www.telugudanam.co.in         చీరాల

తెలుగు పాఠాలు

చిన్నపిల్లల కోసం

మాగురించి

పత్రికలలో తెలుగుదనం

               మా అనుబంధ వెబ్‌సైట్..

సంస్కృతి, సంప్రదాయాలు

వనితల కోసం

సైట్‌మ్యాప్

తెలుగుదనం బ్లాగు

సాహిత్యం

అందరికోసం

సలహాలు

మా గీతా.కో.ఇన్

వట్టివేళ్ళు ( నానీలు )

[ వెనుకకు ]    [ ముందుకు ]

దండు బాట

బాగుచేయాల్సిందే కాని

దండుకోవటానికి మాత్రం

కాదు

మనోహర్‌కు

ఉరిశిక్ష వద్దా?

మరో శ్రీలక్ష్మీ

సంగతేమిటి?

ఇల్లు విశాలం

మనసులు ఇరుకు

బయటి కొచ్చా

జనారణ్యం బెరుకు

వెదురు గడకు

బొక్కలంటావా

అయ్యో అవి

నాదబ్రహ్మకు ద్వారాలు

కరెంటు కట్టా?

ఆహా ఎంత హాయి!

అదేమిటి?

టివీ బెడద తప్పింది

మా వూరి రోడ్లపైనా

గుంటలే

హైదరాబాదే కదా

మాకాదర్శం

మాది చినబొంబాయి

పెద్దతో పోటీ

రెడ్‌లైట్స్

మాకూ ఉన్నాయ్!

న్యాయం!చట్టం

కళ్ళులేవు

ఉన్నవేమిటి?

కన్నీళ్ళు తెప్పించే ప్రశ్నలు

మళ్ళీ ఇన్నాళ్ళకి

మావూరు వెళ్ళా

చిన్నప్పటి అందాలను

ఎవరెత్తుకెళ్ళారో!?

సూరీడు

పడమరలో క్రుంగాడు

రేపు వచ్చేది

మరో సూర్యుడా!?

చావడమిప్పుడు

మహా ఈజీ

కాంకేతికాభివృద్ధి

మహిమ ఇది!

కడలి అలలు

కాళ్ళు కడుగుతూనే

కాళ్ళాకింది నుంచి

లాగేస్తుంది!

మేఘాల వలన

ఇక్కడికి

అక్కడ చిరపుంజీ

చిన్నబోయింది

ఆ ఇల్లు

వాస్తు బాగోలేదు

ఊచలు వంచాడు

ఇప్పుడు లెక్కిస్తున్నాడు

రచయిత : వడలి రాధాకృష్ణ

[ వెనుకకు ]    [ ముందుకు ]


వెనుకకు | మొదటి పేజీ | ఆఖరి సారి మెరుగు పరిచిన తేది: 25-03-2009 | హక్కులు: తెలుగుదనం.కో.ఇన్  | రూపకర్త: గీతా.కో.ఇన్ | ప్రశ్నలు, సలహాలు, సూచనలకు: editor@telugudanam.co.in