www.telugudanam.co.in         చీరాల

తెలుగు పాఠాలు

చిన్నపిల్లల కోసం

మాగురించి

పత్రికలలో తెలుగుదనం

               మా అనుబంధ వెబ్‌సైట్..

సంస్కృతి, సంప్రదాయాలు

వనితల కోసం

సైట్‌మ్యాప్

తెలుగుదనం బ్లాగు

సాహిత్యం

అందరికోసం

సలహాలు

మా గీతా.కో.ఇన్

వట్టివేళ్ళు ( నానీలు )

 [ వెనుకకు ]    [ ముందుక ]

ఒక్కో పుల్లతో

ఊడవలేము

అన్నీ కలిస్తేనే

అది చీపురుకట్ట

పనిపిల్లవల్ల కాదు

ఇల్లు కళకళ

ఆమె

పనివల్లనే మరి!

మావాడు

రోజూ ఇంటర్‌నెట్‌కి

అవును

ఈడొచ్చేసింది మరి

గొర్రెల మంద

ఛీ.. పంట పొలంలో

పైరు పెరిగి

పృధ్వీ పరిమళం

వెండి బంగారం

కట్నం లేదు

కోడలి మనసు ముందు

అవి వెల వెల

పగిలిన చిల్ల పెంకులు

అతుక్కోవు

అవి చరిత్రకు

కైఫీయత్తులు

పున్నామ నరకం

తప్పిస్తాడు కొడుకు

వీడు

ఇక్కడే చూపించాడు

కంచిస్వామి కథ

కంచికే అయితే

మరి జయమ్మ కథ!

ఎవరింటికి?

కొత్త జంట కలల్ని

అమెరికా డాలర్లు

మింగేశాయి

మిగిలాయి అలలు

సునామీ కంటే

విరాళాలే

ఎక్కువగా

ముంచిపారేశాయిగదరా!

రైల్వేస్టేషన్‌లో

తాగేనీల్లు దొరకవు

కూల్‌డ్రింక్స్

కొనుక్కోండి

రైతునయ్యానో లేదో

మీరే చెప్పాలి

ఎందుకంటే

అది రొయ్యల పంట

ఎంత పొగరు

సముద్రానికి?

ఉప్పగా వున్నా

ఉప్పొంగిపోతోంది.

ఈ చీర

చీరాలదే

ముతకగా ఉండొచ్చు కాని

అతుకుతుంది మనసుల్ని

రచయిత : వడలి రాధాకృష్ణ

 [ వెనుకకు ]    [ ముందుక ]


వెనుకకు | మొదటి పేజీ | ఆఖరి సారి మెరుగు పరిచిన తేది: 25-03-2009 | హక్కులు: తెలుగుదనం.కో.ఇన్  | రూపకర్త: గీతా.కో.ఇన్ | ప్రశ్నలు, సలహాలు, సూచనలకు: editor@telugudanam.co.in