|
www.telugudanam.co.in చీరాల |
పత్రికలలో తెలుగుదనం | మా అనుబంధ వెబ్‌సైట్.. |
|||
| తెలుగుదనం బ్లాగు | |||||
| మా గీతా.కో.ఇన్ |
వట్టివేళ్ళు ( నానీలు )
పేకాట
ఆడేకొద్దీ కోల్పోయి
అనుభవం
మూల్యాన్ని చెల్లిస్తూనే ఉంది
దిష్టి బొమ్మ
ఉద్రేకం ఎక్కడైనా
కూడలిలో
తగులబడేది
అమ్మ తొలిపొద్దుకు
ముందే పొడిచింది
సూర్యుడి తెలివికి
ఆమే అలారం
బొడ్డురాయి
తవ్వాలని తన్నులాట
రాయి మారలేదు
తురాయిలు మారాయి
ప్రవాహం
ఎగిరెగిరిపడుతుంది
ఓనాడిది
ఎండిన మృతనదే
మల్లెపూలదే
ఆశ్చర్యం!
వేసవి వేడిమిలో
పరిమళిస్తాయి
ఇద్దరి మధ్య పోరు
వాడు ఎటు
కన్న ఆవిడ వైపా
కొన్న ఆవిడ వైపా
పుడమి
నిండు చూలాలైంది
ఈ రోజు
చిరంజీవి సిన్మా రిలీజ్
వాగ్దానాలు
అమలవుతున్నాయ్!
బహుశా
త్వరలో ఎలక్షన్లు కాబోలు
నాన్న బ్రతుకునావ
చుక్కాని కోసం
అమ్మ చీర చెంగు
ఎగిరింది
వెలుగుతున్న దీపాలు
విస్తు బోతున్నాయి
కొత్త కోడలు
వచ్చింది మరి
పూజలో
తూటి పువ్వు
ప్రక్కన తులసి
ఇప్పుడు తులసితూటి
బాగా శ్రమపడ్డా
ఎంతో చదువుకున్నా
చూస్తే
నన్ను నెనై చదవలేదు
నాటి గూటీబిళ్ళ
తెల్లారే సరికల్లా
క్రికెట్‌నంటూ
వెక్కిరించింది
రచయిత : వడలి రాధాకృష్ణ
వెనుకకు | మొదటి పేజీ | ఆఖరి సారి మెరుగు పరిచిన తేది: 25-03-2009 | హక్కులు: తెలుగుదనం.కో.ఇన్ | రూపకర్త: గీతా.కో.ఇన్ | ప్రశ్నలు, సలహాలు, సూచనలకు: editor@telugudanam.co.in