www.telugudanam.co.in         చీరాల

తెలుగు పాఠాలు

చిన్నపిల్లల కోసం

మాగురించి

పత్రికలలో తెలుగుదనం

               మా అనుబంధ వెబ్‌సైట్..

సంస్కృతి, సంప్రదాయాలు

వనితల కోసం

సైట్‌మ్యాప్

తెలుగుదనం బ్లాగు

సాహిత్యం

అందరికోసం

సలహాలు

మా గీతా.కో.ఇన్

చలిని తరిమేసే చిరుతిళ్లు

సాధారణంగా చిరుతిళ్ళు తింటే ఊబకాయం వస్తుందనీ, అవి అనారోగ్యానికి దారి తీస్తాయని అందరూ చెబుతుంటారు. చిరుతిళ్ళు అంటే వాళ్ళ దృష్టిలో వేళా పాళా లేకుండా ఏదిపడితే అది తినెయ్యడం. భోజనం చేసిన వెంటనే ఏదో ఒకటి నోట్లో వేసుకోవడం మనలో చాలామందికి అలవాటే. ఇటువంటి చిరుతిళ్ళు ఆరోగ్యాన్ని హరిస్తాయనడంలో ఎటువంటి సందేహమూ లేదు. అయితే ఆరోగ్యాన్నిచ్చే చిరుతిళ్ళు కూడా కొన్ని ఉన్నాయంటే ఆశ్చర్యం కలగక మానదు. అవి ముఖ్యంగా చలి కాలంలో ఒంట్లో చలిని తరిమేందుకు ఉపయోగపడేవంటే మరింత ఆశ్చర్యం కలుగుతుంది. చలి కాలంలో స్వెట్టరులు తొడుక్కోవడం, దుప్పట్లు, రగ్గులలో ముసుగుతన్నడం కంటే కూడా ఇంట్లో కొన్ని రుచికరమైన పదార్ధాలనుతయారు చేసుకుని వాటిని భుజించడం దేఅరా చలిని తరిమికొట్టడం శ్రేయస్కరం. అది ఆరోగ్యానికి కూడా దోహదపడుతుందంటే అంతకంటే కావలసినదేముంది. మరి చలిని తరిమసే ఆ చిరుతిళ్ళ తయారీ గురించి తెలుసుకుందామా?

పెసరపప్పు గంజి

కావలసిన పదార్థాలు:

పెసరపప్పు

-

2 గ్లాసులు

పంచదార

-

ఆరు స్పూన్లు

చిక్కటిపాలు

-

4 గ్లాసులు

యాలుకల పొడి

-

కొద్దిగా

తయారుచేసే విధానం:

పెసరపప్పును కొంచెం నీటిలో బాగా ఉడికించాలి. పప్పు బాగా ఉడికిన తరువాత వేడి చేసిన పాలను పప్పులో పోసి ప్పప్పు, పాలు రెండు బాగా కలిసేలా కలియబెట్టాలి. దింపే ముందు యాలుకల పొడి వేయాలి. వేడి వేడిగా చిక్కటి గంజి తయారవుతుంది. ఇది నలుగురికి సరిపోతుంది.

గోధుమ రవ్వ గంజి

కావలసినవి పదార్థాలు:

సన్నటి గోధుమరవ్వ

-

 ఒక గ్లాసు

పంచదార

-

ఆరు స్పూన్లు

పాలు

-

మూడు గ్లాసులు

యాలుకల పొడి

-

కొద్దిగా

 

తయారుచేసేవిధానం:

ఒక వంతు గోధుమరవ్వకు మూడు వంతు నీళ్ళు తీసుకొని ముందుగా నీళ్ళను బాగా మరిగించాలి.మరుగుతున్న నీళ్ళలో రవ్వను ఉండలు కట్టకుండా వేసి మూత పెట్టాలి. అయిదు నిముషాల తరువాత మూత వేసి పంచదార, ఏలకుల పొడి కలిపిన పాలను అందులో పోయాలి. జారుడుగా ఉండే ఈ గంజి పిల్లలకు బాగా నచ్చుతుంది.

శనగ గుగ్గిళ్లు

కావలసినవి పదార్థాలు:

సెనగలు

-

అరకిలో

పోపుదినుసులు

-

 సరిపడా

కొత్తిమీర

-

రెండు కట్టలు

కరివేపాకు

-

 ఒక కట్ట

పచ్చి మిరపకాయలు

-

ఆరు, ఏడు

మంచి నూనె

-

 కొద్దిగా

నిమ్మరసం

-

మూడు చెంచాలు

ఉప్పు

-

 సరిపడా

 

తయారుచేసే విధానం:

అరకిలో సెనగలను శుభ్రం చేసి ఉదయమే నూళ్లలో నానబెట్టాలి.బాగా నానిన సెనగలను నీళ్లు లేకుండా చక్కగా వడకట్టాలి.మూకుడులో నూనె వేసి అందులో మినపప్పు, ఎండుమిరపకాయలు, ఆవాలు, జీలకర్ర, ఇంగువ, పచ్చిమిరపకాయలు, కరివేపకు వేసి పోపుచేయాలి.

తయారయిన పోపులో వడకట్టిన సెనగలను వేసి అయిదు నిమిషాలు వేయించాలి. దింపేముందు సరిపడా ఉప్పు వేసి దించిన తరువాత తురిమిన కొత్తిమీర, నిమ్మకాయ రసం వేసి తినండి.

చురిమురి

కావలసిన పదార్థాలు:

మరమరాలు

-

1/4 కిలో

క్యారట్ తురుము

-

100 గ్రా

కీర తురుము

-

100 గ్రా

ఉప్పు

-

తగినంత

కారప్పొడి

-

కొద్దిగా

కొత్తిమీర తురుము

-

కొద్దిగా

నిమ్మరసం

-

రెండుస్పూన్లు

తయారుచేసే విధానం:

మరమరాలను ఒక చిన్న గిన్నెలోకి తీసుకుని దానికి క్యారట్ తురుము, కీరా తురుము, ఉప్పు, కారప్పొడి, కొత్తిమీర తురుము వేసి చక్కగా కలిపి సన్నటి సెగ మీద రెండు, మూడు నిమిషాలు వేయించాలి. కొద్దిగా నిమ్మరసం కలుపుకుని తింటే రుచిగా ఉంటాయి. ఈ చిరుతిళ్లు మీ చల్లని సాయంత్రాలను వెచ్చగా మార్చేస్తాయి.


వెనుకకు | మొదటి పేజీ | ఆఖరి సారి మెరుగు పరిచిన తేది: 25-03-2009 | హక్కులు: తెలుగుదనం.కో.ఇన్  | రూపకర్త: గీతా.కో.ఇన్ | ప్రశ్నలు, సలహాలు, సూచనలకు: editor@telugudanam.co.in