www.telugudanam.co.in         చీరాల

తెలుగు పాఠాలు

చిన్నపిల్లల కోసం

మాగురించి

పత్రికలలో తెలుగుదనం

               మా అనుబంధ వెబ్‌సైట్..

సంస్కృతి, సంప్రదాయాలు

వనితల కోసం

సైట్‌మ్యాప్

తెలుగుదనం బ్లాగు

సాహిత్యం

అందరికోసం

సలహాలు

మా గీతా.కో.ఇన్

వంటలు (కొన్ని)

అలూతో చక్రాలు

కావలసిన వస్తువులు:

బియ్యపు పిండి - 1 కిలో.

బంగాళదుంపలు - 1/2 కిలో.

వాము - 50 గ్రాములు.

కారం - తగినంత.

ఉప్పు - తగినంత.

డాల్డా లేక నెయ్యి- 100 గ్రాములు.

నువ్వులు - 50 గ్రాములు.

నూనె - 1 కిలో.

తయారు చేసే విధానం :

బంగాళదుంపలను బాగా ఉడికించుకోవాలి. తొక్కలు తీసివేసి మెత్తగా చేయాలి. నువ్వులు, వాము, రాళ్ళులేకుండా శుభ్రం చేసుకోవాలి. బియ్యపు పిండిలో మెత్తగా చేసిన బంగాళదుంపలు, నువ్వులు, వాము, ఉప్పు, కారం, నెయ్యి లేక డాల్డా వేసి కలుపుకోవాలి. స్టౌమీద బాండీ పెట్టి నూనెపోసి కాగనివ్వాలి. నూనె కాగిన తరువాత చక్రాల గిద్దలలో పిండిపెట్టి చక్రాలు వత్తుకోవాలి. వేగినతరువాత తీసివేయాలి. ఇవి పదిరోజులు నిల్వ ఉంటాయి. ఇవి కరకరలాడుతూ చాలా రుచిగా ఉంటాయి.

బూంది

కావలసిన వస్తువులు:

శనగపిండి - 1/2 కిలో.

వేరుశనగగింజలు - 1/4 కిలో.

కారం - తగినంత.

ఉప్పు - తగినంత.

కరివేపాకు - 2 కట్టలు.

నూనె - 1/2 కిలో.

తయారు చేసే విధానం:

శనగపిండిని జారుగా కలుపుకోవాలి. బాండీలో నూనెపోసి కాగిన తరువాత బూందీ గరిటతో బూంది దుయ్యాలి. మధ్య మధ్యలో కారం, ఉప్పు, కరివేపాకును కొంచెం కొంచెం కలుపుతూ ఉండాలి. బూంది దూయడం అయిన తరువాత ఆ వేడి నూనెలోనే వేరుశనగ పప్పులను వేయించి తీసి బూందిలో కలపాలి.

కొబ్బరి చెక్కలు

కావలసిన వస్తువులు:

కొబ్బరి చిప్పలు - 2.

బియ్యం - 1/2 కేజి.

నెయ్యి - 1/4 కేజి.

శనగపప్పు - 1/2 కప్పు.

జీలకర్ర - 1 టేబుల్ స్పూన్.

కరివేపాకు - 1 కట్ట.

కొత్తిమీర - 1 కట్ట.

పచ్చిమిర్చి - 10.

ఉప్పు  - తగినంత.

 పసుపు - చిటికెడు.

 నూనె - వేయించడానికి సరిపడా.

