telugudanam.co.in

      telugudanam.co.in

   

బుర్ర కథలు

మన జానపద కళాసంపదకు లోటులేదు. కావలసినన్ని జానపద కళారూపాలు మనకు ఉన్నాయి. బుర్రకథలు ఎప్పటినుంచీ ప్రచారంలో ఉన్నాయో సరిగా తెలియదు కాని రామాయణ కాలానికే - ఇవి ఉన్నట్టు తెలుస్తూంది. బుఱ్ఱ కథ ఇవి బొబ్బిలి వరస కథలనుండి, జంగం కథలనుండి రాజకీయ ప్రబోధం ప్రధానోద్దేశంగా సుమారు 1942 ప్రాంతాల్లో అవతరించాయని కొందరి అభిప్రాయం. గుంటురు జిల్లా వీటి జన్మస్థలము. తంత్రి మరియు బుర్ర అనే శబ్దాలు కలిసి తంబుర శబ్దం ఏర్పడింది. ఈ తంబురతో చెప్పే కథలు కనుక ఇవి తంబుర కథలై రానురాను ఆ రూపం మారి బుర్రకథలు అనే రూపం ఏర్పడింది. గుమ్మెటలను బుర్రలు అని గుంటూరు జిల్లాలో వ్యవహరిస్తారు కనుక బుర్రలు కొడుతూ చెప్పే కథలు బుర్రకథలు అని రూపం ఏర్పడి ఉండొచ్చని విమర్శకుల అభిప్రాయం.


బుర్ర కథలు


ఈ బుర్రకథలో సాధారణంగా జంగం రగడ, ముగ్గురు మరాటీల కథలోని సై సై వరుస, కాంభోజరాజుకథలోని తందాన తాన వరసలు ప్రయోగింపబడుతుంటాయి. వీటిలో ప్రబోధాత్మకములే ఎక్కువగా ఉన్నాయి. ఈ వర్గములో రాజకీయ, సాంఘిక, జాతీయ ప్రబోధములకు సంబంధించినవి. ప్రభుత్వ ప్రచారమునకు ఉద్దేశించినవి ఉన్నాయి. 1946-48లో భారత జాతీయ నాయకులపై బుఱ్ఱ కథలు కథలు లెక్కలేనన్ని వెలువడినాయి. అల్లూరి సీతా రామరాజు, బొబ్బిలి యుద్ధం, బాలనామ్మ కథ మొదలైన బుర్రకథలు జన సామాన్యంలోకి చొచ్చుకుపోయయి.

మొత్తం మీద బుర్రకథలు చాలా ప్రచారంలో ఉన్న ప్రాచీన కళ. వీటిని జంగం కథలు అంటారు. మత ప్రబోధానికి, రాజకీయ ప్రబోధానికి, దేశభక్తికీ నిలయంగా ఇవి ఉండేవి. జంగం కథలను ఎక్కువగా జంగాలే చెప్పడం వల్ల వీటికి ఆ పేరు వచ్చింది. ఈ కథలను ఎక్కువగా ప్రచారంలోకి తెచ్చినవారు సిరికి జంగాలు, బుడిగె జంగాలూ, సెట్టిబలిజెలు, సెట్టిఫణిజెలు, ఈతముక్కలవారూ వంశ పారంపర్యంగా ప్రచారంలోకి తీసుకువచ్చారు. శైవ వైష్ణవ కలహాల కాలంలో ఈ కథకు చాలా ప్రాచుర్యం లభించింది. క్రీ.శ.1150 నాటికే ఈ కథలు బాగా ప్రచారంలో ఉన్నట్లు తెలియవస్తూంది. జంగం కథను సంగీత జానపద కళారూపంగా చెప్పుకోవచ్చు. ఈ కథలకు బహునామాలు, కథకులకు బహురూపాలు. ఒకనాడు శైవ, వైష్ణవ మతాల ప్రచారాలకు, భక్తి ప్రభోధానికి ఉపకరించిన ఈ బుర్రకథలు ప్రస్తుతం రాజకీయ ప్రచారాలకు ఉపయోగిస్తున్నాయి.

Telugudanam.co.in
వెనుకకు | మొదటి పేజీ | తెలుగుదనం బ్లాగు | మాగురించి | సలహాలు | పత్రికలలో తెలుగుదనం                                సందర్శకుల సంఖ్య: