|
www.telugudanam.co.in చీరాల |
పత్రికలలో తెలుగుదనం | మా అనుబంధ వెబ్‌సైట్.. |
|||
| తెలుగుదనం బ్లాగు | |||||
| మా గీతా.కో.ఇన్ |
వంటలు (కొన్ని)
కావలసిన వస్తువులు:
పాలు - 1 లీటరు.
బియ్యపు పిండి - 60 గ్రాములు.
నెయ్యి - 2 స్పూన్లు.
పంచదార - 125 గ్రాములు.
పాల మీగడ - 1/2 కప్పు.
బాదం పప్పులు - 20.
పిస్తా -1 స్పూను.
కేసరి - 1 స్పూను.
వేడి పాలు - 1/2 స్పూను.
తయారు చేసే విధానం:
ముందుగా ఒక గంటసేపు బాదం పప్పులు నీటిలో నానబెట్టాలి. కేసరి గుళికలు తీసుకొని 1/2 స్పూను వేడి పాలల్లో నానబెట్టాలి. బాండీలో నెయ్యి వేసి కలిపి, బియ్యపు పిండి ఎర్రగా వేయించాలి. ఇందులో పాలు వేసి ఆపకుండా కలియబెడుతుండాలి. అందులో పంచదార పోసి గట్టి పాకం వచ్చేంతవరకు ఉంచి దించాలి. ఒక పళ్ళానికి నెయ్యి రాసి పాకాన్ని పోసి చాల్లార్చి పైన మీగడ బాదం పప్పు, పిస్తా పప్పు వేసి ఫ్రిజ్ లో పెట్టి సర్వ్ చేయాలి.
కావలసిన వస్తువులు:
పాలు - 3 లీటర్లు.
పాలకోవా - 150 గ్రా.
పచ్చి కొబ్బరి చిప్పలు - 2.
పంచదార - 6 స్పూన్లు.
బాదం పప్పు, జీడి పప్పు , పిస్తా పప్పు.
తయారు చేసే విధానం:
ముందుగా కొబ్బరి తురుము కోవాలి. పాలు తీసుకోవాలి. మందపాటి గిన్నెలో పాలు పోసి, కొబ్బరి పాలు పోసి చక్కగా ఉడికించాలి. తర్వాత పాలకోవా, పంచదార వేసి సన్నని సెగపై ఉడికించి పప్పులు అన్నీ సగం వేసి కలిపి దించి వేరే గిన్నెలో పోసి పైన మిగిలిన పప్పులు చల్లి ఫ్రిజ్ లో పెట్టి సర్వ్ చేయాలి.
కావలసిన వస్తువులు:
బొంబాయి రవ్వ - 1/2 కప్పు.
పాలు - ఒకటిన్నర కప్పు (1 1/2).
యాలుకలు - 4.
జీడిపప్పు, బాదం పప్పు, కిస్ మిస్.
తయారు చేసే విధానం:
ముందుగా పాలు ఒక గిన్నెలో పోసి బాగా మరగ బెట్టాలి. తీసుకున్న పాలు సగం వరకు వచ్చేటట్లు కాచాలి. బొంబాయి రవ్వ పొడిగా వున్న బాండీలో వేయించి ఉంచాలి. పాలు బాగా కాగగానే వేయించిన రవ్వ, పంచదార పోసి గరిటతో కలియబెడుతూ సన్నని సెగపై ఉంచాలి. 10 నిమిషాలు తర్వాత దించి పైన యాలుకల పొడి, జీడిపప్పు, బాదం పప్పు, కిస్ మిస్ వేసి సర్వ్ చేయాలి.
కావలసిన వస్తువులు:
బ్రెడ్ ముక్కలు - 8.
గ్రుడ్లు - 2.
పంచదార - 1/2 కప్పు.
కిస్ మిస్ - 1/2 కప్పు.
పాలు - ఒకటిన్నర కప్పు (1.5).
వెన్న - ఒకటిన్నర స్పూను.
తురిమిన కొబ్బరి - 1 స్పూను.
వెనీలా ఎస్సెన్సు - 1/2 స్పూను.
తయారు చేసే విధానం:
ముందుగా పాలల్లో పంచదార వేసి బాగా కలిపి మరిగిన తర్వాత చల్లార్చాలి. గ్రుడ్లు పగలకొట్టి పాలల్లో ఎస్సెన్సు తో పాటు కలిపి బాగా చిలకాలి. బ్రెడ్ ఒక్కసారి తేలిగ్గా కాల్చి పైన వెన్న రాయాలి. బ్రెడ్ పైన కిస్ మిస్ పెట్టి పాలల్లో వుంచాలి.( ఒక బ్రెడ్ పైన కిస్ మిస్ పెట్టి పైన యింకో బ్రెడ్ తో కప్పాలి. ఈ విధంగా అన్నీ అమర్చుకోవాలి). దీనిని ఓవెన్ లో 300-325 డిగ్రీల వేడితో 45 నిమిషాలు వండాలి. తడి చాకుతో పుడ్డింగ్ తయారు అయినదీ లేనిదీ పరీక్షించి పైన కోరిన కొబ్బరి చల్లి 2 నిమిషాలు ఓవెన్ లో ఉంచి తర్వాత తీసి సర్వ్ చేయాలి.
కావలసిన వస్తువులు:
వెన్న - 60 గ్రా.
పంచదార - 60 గ్రా.
గోధుమపిండి - 60 గ్రా.
అరటి పండ్లు - 2.
పాలు - 3/4 కప్పు.
గ్రుడ్లు - 2.
తయారు చేసే విధానం:
ముందుగా వెన్న, గోధుమపిండి, పాలు, బాగా చిలకాలి. సన్నని సెగపై బాగా చిక్కగా ఉడకనివ్వాలి. గ్రుడ్లు పగులగొట్టి పచ్చ సొనను ఉడికిన పిండిలో దించిన తరువాత కలపాలి. మరల బాగా చిలకాలి. అరటిపండ్ల ముక్కలు తరిగి కలపాలి. బేకింగ్ టిన్ లో పోసి 20 నిమిషాలు బేక్ చేయాలి. గ్రుడ్లలోని తెల్లసొన, పంచదార పొడి (1 స్పూను) బాగా చిలికి పుడ్డింగ్ పైన పోసి, గోధుమరంగు వచ్చేంత వరకు బేక్ చేసి తీయాలి.
వెనుకకు | మొదటి పేజీ | ఆఖరి సారి మెరుగు పరిచిన తేది: 25-03-2009 | హక్కులు: తెలుగుదనం.కో.ఇన్ | రూపకర్త: గీతా.కో.ఇన్ | ప్రశ్నలు, సలహాలు, సూచనలకు: editor@telugudanam.co.in