణిలో జన్మించారు. ప్రాధమిక విద్యాభాసం తిరుత్తణిలో జరిగినప్పుడు పాఠశాలలో అతని పేరును రాధాకృష్ణకు బదులుగా రాధాకృష్ణన్ గా రాయడం వల్ల అదే పేరును చివరి వరకు ఉంచుకోవటం జరిగింది. చదువుకునేటప్పుడు అతడు తన ఉపాధ్యాయులను ఎంతో గౌరవిస్తూ, టీచర్లను అల్లరి పట్టించే విద్యార్ధులను మందలిస్తూ "మనకు చదువునేర్పి, మనల్ని ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దటానికి కృషిచేస్తున్న ఉపాధ్యాయులను వెక్కిరించటం, వారి వెనుక చెడుగా మాట్లాడటం మహపాపం. వారు మనకు దైవం లాంటివారు" అని చేప్పేవారు.

రాధాకృష్ణన్ విద్యాభ్యాసం తిరుత్తణిలోనూ తిరుపతిలోనూ జరిగింది. చిన్నతనం నుంచి చదువుపైన శ్రద్ద, ఉపాధ్యాయులపట్ల గౌరవం, భక్తిభావాలు బాగా పెంచుకోవటం వల్ల, అతనికి ఇతర వ్యాపకాల మీద అంతగా ఆసక్తి ఉండేదికాదు. మద్రాసు క్రిష్టియన్ కళాశాలలో తత్వశాస్త్రంలో బి.ఏ. పూర్తి చేసిన అనంతరం, అతనికి ఆ శాస్త్రంపై ప్రత్యేక ఆసక్తి కలిగి సంపూర్ణంగా అధ్యయనం చేయాలని నిర్ణయంచుకున్నాడు. ఆ క్షణం నుంచి అనేక పుస్తకాలు చదివి, యోగులు, సాధువులు, మహాత్ములను కలిసి వారి నుండి ఎన్నో విషయాలను సేకరించి ఒక పుస్తకంలో రాసుకునేవాడు. ప్రతిరోజూ రాత్రి డైరీ రాస్తూ, ఆ రోజు జరిగిన అనుభవాలను, తెలుసుకున్న విషయాలను విశ్లేషించి రాసుకునేవాడు. అనంతరం అతను ఎంతగానో అభిమానించే ఉపాధ్యాయ వృత్తిని చేపట్టాలని నిర్ణయించుకుని, అతను చదివిన కాలేజీలోనే ఫిలాసఫీ లెక్చరర్‌గా చేరాడు.

1908లో ఉద్యోగంలో చేరిన తరువాత తన వృత్తి ధర్మాన్ని పాటిస్తూ, పిల్లలను బిడ్డల్లా చూసుకుంటూ, వారికి కేవలం చదువే కాకుండా, మంచి అలవాట్లను, బుద్దులను నేర్పిస్తూ విరామ సమయంలో తత్వానికి సంబంధించిన గ్రంధాలను లైబ్రరీలో కూర్చొని కూలంకుషంగా చదివి వాటిపైన వ్యాఖ్యానాలను తన డైరీలో రాసుకునేవాడు. రాధాకృష్ణన్ ఏ అవకాశాన్ని విడువకుండా అనేక వ్యాసాలను రాశాడు. 1911లో ఆయన రాసిన "ఎధిక్స్ ఆఫ్ వేదాంతం" అనే విశ్లేషణాత్మక వ్యాసానికి ఎం.ఏ. డిగ్రీ లభించింది. రాధాకృష్ణన్ ప్రతిభను గుర్తించిన పండిత్ జవహర్‌లాల్ నెహ్రూ ఆయనను రష్యా రాయబారిగా నియమించారు. 1952లో ఉపరాష్ట్రపతి పదవిని చేపట్టి అందరికీ ప్రీతిపాత్రుడయ్యాడు

ఉత్తమ ఉపాధ్యాయుడిగా, మానవతావాదిగా, విద్యావేత్తగా, దేశాధ్యక్షుడిగా అందరి హృదయాల్లోనూ పదిలమైన స్థానం సంపాదించుకున్న రాధాకృష్ణన్ కు భారత ప్రభుత్వం "భారతరత్న" బిరుదునిచ్చి, ఆ బిరుదు విలువను పెంచింది. శ్రీ రాధాకృష్ణన్ 1975 ఏప్రిల్ 17న తన 87వ యేటన స్వర్గస్థుడయ్యాడు.


మూలం: జాతిరత్నాలు, బి.వి.పట్టభిరాం, శ్రీ మహలక్ష్మీ పబ్లిషింగ్ హౌస్.

[ వెనుకకు ] [ ముందుకు ]

Telugudanam.co.in
వెనుకకు | మొదటి పేజీ | తెలుగుదనం బ్లాగు | మాగురించి | సలహాలు | పత్రికలలో తెలుగుదనం                                సందర్శకుల సంఖ్య: