|
www.telugudanam.co.in చీరాల |
పత్రికలలో తెలుగుదనం | మా అనుబంధ వెబ్‌సైట్.. |
|||
| తెలుగుదనం బ్లాగు | |||||
| మా గీతా.కో.ఇన్ |
వట్టివేళ్ళు ( నానీలు )
పచ్చని చెట్టు
పెకలింపు
ఇక పసికర్లప్పుడే
పచ్చదనం
పెరట్లోని చెట్టుపీకి
బొన్సాయ్
మనిషి బుద్ది
మరుగుజ్జు మరి
అమ్మాయిలే
చదువులకి రాణులు
పెళ్ళి చేసి
మా రాజును అప్పగించా
వీధిపంపు దగ్గర
అప్రెంటిస్ చేశా
సైనికునిగా
చేరాలని
గూటి పడవలో
విహరించాలని...
కాలువకు కన్నీళ్ళు తప్ప
నీళ్ళేవీ!
శారద
తెలుగుదనం
నానీల పూదోటలో
సేద దీరుతోంది
పెరిగిన
ఆల్మెట్టి గోడ
మనుషుల మధ్య
గోడతో చిన్నబోయింది
తెల్లారిందని
ఎలా చెప్పగలిగావ్?
ఓ అదా
అమ్మ నిద్రలేచిందిగా
ఇంటిచుట్టూ
పిచ్చుకగూళ్ళే
ఖచ్చితంగా
వింతల్లో వింత
పోస్టులో
ప్రసాదాల పంపిణి
ప్రజల వద్దకు
దేముడు పాలన మరి
నేటి సిన్మా
హీరోయిన్
వ్యాంప్ తానే
కొందరి కడుపు కొట్టేస్తుంది
తెలుగు సంస్కృతి
ఏదీ? ఎక్కడా??
వలస పోయిందిగా
అమెరికాకి
పండు
రాలింది
చెట్టుపై కోపం కాదు
విత్తనమై మొలకెత్తాలని
వేసవిలో
వర్షపు జల్లు
వాడిని ఢీకొని
వీడ్ కోసం...ఓ యోధలా
రచయిత : వడలి రాధాకృష్ణ
వెనుకకు | మొదటి పేజీ | ఆఖరి సారి మెరుగు పరిచిన తేది: 25-03-2009 | హక్కులు: తెలుగుదనం.కో.ఇన్ | రూపకర్త: గీతా.కో.ఇన్ | ప్రశ్నలు, సలహాలు, సూచనలకు: editor@telugudanam.co.in