|
www.telugudanam.co.in చీరాల |
పత్రికలలో తెలుగుదనం |
మా అనుబంధ వెబ్‌సైట్.. |
|||
| తెలుగుదనం బ్లాగు | |||||
| మా గీతా.కో.ఇన్ |
చెరకుతో అందం
చెరకు గడనుండి తయారయ్యే గ్లైకోలిక్ యాసిడ్ తో ఫేషియల్ చేసుకోవడం వల్ల మొహం మీద మచ్చలు, మొటిమలు మాయమై కాంతివంతంగా తయారుకావచ్చు. అయితే యాసిడ్ అనగానే భయపడక్కరలేదని ఇది చాలా సహజమైనదని, హానికరమైనది కాదని వైద్యనిపుణులు అంటున్నారు.
ఇది ఎలా పని చేస్తుందంటే అలిసిపోయిన చర్మానికి తిరిగి శక్తిని అందిస్తుంది. చర్మంలో సమతూకం ఉండేలా చూస్తుంది. మొహం మీద గీతలు, ముడతలు పడకుండా చేస్తుంది. మృతకణజాలాన్ని నశింపచేసి కొత్త కణజాలం తొందరగా రావడానికి సహాయపడుతుంది. పిగ్మెంటేషన్ వల్లఏర్పడిన మచ్చలను తొలగించడంలోనూ సమర్థవంతంగా పనిచేస్తుంది. వీటన్నిటికీ ప్రత్యేకమైన బ్రెషింగ్‌లు చేసుకోవాల్సి ఉంటుంది. ఇవన్నీ బ్యూటీపార్లర్‌తో తీసుకోవాల్సిన చికిత్సలు. వీటితో పాటు రాత్రి పూట పడుకోబోయే ముందు నైట్‌క్రీములు, క్లెన్సింగ్ మిల్క్‌ను ఉపయోగించాల్సి ఉంటుంది. .అయితే మొదట ఈ ట్రీట్‌మెంట్‌ను గ్లేకోపీల్‌తో ప్రారంభిస్తారు. ఈ పీల్ చల్లదానాన్నిచ్చే, పారదర్శకమైన జెల్‌లాంటి పదార్థం. దీనిని ప్రత్యేకమైన బ్రెషుతో మొహానికి రాసి కొద్దిసేపటి తర్వాత కడిగేస్తారు. మంచి ఫలితాలు ఆశించేవారు వీటన్నిటికంటే ముందు అది మీ చర్మ స్వభావానికి సరిపోతుందా లేదా అనేది మీ డర్మటాలజిస్టును కనుక్కోవాలనీ ఆ తర్వాతే ఈ చికిత్స తీసుకోవాలనీ కూడా వారు హెచ్చరిస్తున్నారు.
వెనుకకు | మొదటి పేజీ | ఆఖరి సారి మెరుగు పరిచిన తేది: 25-03-2009 | హక్కులు: తెలుగుదనం.కో.ఇన్ | రూపకర్త: గీతా.కో.ఇన్ | ప్రశ్నలు, సలహాలు, సూచనలకు: editor@telugudanam.co.in