www.telugudanam.co.in         చీరాల

తెలుగు పాఠాలు

చిన్నపిల్లల కోసం

మాగురించి

పత్రికలలో తెలుగుదనం

               మా అనుబంధ వెబ్‌సైట్..

సంస్కృతి, సంప్రదాయాలు

వనితల కోసం

సైట్‌మ్యాప్

తెలుగుదనం బ్లాగు

సాహిత్యం

అందరికోసం

సలహాలు

మా గీతా.కో.ఇన్

వంటలు(కొన్ని)

నిమ్మ ఉప్పుతో షర్బత్

కావలసిన వస్తువులు:

నిమ్మ ఉప్పు, పంచదార - 2 కప్పులు.

నీరు - 3/4 కప్పు.

మిఠాయి రంగు - 1 స్పూను.

ఎస్సెన్సు (ఏవైన) - 1 స్పూను.

తయారు చేసే విధానం:

ముందుగా 2 కప్పుల పంచదారకు ముప్పావు కప్పు నీరు పోసి తీగ పాకం పట్టాలి. టీ స్పూను నిమ్మ ఉప్పు వేరే గిన్నెలో నీళ్ళు కలిపి, లేతపాకంలో పోసి రెండు మూడు సార్లు కలియబెట్టి దించాలి. నిమ్మ ఉప్పు వేయగానే పాకం నిమ్మతొనల సువాసన వస్తుంది. ఆ పాకంలో మిఠాయి రంగు వేసి బాగా కలిపి మూత పెట్టాలి. తరువాత ఎస్సెన్సు 2, 3 చుక్కలు వేసి కలిపి గట్టిగా మూత పెట్టాలి. చల్లారిన తర్వాత పొడిగా ఉన్న సీసాల్లో భద్రపరచాలి. అతిథులకి ఇచ్చేటప్పుడు రెండు స్పూన్లు పాకాన్ని ఒక గ్లాసు నీళ్ళలో కలిపి సర్వ్ చేయాలి.

లైం షర్బత్

కావలసిన వస్తువులు:

నిమ్మరసం - 1 గ్లాసు.

పంచదార - 4 గ్లాసులు.

నీళ్ళు - 1/2 గ్లాసు.

ఉప్పు - 1 టీ స్పూన్.

తయరుచేసే విధానం:

ముందుగా మంచి రసం ఉన్న నిమ్మకాయాలు తీసుకొని, కడిగి, శుభ్రపరచి, రసం తీసి, గింజలు రాకుండా వడకట్టాలి. పంచదారలో అర గ్లాసు నీళ్ళు పోసి, తీగపాకం వచ్చేంతవరకు ఉడికనివ్వాలి. పాకం ఉడకుతున్నప్పుడే టీ స్పూనుతో ఉప్పుని నిమ్మరసంలో కలిపి, పాకంలో పోసి ఒక్కసారి కలిపి దించాలి. పాకం బాగా చల్లారిన తర్వాత గట్టి మూత ఉన్న పొడి గాజు సీసాలో పోసి మూత పెట్టాలి. సర్వ్ చేసేటప్పుడు ఒక గ్లాసు నీళ్ళకి 2 స్పూన్లు పాకం వేసి ఐసు ముక్క వేసి పైన యాలుకపొడి చల్లి సర్వ్ చేయాలి.

జింజర్ షర్బత్

కావలసిన వస్తువులు:

అల్లం - 3/4 కేజి.

నిమ్మ కాయలు - 20.

పంచదార - 1 కేజి.

ఉప్పు - 1 స్పూను.

తయారు చేసే విధానం:

ముందుగా అల్లం కడిగి మెత్తగా తొక్కాలి. మధ్యలో నీళ్ళు చల్లుకుంటూ ఉండాలి. ఈ విధంగా తొక్కుతూ సుమారు 1 కప్పు అల్లం రసం పిండుకోవాలి. తొక్కు ఉండకూడదు. నిమ్మకాయ ముత్యాలు, గింజలు రాకుండా రసం పిండుకోవాలి. నిమ్మకాయల రసంలో ఉప్పు వేసి కలపాలి. ఒక గిన్నెలో పంచదార, అల్లం రసం పోసి సన్నని సెగపై లేత పాకం వచ్చేటట్లు కలియబెట్టాలి. లేతపాకం వచ్చిన తర్వాత దించి అందులో నిమ్మకాయ రసం పోయాలి. బాగా చల్లారిన తర్వాత సీసాలో పోసి గట్టిగా మూతపెట్టాలి. ఒక గ్లాసు నీళ్ళలో 2 స్పూన్లు అల్లం రసం పోసి, ఐస్ ముక్కలు గానీ, ఐస్ వాటర్ గానీ పోసి సర్వ్ చేయాలి.

కో కో సిరప్

కావలసిన వస్తువులు:

కో కో - 1 కప్పు.

పంచదార - 2 కప్పులు.

చన్నీళ్ళు - 3 కప్పులు.

తయారు చేసే విధానం:

ముందుగా కోకో, పంచదార, చన్నీళ్ళు కలిపి 20 నిమిషాల పాటు ఉడికించి గట్టి పాకం పట్టాలి. సన్నని సెగ పై ఆపకుండా కలియబెడుతూ ఉండాలి. పాకం తయారు అవ్వగానే చల్లార్చి పొడి సీసాలో పోసుకోవాలి. ఒక కప్పు పాలుకి 2 స్పూన్లు సిరప్ కలిపి ఇవ్వాలి.

ఫ్రూట్ సలాడ్

కావలసిన వస్తువులు:

దానిమ్మ గింజలు - 1 కప్పు

ద్రాక్షపళ్ళు - 1 కప్పు

పైనాపిల్ ముక్కలు - 1 కప్పు

అరటిపండు ముక్కలు - 1 కప్పు

చెర్రీ పండ్లు - 1/2 కప్పు

మామిడిపండు ముక్కలు - 1 కప్పు

ఆపిల్ పండు ముక్కలు - 1 కప్పు

కమలాతొనలు - 1 కప్పు

మిరియాలపొడి - 1/2 స్పూన్

ఉప్పు - కొంచెం

తేనె - 1/4 కప్పు

నిమ్మ రసం - 2 స్పూన్లు

తయారు చేసే విధానం:

ముందుగా పైన చెప్పిన పండ్లన్నింటినీ శుభ్రంచేసి చిన్నచిన్న ముక్కలుగా తరిగి ఒక పెద్ద గిన్నెలో వేసుకోవాలి. వీటి మీద మిరియాల పొడి, ఉప్పు వేసి నిమ్మరసం పిండి పైన తేనె వేసి నాలుగు గంటలపాటు ప్రిజ్‌లో ఉంచితే చాలు ఫ్రూట్ సలాడ్ సిద్ధం. ఇలా అయితే అన్ని రకాల పండ్లు తినవచ్చు. దీనివలన శరీరానికి కావలసిన విటమిన్లు అందుతాయి.


వెనుకకు | మొదటి పేజీ | ఆఖరి సారి మెరుగు పరిచిన తేది: 25-03-2009 | హక్కులు: తెలుగుదనం.కో.ఇన్  | రూపకర్త: గీతా.కో.ఇన్ | ప్రశ్నలు, సలహాలు, సూచనలకు: editor@telugudanam.co.in