|
www.telugudanam.co.in చీరాల |
పత్రికలలో తెలుగుదనం | మా అనుబంధ వెబ్‌సైట్.. |
|||
| తెలుగుదనం బ్లాగు | |||||
| మా గీతా.కో.ఇన్ |
వంటలు (కొన్ని)
కావలసిన వస్తువులు:
వెర్మిసెల్లి - 200 గ్రా.
పాలు - 1 లీ.
పంచదార - 100 గ్రా.
నెయ్యి - 1/2 కప్పు .
యాలుకలు - 3
కిస్మిస్ - 1 స్పూను.
జీడిపప్పు - 1 స్పూను.
తయారు చేసే విధానం:
ముందుగా వెర్మిసెల్లిని 4 స్పూన్ల నెయ్యితో వేయించాలి. అందులో 1.5 కప్పుల నీరు పోసి బాగా మెత్తగా అయ్యేంత వరకు ఉడికించాలి. అందులో పాలు పోసి సన్నని సెగపై చిక్కబడేంత వరకు ఉడికించాలి. పంచదార కలిపి పుడ్డింగ్ చిక్కబడేంత వరకు ఉంచాలి. జీడిపప్పు నేతిలో వేయించి ఉంచుకోవాలి. పుడ్డింగ్ చిక్కబడిన తరువాత యాలుకుల పొడి, జీడిపప్పు వేసి దించుకోవాలి.
కావలసిన వస్తువులు:
కొబ్బరి కాయలు - 2.
బెల్లం - 200 గ్రా.
బియ్యం - 100 గ్రా.
పాలు - 1 లీ.
నెయ్యి - 1 కప్పు.
కిస్మిస్ - 2 స్పూన్లు.
జీడిపప్పు - 2 స్పూన్లు.
యాలుకలు - 1 స్పూను.
తయారు చేసే విధానం:
ముందుగా కొబ్బరి తురిమి పల్చటి గుడ్డలో ఒడగట్టి పాలు తీయాలి. తరువాత నీళ్ళు కలిపి పల్చగా కొబ్బరి పాలు తీయాలి. రెండూ విడివిడిగా ఉంచుకోవాలి. పల్చగా ఉన్న కొబ్బరిపాలల్లో బియ్యం వండాలి. మూడొంతులు ఉడికిన తరువాత చిక్కగా ఉన్న కొబ్బరిపాలు పోసి అన్నం మెత్తగా అయ్యేంత వరకు వండాలి. మామూలు పాలు పోసి మరలా వండాలి. పాలు, అన్నం బాగా కలిసి ఉడికిన తరువాత బెల్లం తరిగి వేయాలి. మొత్తం బాగా ఉడికిన తరువాత దించి యాలుకుల పొడి జీడిపప్పు వేసి కిస్మిస్ కూడా పైన చల్లి, చల్లారిన తరువాత సర్వ్ చేయాలి.
కావలసిన వస్తువులు:
కండెన్స్‌డ్ మిల్క్ - 1/4 టిన్.
బేకింగ్ పౌడర్ - 1 స్పూను.
మైదా - 150 గ్రా.
సోడా బై కార్బనైటు - 1/4 స్పూను.
వెన్న - 5 స్పూన్లు.
పాలు - 1 కప్పు .
వెనీలా ఎస్సెన్సు - 1/2 స్పూను.
పసుపు మిఠాయిరంగు - 1/4 స్పూను.
తయారు చేసే విధానం:
ముందుగా వెన్న కరిగించి, కండెన్స్‌డ్ మిల్క్, ఎస్సెన్సు, పసుపు మిఠాయి రంగు కలిపి బాగా గిలక్కొట్టాలి. మైదా జల్లించి బేకింగ్ పౌడర్, సోడా కలిపి పై పాల మిశ్రమంలో కలపాలి. చదరంగా ఉన్న కేక్ టిన్ లో పొడి మైదాపిండి చల్లి, పుడ్డింగ్ అందులో పోసి 350 F వేడితో ఓవెన్ లో వండాలి. తీసి చల్లారిన తర్వాత ముక్కలు కోసుకోవాలి.
కావలసిన వస్తువులు:
సోయా ఫ్లేక్స్ - 100 గ్రా.
పాలు - 1 లీ.
చక్కెర - 100 గ్రా.
నెస్లే మిల్క్ మెయిడ్ - 2 టీ స్పూన్లు.
యాలుకలు - 3.
బాదం, కిస్ మిస్, జీడిపప్పు - 100 గ్రా.
తయారు చేసే విధానం:
సోయా ఫ్లేక్స్ ను సరిపడినన్ని నీళ్ళతో కలిపి అయిదు నిమిషాలు మరిగించి ఆపై నీటిని వడగట్టాలి. వేరొక గిన్నెలో పాలను మరిగించి చెక్కర, యాలుకలు, బాదం, కిస్ మిస్, జీడిపప్పు వరుసగా వేసి రెండు నిమిషాల తర్వాత ఫ్లేక్స్ వేసి కలపాలి. మిల్క్ మెయిడ్ వేసి కలిపి మరో అయిదు నిమిషాలు సన్నని సెగపై ఉడికించాలి.
కావలసిన వస్తువులు:
బియ్యం - 1 కిలో.
బెల్లం - 800 గ్రాములు.
నూనె లేక నెయ్యి - 1/2 కిలో.
నువ్వులు - 100 గ్రాములు.
తయారు చేసే విధానం:
బియ్యాన్ని రెండు రోజులు నానబెట్టాలి. ప్రతి పూటా బియ్యంలో నీళ్ళు మార్చి కొత్త నీళ్ళు పోస్తూ ఉండాలి. రెండవ రోజు సాయంత్రం బియ్యాన్ని పిండి కొట్టుకోవాలి. పిండిని రెండు సార్లు జల్లిస్తే అరిసెలు బాగుంటాయి. తరువాత బెల్లాన్ని మెత్తగా దంచి అడుగు మందం ఉన్న గిన్నెలో వేసి ఓ కప్పు నీళ్ళుపోసి పొయ్యి మీద పెట్టాలి. బెల్లం కరిగి పాకం అయ్యేటప్పుడు కలుపుతూ ఉండాలి. ఇప్పుడు ఒక ప్లేటులో కొంచెం నీళ్ళు పోసి పాకం కొంచెం అందులో వెయ్యాలి. దానిని ఉండలా చుడితే గట్టిగా తగిలినప్పుడు లేదా దానిని ప్లేటుకు కొడితే టంగున మోత వచ్చినప్పుడు కిందకు దించాలి. వేయించి ఉంచుకున్న నువ్వులను అందులో పోయాలి. నువ్వులకు బదులు ఓ 50 గ్రాములు గసగసాలైనా వేసుకోవచ్చు. ఇప్పుడు బియ్యం పిండిని కొంచెం కొంచెంగా పోస్తూ ఉండలు కట్టకుండా కలపాలి. ఆ పిండిని చిన్నచిన్న ఉండలుగా చేసి అరిసెలు చేయాలి. అవి కాలిన తరువాత అరిసెల గరిటెలతో నెయ్యి లేదా నూనె పోయేట్లుగా ఒత్తి వాటిని పక్కన ఆరబెట్టాలి. వేడి వాటిని అన్నీ కుప్పగా వేస్తే అంటుకుపోతాయి. అవి ఆరిన తరువాత గాలివెళ్ళని డబ్బాలో భద్రపరుచుకోవాలి.
వెనుకకు | మొదటి పేజీ | ఆఖరి సారి మెరుగు పరిచిన తేది: 25-03-2009 | హక్కులు: తెలుగుదనం.కో.ఇన్ | రూపకర్త: గీతా.కో.ఇన్ | ప్రశ్నలు, సలహాలు, సూచనలకు: editor@telugudanam.co.in