www.telugudanam.co.in         చీరాల

తెలుగు పాఠాలు

చిన్నపిల్లల కోసం

మాగురించి

పత్రికలలో తెలుగుదనం

               మా అనుబంధ వెబ్‌సైట్..

సంస్కృతి, సంప్రదాయాలు

వనితల కోసం

సైట్‌మ్యాప్

తెలుగుదనం బ్లాగు

సాహిత్యం

అందరికోసం

సలహాలు

మా గీతా.కో.ఇన్

సీతాదేవి పెండ్లి పాట

సీతాకళ్యాణ మహోత్సవ సమయము చూతము రారెచెలీ

రాతి నాతిగ చేసి ఘోరాసుర వర్గమునెల్ల దునిమి

భూమిజచేకొని జనకసుత ప్రఖ్యాతిగ వరించినాడట                                  ...సీతా...

 

బంగారు మంటపాంతరమున  నవరత్న శృంగార పీఠమందు

రంగుగ చేమంతి విరుల రంగుదండలు కాంతివైనుప్పొంగి

తొంగిచూచుటకు రఘుపుంగవుండు వేంచేసి వేడిన                                  ...సీతా...

 

తీరాయినయన్నము చారుపప్పు నెయ్యిపూర్ణభక్ష్యములుండెను

కోరికలలరగ భూమిసురులకు తారతమ్యము అడుగ భూసురులకు

నరులకును చేసెదానముదీనులకును దేవుడేయితడట                              ...సీతా...

 

భేరీ మృదంగకాహశములు మ్రోయగవాకకామినులాడంగగోరి         

దశరధ రాముడితడట వారిజాక్షిని పెండ్లియాడెను తీరుగా

ముత్యాల హారతి చేరీపట్టగసమయమిపుడు                                                ...సీతా...

 

వరహర్మ్యమయ గోపురములందు వరదుడై కనకదుర్గాలయమందు

వరదుడై భద్రాద్రి శ్రీరాముడు ధరణిజను పెండ్లాడుటకును                    

గరిమతో నరసింహదాసుని పరగృహంబునకేగునట యిటు .                         ...సీతా...

 

 సీతాకళ్యాణోత్సవమును కన్నులజూడగా కౌతుకమగుచున్నది

చల్లగా శ్రీపాదములు అహల్య శాపము మాపిన

వరకౌసల్యా రాముడంత దాసుల నెల్లబ్రోచునటంచు వింటిని                           ...సీతా...

 


వెనుకకు | మొదటి పేజీ | ఆఖరి సారి మెరుగు పరిచిన తేది: 25-03-2009 | హక్కులు: తెలుగుదనం.కో.ఇన్  | రూపకర్త: గీతా.కో.ఇన్ | ప్రశ్నలు, సలహాలు, సూచనలకు: editor@telugudanam.co.in