|
www.telugudanam.co.in చీరాల |
పత్రికలలో తెలుగుదనం | మా అనుబంధ వెబ్సైట్.. |
|||
| తెలుగుదనం బ్లాగు | |||||
| మా గీతా.కో.ఇన్ |
సౌందర్య పోషణ
వర్షాకాలంలో కాళ్ళు, చేతులు దురదగా అనిపిస్తే ఒక పాత్రలో నీళ్ళు తీసుకొని అందులో కొన్ని చుక్కలు డెట్టాల్ వేసి ఆ నీళ్ళతో కాళ్ళూ చేతులు కడుక్కోండి.
ఎప్పుడూ తుళ్లుతూ హుషారుగా ఉండాలన్నా కుర్రకారులా మెరిసిపోవాలన్నా ముడతలను నివారించాలన్నా మెడ వ్యాయామం తప్పనిసరి. దీనివల్ల ఒత్తిడులు ఉద్వేగాలు కూడా దూరమై చర్మం మరింత అందంగా తయారవుతుంది. వ్యాయామానికి, ఆరోగ్యకరమైన చర్మానికి సంబంధం ఉందన్నది అందరూ ఒప్పుకునే సత్యమే కదా?
వ్యాయామంతో రక్తప్రసరణ వృద్ధి అవుతుంది. తద్వారా బలమూ, శక్తి కూడా లభిస్తాయి. రక్తప్రసరణ పెరిగి దేహానికి బాగా ఆమ్లజని లభించడంవల్ల వయసుతోపాటు వచ్చే ఇబ్బందులు తగ్గుతాయి. ముఖం కడిగేటప్పుడే వేళ్లతో రుద్దండి. మెడకు వ్యాయామమేకాక అక్కడే ఎక్కువగా చేరే మురికి వదిలిపోతుంది.
కూర్చునేటప్పుడు, నిలబడేటప్పుడు భుజాలు, మెడ నిటారుగా ఉంచడం అలవాటు చేసుకోండి. రోజుకు కనీసం రెండు సార్లు మూడు నాలుగు నిముషాలు మెడ పైకి ఎత్తడం వంచడం ఆ పక్కకు, ఈ పక్కకు తిప్పడం చేస్తూండండి. మెడకండరాలు చక్కగా పనిచేస్తాయి.
కొద్దిగా గ్లిజరిన్ తీసుకుని అందులో కొన్ని నిమ్మరసం చుక్కలు కలపండి. ఆ మిశ్రమాన్ని రోజూ రాత్రివేళ పడుకునేటప్పుడు మెడకు రాయండి. ఉదయాన్నేలేచి శుభ్రం చేసుకోండి. కొద్ది రోజుల్లోనే మెడ మెరిసిపోతుంది. ఆకర్షణీయంగా తయారవుతుంది.
కొద్దిగా గ్లిజరిన్ తీసుకుని అందులో కొన్ని నిమ్మరసం చుక్కలు కలపండి. ఆ మిశ్రమాన్ని రోజూ రాత్రివేళ పడుకునేటప్పుడు మెడకు రాయండి. ఉదయాన్నేలేచి శుభ్రం చేసుకోండి. కొద్ది రోజుల్లోనే మెడ మెరిసిపోతుంది. ఆకర్షణీయంగా తయారవుతుంది.
అల్ఫా హైడ్రొక్సియాసిడ్స్ లేదా రెటివాల్స్ గల నైట్‌క్రీమ్‌ను ముఖానికి మెడకు రోజూ రాసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.
పుదీనా ఆకుపొడిని, స్నానం చేయబోయే ముందుగా కొంతనీటిలో కలుపుకోండి. ఆ నీటితో స్నానం చేస్తే శరీరం తాజాగా హాయిగా ఉంటుంది.
చర్మం చిట్లి బిరబిరలాడుతుంటే పెరుగు రాసి పావుగంట ఆగి స్నానం చేయండి.
చర్మం మీద ముడతలు పోవాలంటే కొన్ని రోజులు, రోజూ చేమంతి పువ్వుని శరీరం మీద సున్నితంగా రుద్దాలి.
ఆలివ్ ఆయిల్లో కాస్త కర్పూరం కలిపి రోజూ పడుకునే ముందు ముఖానికి రాసుకుంటే మొటిమల తగ్గిపోతాయి.
ఏడాది పొడవునా ఒకే విధమైన పర్ఫ్యూమ్ వాడకూడదు. ఋతువులను బట్టి పర్ఫ్యూమ్ తీక్షణత గుణధర్మాలు మారుతుంటాయి.
కొద్ది నీళ్లలో పుదీనాకు వేసి ఉడికించి ఆ నీటిని స్నానం చేసే నీటిలో కలిపి స్నానం చేయాలి. చంకల్లో, లోపలి భాగాల్లో పూసుకునేందుకు కొద్దిగా పుదీనా ద్రవాన్ని పక్కకు పెట్టుకోండి.
నీటిలో పటిక వేసి స్నానం చేస్తే శరీరం తాజాదనంతో ఉంటుంది.
శరీర దుర్వాసనతో బాధపడేవాళ్లు మొక్కజొన్నలు, గోధుమలు, పల్లీలు, ఇతర పప్పులు, మొలకలు, ధాన్యాలు, గుడ్డు వంటి వాటిని పరిమితంగా తీసుకోవాలి.
స్నానం అయిన తర్వాత కొంచెం నీళ్లలో తేనె వేసి ఆ నీటిని ఒంటి మీద పోసుకోవాలి. ఇలా చేస్తే శరీరం దుర్వాసన ఉండదు.
స్నానం చేసిన వెంటనే సుగంధాలను వాడితే మంచిది. ఈ సమయంలో చర్మం పైన రంధ్రాలు తెరుచుకొని ఎక్కువ సుగంధ పదార్ధాన్ని గ్రహిస్తాయి.
స్నానంచేసే నీటిలో ఒక కప్పు వెనిగర్ లేదా కర్పూరాన్ని కలిపి పోసుకోవాలి. వేసవి కాలంలో ఇలా స్నానం చేస్తే ఎంతో హాయిగా ఉంటుంది.
ముఖం మీద నల్లమచ్చలు పోవాలంటే ముఖానికి ఆవిరి పట్టాలి. నిమ్మకాయ రసం, కోడిగుడ్డులో తెల్లసొన, పసుపు సమపాళ్ళలో కలిపి ముఖానికి పట్టించి పది నిముషాల తర్వాత కడగాలి. ఈ విధంగా వారానికి ఒకసారి చేయాలి.
జాపత్రిని పాలతో బాగా అరగదీసి రాత్రి పడుకోబోయే ముందుగా ముఖం మీద నల్లమచ్చలున్నచోట రాయండి. ఉదయాన్నే లేచి గోరువెచ్చని నీటితో ముఖం కడగండి. 10 రోజులు ఇలా చేయండి.
కొత్తిమీర రసంలో చిటికెడు ఉప్పు కలిపి ముఖానికి రాసి అరగంట తర్వాత చన్నీటితో కడిగితే మొటిమలు పోతాయి.
దుర్వాసన రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు
నిత్యం యాంటి బ్యాక్టీరియల్ సబ్బుతో చంకలు తదితర శరీర ముఖ్య భాగాలను తప్పనిసరిగా శుభ్రం చేసుకోవాలి.
చంకలను శుభ్రం చేసుకోవడంపై ఎక్కువగా దృష్టి సారించాలి. ఎందుకంటే శరీరంలోని 80 శాతం స్వేదగ్రంధులు ఈ ప్రాంతంలోనే కేంద్రీకృతమై ఉంటాయి.
శుభ్రమైన లోదుస్తులు ధరించాలి. కాటన్‌వి అయితే మంచిది. అవి చర్మంలోకి గాలివెళ్లేట్టు చేస్తాయి.
సింధటిక్ బట్టలు వేసుకోవచ్చు.
పళ్లు, కూరగాయలు తీసుకుంటే శరీరం దుర్వాసన రాదు.
నీళ్లు బాగా తాగాలి. నీళ్లు తాగితే స్వేదగ్రంధులు బాగా పనిచేస్తాయి. దీంతో చెమట వాసన బాగా తగ్గిపోతుంది.
స్నానం చేసిన తరువాత టాల్కం పౌడర్ వేసుకుంటే శరీరం పొడిగా ఉంటుంది. బ్యాక్టీరియా ఎక్కువ చేరదు.
కాఫీ, టీ, కూల్‌డ్రింక్స్, చాక్లెట్లు తినడం బాగా తగ్గించాలి.
వెనుకకు | మొదటి పేజీ | ఆఖరి సారి మెరుగు పరిచిన తేది: 25-03-2009 | హక్కులు: తెలుగుదనం.కో.ఇన్ | రూపకర్త: గీతా.కో.ఇన్ | ప్రశ్నలు, సలహాలు, సూచనలకు: editor@telugudanam.co.in