|
www.telugudanam.co.in చీరాల |
పత్రికలలో తెలుగుదనం |
మా అనుబంధ వెబ్సైట్.. |
|||
| తెలుగుదనం బ్లాగు | |||||
| మా గీతా.కో.ఇన్ |
వ్యాక్సింగా... ఒక్కక్షణం...
అవాంఛిత రోమాలు తొలగించుకోవడానికి వ్యాక్సింగ్ అనువైన పద్ధతి. అయితే వ్యాక్సింగ్ వల్ల ఒక్కోసారి దురద, దద్దర్లు వస్తాయి. ఎలర్జీ లేవీ రాకుండా ఉండాలంటే వ్యాక్సింగ్ చేయించుకునేముందు ఈ జాగ్రత్తలు పాటించాలి.
వ్యాక్సింగ్ చేయించుకున్న వెంటనే చర్మాన్ని చల్లని నీటితో కడగాలి. ఐస్క్యూబ్తో చర్మం అంతా రుద్దాలి. అప్పుడిక పొక్కులు, దద్దుర్ల బెడద ఉండదు.
వ్యాక్సింగ్ చేయించుకున్న తర్వాత రెండు రోజులపాటు వదులుగా ఉండే నూలు దుస్తులు మాత్రమే ధరించాలి.
మరీ ఇబ్బందికరమైన చర్మ సమస్యలు వస్తే... వెంటనే వైద్యులను సంప్రదించాలి.
వ్యాక్సింగ్తో ఒకసారి ఎలర్జీ వస్తే ఆ బ్యూటిపార్లర్ను మార్చి చూడండి. ఎటువంటి మార్పు లేకపోతే క్రిములు, ఇతర లోషన్లు చక్కని ప్రత్యమ్నాయాలు
సున్నిత చర్మతత్వం ఉన్నవారు కోల్డ్వ్యాక్స్ చేయించుకోవాలి.
హాట్ వ్యాక్స్ బంగారు వర్ణంలో ఉంటుంది. మరీ ముదురుగా ఉంటే బాగా వేడెక్కిందని అర్ధం.
వ్యాక్సింగ్ చికిత్స చేయించుకుంటున్న గది కాస్త చల్లగా ఉండేలా చూసుకోవాలి.
కొంత మంది మహిళలకు గడ్డం మీద, పైపెదవిపైన, నుదిటిపైన, బుగ్గలపైన, కనుబొమ్మలు ద్వారా శాశ్వతంగాను, తాత్కాలికంగాను తొలగించవచ్చు.
చేతులు, కాళ్ళపై వుండే రోమాలను వాక్స్, రోమహారి క్రీములు, రేజర్స్ ఉపయోగించి నిర్మూలించాలి.
పొత్తికడుపు, గుండెలపైన, మెడకింద భాగాల్లో వచ్చే రోమాలను వాక్స్ లేదా బ్లీచ్ చేయడం ద్వారా తొలగించాలి.
ముఖాల మీద ఉండే అవాంఛిత రోమాల్ని తొలగించడానికి అమోనియా, హైడ్రోజన్ పెరాక్సైడ్ని కలిపి బ్లీచింగ్కి ఉపయోగించాలి. దీనికి ముందు అలర్జీ వచ్చే ప్రమాదముందేమో గమనించాలి. ఇందుకోసం ఎక్కడో ఒకచోట కొద్దిగా పరీక్షించి చూసుకోవాలి. ఈ విధంగా బ్లీచింగ్ చేసుకోవడానికి కనీసం పదిహేనురోజులయినా ఎడం ఉండాలి.
కనుబొమలు, పై పెదవిపై ఉండే రోమాల్ని ప్లక్కింగ్ ద్వారా తొలకించాక యాంటీ సెప్టిక్ లోషన్ రాయడం మంచిది.
మార్కెట్లో దొరికే హెయిర్ రిమూవర్స్ వాడేటప్పుడు వాటి మీద ఉండే సూచనల్ని చదువుకోవాలి. అలర్జీ వస్తుందేమో పరిశీలించాకే వాడాలి. హెయిర్ రిమూవర్స్ని ముఖానికి వాడకూడదు.
మూలం: ఆదివారం, వార్త నవంబర్ 27, 2005
వెనుకకు | మొదటి పేజీ | ఆఖరి సారి మెరుగు పరిచిన తేది: 25-03-2009 | హక్కులు: తెలుగుదనం.కో.ఇన్ | రూపకర్త: గీతా.కో.ఇన్ | ప్రశ్నలు, సలహాలు, సూచనలకు: editor@telugudanam.co.in