తయారు చేసే విధానం:

ముందుగా బియ్యాన్ని ఓ నాలుగు గంటలపాటు నీళ్ళల్లో నానబెట్టి తీసి జల్లెడ పళ్ళెం సాయంతో నీరు తీసేసి మిక్సీలో వేసి పిండి చేసుకోవాలి. కొబ్బరి తురిమి పిండిలో వేయాలి. అల్లం, పచ్చిమిర్చి మెత్తగా పేస్టుచేసి వేయాలి. సన్నగా తరిగిన కరివేపాకు, కొత్తిమీర, నానబెట్టిన శనగపప్పు వేసి కలుపుకోవాలి. పైన చెప్పిన మిగతా వన్నీ కూడా వేసి నీళ్ళు పోస్తూ గట్టిగా ముద్దగా కలుపుకోవాలి. స్టౌ మీద బాండీ పెట్టి నూనె పోసి బాగా కాగిన తరువాత ఇందాకటి పిండి ముద్దను చిన్నచిన్న ఉండలుగా తీసుకుని పాలిధిన్ కవర్‌పై ఒత్తి నూనెలో ఎర్రగా వేయించి తీయాలి. ఇవి కరకరలాడుతూ రుచిగా ఉంటాయి.

పల్లీ పకోడీలు

కావలసిన వస్తువులు:

వేరుశనగపప్పు(పల్లీలు) - 2 కప్పులు.

 శనగ పిండి - 2 కప్పులు.

బియ్యపు పిండి - 1/2 కప్పు.

 అల్లంవెల్లుల్లి పేస్టు - 1 స్పూను.

 పచ్చిమిర్చి - 1/4 కప్పు (తరిగినవి).

 వనస్పతి - 1/4 కప్పు.

 కారం - 1/2 స్పూను.

 ఉప్పు - తగినంత.

 పసుపు - చిటికెడు.

నూనె - సరిపడినంత.

తయారు చేసే విధానం:

ఓ గిన్నెలోకి శనగపిండి, బియ్యపు పిండిలను తీసుకోవాలి. వనస్పతి కరిగించి దీనిలో వేయాలి. తరువాత నూనె తప్ప మిగిలిన పదార్ధాలన్నీ వేయాలి. తగినంత నీటితో పకోడీ పిండిలా కలుపుకోవాలి. పకోడీల్లా చేసి నూనెలో వేయాలి. ఎర్రగా వేగిన తర్వాత తీసివేయాలి.

కట్‌లెట్

కావలసిన వస్తువులు:

 ఉడికించి చితిపిన ఆలుగడ్డ - 2 కప్పులు.

 పెసర మొలకలు - 1 కప్పు.

 పచ్చిమిరపకాయలు - 2 (సన్నగా తరగాలి).

 అల్లం - చిన్న ముక్క (సన్నగా తరగాలి).

గరం మసాలా - 1/2 చెంచా.

తరిగిన క్యారెట్ - 2 గరిటెలు.

బ్రెడ్డు - 2 స్లైసులు

నెయ్యి లేదా నూనె - వేయించడానికి సరిపడినంత.

ఉప్పు - తగినంత.

తయారు చేసే విధానం:

క్యారెట్ ఉడికించి సన్నగా ముక్కలు తరిగి కాస్త మెత్తగయ్యేలా చితపాలి. బ్రెడ్ నానబెట్టి నీళ్ళను పిండి, ఆలుగడ్డ, క్యారెట్, బ్రెడ్, పచ్చిమిరపకాయలు, అల్లం, ఉప్పు, గరం మసాలా కలపాలి. ఈ పిండిని నిమ్మకాయ సైజులో తీసుకుని దీన్ని ఒక గరిటెడు మొలకల గింజల్లో రెండు వైపులా అద్ది కాస్త నెయ్యి లేదా నూనె నాన్ స్టిక్ లో వేసి ఈ బిళ్ళలను వేయించాలి. రెండు వైపులా ఎర్రగా వేగిన తరువాత టమోటా సాస్ తో సాయంకాలపు టిఫిన్‌గా అందించవచ్చు.


వెనుకకు | మొదటి పేజీ | ఆఖరి సారి మెరుగు పరిచిన తేది: 25-03-2009 | హక్కులు: తెలుగుదనం.కో.ఇన్  | రూపకర్త: గీతా.కో.ఇన్ | ప్రశ్నలు, సలహాలు, సూచనలకు: editor@telugudanam.co.in