telugudanam.co.in

      telugudanam.co.in

   

మహానంది

గిద్దలూరు నుండి గాజులపల్లి స్టేషనులోదిగి వెళ్ళవచ్చు. గాజులపల్లికి సుమారు 6 కి.మీటర్లుంటుంది, మహానంది. ఇది కూడా పేరెన్నికగన్న శైవక్షేత్రాల్లో ఒకటి. నంధ్యాల నుండి 16 కిలోమీటర్లుంటుంది. ఇది ఒక మంచి పిక్నిక్ స్పాట్.

ఇక్కడ మహానందీశ్వరాలయం - ఆలయానికెదురుగా కోనేరు. కోనేరులోకి నీరు ఒకనంది నోటిగుండా నిరంతరం ప్రవహిస్తూనే వుంటుంది. చాలా తేలికై నీరు స్వచ్ఛంగా వుంటుంది. కోనేరు సుమారు 6 అడుగుల లోతుంటుంది. నీటి అడుగున ఎంత చిన్న వస్తువైనాసరే స్పష్టంగా పైకి కనబడుతుంది. కోనేటి నీటిమట్టం ఒకే విధంగా వుండటానికి కొన్ని తూములు కట్టబడినాయి. నీరంతా కాలువలద్వారా కొన్ని వందల ఎకరాలకు సాగునీటిని సరఫరా చేస్తూ విస్తారంగా అరటి తోటలు పెంచటానికి ఉపయోగపడుతుంది. ఇక్కడి అరటిపండ్లు చాల ప్రసిద్ధం. తిరిగి నంద్యాల వచ్చి అక్కడినుండి శ్రీశైలమునకు రావచ్చును.


పెదకాకాని

కాకానిలో సాంబశివాలయము మహా మహిమాన్వితమై యున్నది. ఈ స్వామి వారి ప్రతిభ అనేక రకాలు. ప్రతి ఆదివారం భక్తులు తండోపతండాలుగా వచ్చి మొక్కుబడులు చెల్లించుకొంటూ ఉంటారు. ఇక్కడ సత్రాలున్నాయి. అన్ని వస్తువులూ దొరకుతాయి ప్రభలు, బండ్లు గట్టుకొనివచ్చి మొక్కుబడులు చెల్లించుకుంటూ ఉంటారు. వివాహ ఉపనయనాదులు నిర్వహించుకుంటూ స్వామి దయకు పాత్రులవుతారు. వ్యాధిగ్రస్తులు, సంతానహీనులు అక్కడనే వుండి ఆలయంచుట్టూ ప్రదక్షిణలు చేసి వారికోర్కెలను సాఫల్యం చేసికొంటూ ఉంటారు. ఇక్కడకు దగ్గరలోనే నంబూరు స్టేషన్ కెదురుగా రేడియో బ్రాడ్ కాస్టింగ్ స్టేషను, హేమలతా టెక్స్‌టైల్సు మిల్లు ఉన్నాయి.


లేపాక్షి

విజయనగర రాజుల కాలంలో నిర్మించబడిన ఈ దేవాలయం వీరభద్రాలయం. గోడలమీద, పైకప్పుమీద అనేక కుడ్య చిత్రాలు మనోహరంగా వ్రాయబడి ఉన్నాయి. ఇక్కడ ముఖ్య విశేషం లేపాక్షి బసవయ్య నంది విగ్రహం. ఒకే రాతిలో చెక్కబడిన ఈ విగ్రహం దేశం మొత్తం మీద పెద్దదిగా గుర్తించబడింది.

వసతికి - టూరిస్టు రెస్ట్‌హౌస్ ఒకటి వుంది.

హిందూపురం నుండి ప్రతిగంటకు బస్సులు వున్నాయి.

Telugudanam.co.in
వెనుకకు | మొదటి పేజీ | తెలుగుదనం బ్లాగు | మాగురించి | సలహాలు | పత్రికలలో తెలుగుదనం                                సందర్శకుల సంఖ్య: