www.telugudanam.co.in         చీరాల

తెలుగు పాఠాలు

చిన్నపిల్లల కోసం

మాగురించి

పత్రికలలో తెలుగుదనం

               మా అనుబంధ వెబ్‌సైట్..

సంస్కృతి, సంప్రదాయాలు

వనితల కోసం

సైట్‌మ్యాప్

తెలుగుదనం బ్లాగు

సాహిత్యం

అందరికోసం

సలహాలు

మా గీతా.కో.ఇన్

వట్టివేళ్ళు ( నానీలు )

 [ వెనుకకు ]    [ ముందుక ]

మెరిసే మెరుపు

చటుక్కున

ఆగిపోయింది

ఆ మెరుపు తీగను చూసి

తప్పు

వాడు చేశాడు

ఆమె పంచుకొంది

చివరకు ఆమే పతితా!

"ఓహో! ఉప్ప తొట్టెలు

వెలుగుతున్నాయి

చెత్తలేకున్నా

పసిగుడ్డులతో"

ఉగాది వేడుక

అమెరికాలోనా

వేపచెట్టుకిక

డాలర్లు పూస్తాయి

నివురుకి

ఎంత సాహసం

నిప్పును సైతం

కప్పిపెడుతోంది

అందరి నోటా

ఇంగ్లీషు మాటలే

ఇదేం

తెలుగు ప్రదేశండి బాబూ!

మేపలేక

రోతపుడుతోంది

కోరికల గుర్రాలపై

స్వారీ ఇకవద్దు

పగలే వెలుగుతున్నాయి

వీధి దీపాలు

రాత్రికి

మిణుగురులే గతా?

పెళ్ళికి ముందు

మనసు శూన్యం

పెళ్ళాం వచ్చింది

వలపు మాన్యం

అమ్మ కొట్టేది

మారుతల్లి మాట్లాడదు

ఇప్పుడు

ఆ దెబ్బలే బాగున్నాయి

అమ్మాయికి

హెచ్.ఐ.వి.నట

భర్త పేరు

శ్రీరామచంద్రుడు

కొడుకు

రెండుసార్లు ఏడ్చాడు

అప్పుడు అన్నం కోసం

ఇప్పుడు పెట్టాలని

వహ్వా

వాలెంటైన్ డే

ప్రేమకు కూడా

వార్షికాలేమిటండీ!

ప్రళయాలు వచ్చి

పెకలిస్తున్నాయి

కులం మతం

మినహాయింపు

రచయిత : వడలి రాధాకృష్ణ

 [ వెనుకకు ]    [ ముందుక ]


వెనుకకు | మొదటి పేజీ | ఆఖరి సారి మెరుగు పరిచిన తేది: 25-03-2009 | హక్కులు: తెలుగుదనం.కో.ఇన్  | రూపకర్త: గీతా.కో.ఇన్ | ప్రశ్నలు, సలహాలు, సూచనలకు: editor@telugudanam.co.in