telugudanam.co.in

      telugudanam.co.in

   

శ్రీరంగపట్నం

మైసూరుకు 12 కి.మీ దూరంలో ఉన్న ప్రదేశం టిప్పుసుల్తాను ప్రాసాదంలో అత్యంత చారిత్రక ప్రాధాన్యత సంతరించుకున్నది. కావేరినది రెండు పాయల మధ్యన ఉన్న దివిలాంటి దానిలో అమరియున్నది. మహిమాన్విత కావేరి పట్టణం చుట్టూ ప్రవహిస్తున్నది. టిప్పుసుల్తాన్ వారి కోట వేసవి మకాము యిక్కడ వున్నదంటారు. గౌతమ మహర్షి ఇక్కడ తపస్సు చేసినట్లుగా పురాణ ప్రశస్తి వుంది. క్రీ.శ 894 సంవత్సరంలో శ్రీ తిరుమలనాయుడు రంగనాధుని ఆలయం నిర్మించి రంగపురంగా వెలయింపచేశాడు. శ్రీరంగపట్నం 1120లో విష్ణువర్ణనుని సోదరులు ఉదయాదిత్యుడు కట్టించాడని ప్రతీతి. 1495 శ్రీరంగపట్నం విజయనగర రాజుల ఆధీనంలోకి వచ్చి, 1610లో మైసూరు రాజు ఒడయారు చేసుకున్నారు. తరువాత మహమ్మదీయులైన హైదర్ ఆలీ, టిప్పు సుల్తానుల కాలంలో వారి ఆధీనంలో ఉండి తరువాత 1799 లో బ్రిటీషు వారి హస్తగతమయింది. ఇక్కడ మూఖ్యంగా చూడదగినవి- 'టిప్పుసుల్తాన్ వారి వేసవి విశ్రాంతి భవనం, చిత్రకళ అందంగా పొందుపరచబడి వుంది. హైదర్ ఆలీ, ఆయన్ భార్య సమాధులున్నాయి. దానిపై రెండు ఎత్తయిన గోపురాలుగా నిర్మించబడినాయి. ఈ భవనం అమరియున్న తోట దరియాదౌలత్ బాగ్‌గా పిలవబడుతుంది.


శ్రీరంగనాధుని దేవాలయం

ద్రావిడ శిల్పరీతుల్లో నిర్మించబడిన ఈ ఆలయం మహమ్మదీయుల కాలంలో గూడ పోషించబడి అనేక జాగీర్లు యిచ్చినట్లు ప్రతీతి. విశిష్టాద్వైత మతాచార్యులు శ్రీరామానుజుల వారు ఇక్కడ కొంతకాలం ఉన్నారట. స్వామి వారి పాదాల చెంత గౌతమ మహర్షి చిత్రమును చూడగలము. శ్రీరంగనాధుడూ ఆది శేషుని మీద పవళించియున్నట్లుగా ఉంటాడు. ఆలయ సమీపంలోనే కోట. కోటలో మసీదు. మసీదులో పర్ష్యాభాషలో శాసనాలు టిప్పుసుల్తాను బ్రిటిషు ఆఫీసులను బంధించి ఉంచిన చీకటికొట్లు దర్శనీయం. స్టేషనుకు వెనుకకు గల కోట గోడలకు ఫిరంగి దెబ్బలు చూడవచ్చును. శ్రీరంగ పట్టణమునకు దిగువనే వున్నవి.


సోమనాధపూర్

35 కి.మీ దూరం ఆంగ్ల చారిత్రకులు ఫెర్గూసన్ గారి అభిప్రాయం ప్రకారం ఏలూరు, హళీబేడులను మించిన శిల్పసోయగాలు నిక్షిప్తం చేసుకున్నదిగా అభివర్ణించబడింది. హోయనం రాజుల ప్రధాన సైన్యాధికారి సోముడూ అనే వారిచే శిల్పశాస్త్ర ప్రవీణుడుగా గణతికెక్కిన జక్కనాచార్యునిచే నిర్మింపచేశారు. 1268 లో కట్టబడింది. ఆలయంలో పిరమిడు ఆకారంతో మూఉడు డోములతో నిర్మించబడింది. త్రిమూర్తుల ఆలయంగా ప్రకాసిస్తుంది. మధ్యలో చెన్నకేశవస్వామి, ఒకవైపు వేణుగోపాల స్వామి, రెండవ వైపు జనార్థనుడు ఉన్నాడు. దేవాలయ కుడ్యముల మీద మలచిన శిల్పాలు అతి సున్నితంగా గుడ్డమీద లేసులలు అల్లినట్లు లతలు, భారత, భాగవత, రామాయణ కథలు చిత్రవిచిత్రంగా మలచబడ్డాయి. బయట గోడల మీద మహత్తరమైన శిల్ప నైపుణ్యమును వెలార్చే పెద్దపెద్ద విగ్రహాలు దాదాపు 190 పైగా ఉన్నాయి.

Telugudanam.co.in
వెనుకకు | మొదటి పేజీ | తెలుగుదనం బ్లాగు | మాగురించి | సలహాలు | పత్రికలలో తెలుగుదనం                                సందర్శకుల సంఖ్య: