|
www.telugudanam.co.in చీరాల |
పత్రికలలో తెలుగుదనం | మా అనుబంధ వెబ్‌సైట్.. |
|||
| తెలుగుదనం బ్లాగు | |||||
| మా గీతా.కో.ఇన్ |
వంటలు (కొన్ని)
కావలసిన వస్తువులు:
కొబ్బరి కాయ - 1.
మైదా - 1/4 కిలో.
నూనె - 1/2 కిలో.
బెల్లం - 1/4 కిలో.
యాలుకలు - 5.
తయారు చేసే విధానం :
కొబ్బరికాయ కొట్టి తురుముకోవాలి. బెల్లం కూడా తురమాలి. ఇవి రెండూ కలిపి పొయ్యి మీద వేడి చేయాలి. ఇది ముద్దలాగ అవుతుంది. దీనిలో యాలుకల పొడి వేసి కలపాలి. చిన్నచిన్న ముద్దలుగా చేసి పెట్టుకోవాలి. మైదా పిండిని శుభ్రంగా జల్లించుకోవాలి. దానిలో నీళ్ళుపోసి అట్లపిండి కన్నా గట్టిగా కలుపుకోవాలి. పొయ్యిమీద బాండీ పెట్టి నూనె పోసి కాగనివ్వాలి. పూర్ణం ముద్దను మైదాలో ముంచి నూనెలో వేయాలి. వేగినాక తీసివేయాలి. ఇవి చాలా రుచిగా ఉంటాయి. ఇది చాలా బలవర్ధకమైన ఆహారం.
కావలసిన వస్తువులు:
కొబ్బరికాయ - 1.
రవ్వ - 1కిలో.
పచ్చిమిరపకాయలు - 6.
పల్లీలు - 1/2 కప్పు.
పచ్చి శనగపప్పు - 1/2 కప్పు.
తాలింపు గింజలు - 2 స్పూన్లు.
నూనె - 2 కప్పులు.
కరివేపాకు - 2 రెబ్బలు.
ఎండు మిర్చి - 4.
ఉప్పు - తగినంత.
తయారు చేసే విధానం:
రవ్వను దోరగా వేయించి ఉంచుకోవాలి. కొబ్బరి కోరి సిద్ధంచేసుకోవాలి. మూకుట్లో నూనె వేసి పచ్చి శనగపప్పు, పల్లీలు, తాలింపు గింజలు వేసి వేయించి, పచ్చిమిర్చి ముక్కలు, కొబ్బరికోరు వేసి వేగనివ్వాలి. కరివేపాకు చిటపటలాడనిచ్చి నీళ్ళు పోసి మరిగించాలి. అప్పుడు రవ్వవేసి (గడ్డ కట్టకుండా తిప్పుతూ) ఉడికించాలి. దించేముందు కొంచెం నెయ్యి వేసినట్లయితే మరింత కమ్మదనం వస్తుంది.
కావలసిన వస్తువులు:
అరటికాయలు - 3.
పచ్చిమామిడి - 2.
ఉల్లిపాయ - 1.
అల్లం వెల్లుల్లి పేస్ట్ - 1 టీ స్పూను.
పోపు దినుసులు - 1/2 టీ స్పూను.
మిర్చి పొడి - 2 టీ స్పూన్లు.
ధనియాల పొడి - 1/2 టీ స్పూను.
గరం మసాల - 1/4 టీ స్పూను.
పర్చి మిర్చి (సన్నగా తరిగినవి) - 10.
పసుపు - 1/2 టీ స్పూను.
కొత్తిమేర - 2 కట్టలు.
కరివేపాకు - 2 రెమ్మలు.
రిఫైండ్ ఆయిల్ - సరిపడినంత.
తయారు చేసే విధానం:
ముందుగా అరటి కాయను కొద్ది సేపు వేడి నీళ్ళలో ఉడికించి ఆపై పై తోలు తీసివేసి ముక్కలుగా కట్ చేసుకోవాలి. కాడాయిలో ఆయిల్ వేడి చేసి పోపు దినుసులు, ఎండుమిర్చి వేసి వేయించి ఉల్లి పాయలు, పచ్చి మిర్చి వేసి దోరగా వేగనివ్వాలి. అరటికాయ ముక్కలు వేసి కొద్దిసేపు ఫ్రై చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, మిర్చిపొడి, ఉప్పు, ధనియాల పొడి, మామిడి ముక్కలు వేసి ఐదు నిమిషాలపాటు సన్నని సెగపై ఉడికించి ఒక గ్లాసు నీళ్ళు పోయాలి. నీళ్ళు చిక్కబడ్డాక గరం మసాలా, కొత్తిమీర, కరివేపాకు వరసగా వేసి మరో ఐదు నిమిషాల పాటు ఉడికించాలి.
కావలసిన వస్తువులు:
వంకాయలు - 250 గ్రాములు.
పచ్చి మామిడి - 1.
పచ్చిమిర్చి - 30 గ్రాములు.
అల్లం - చిన్న ముక్క.
జీలకర్ర - 1/2 టీ స్పూను.
వెలుల్లి - 10 రేకులు.
పసుపు - 1/2 టీ స్పూను.
కొత్తిమీర - 1 కట్ట.
కరివేపాకు -2 రెమ్మలు.
ఉల్లిపాయ - 1.
ధనియాలు - 1 టీ స్పూను.
ఉప్పు - తగినంత.
రిఫైండ్ ఆయిల్ - సరిపడినంత.
తయారు చేసే విధానం:
ముందుగా ఉల్లిపాయ, ధనియాలు, వెల్లుల్లి, జీలకర్ర, అల్లం, పచ్చిమిర్చిల మిశ్రమాన్ని రుబ్బి పేస్ట్ చేసుకోవాలి. కడాయిలో నూనె వేడయ్యాక ఆవాలు, రుబ్బి ఉంచుకున్న పేస్ట్ వేసి సన్నని సెగపై ఉడికించాలి. వంకాయకు నాలుగు వైపులా గాట్లు పెట్టి పేస్ట్‌లో వేసి ఉడకనివ్వాలి. పసుపు, ఉప్పు, వేసి కొద్ది సేపయ్యాక కప్పు నీళ్ళు పోసి ఉడికించి ఆపై తరిగిన మామిడి వేసి కలపాలి. పైనుండి తరిగిన కొత్తిమీర, కరివేపాకు వేసి కలపాలి.
కావలసిన వస్తువులు:
మెంతి కూర - 100 గ్రా.
ఆలూ - 250 గ్రా.
పసుపు - 1/2 టీ స్పూన్.
పచ్చి మిర్చి - 20 గ్రా.
గరం మసాల పొడి - 1/2 టీ స్పూన్.
జీరా పొడి - 1/2 టీ స్పూన్.
అల్లం వెల్లుల్లి పేస్ట్ - 10 గ్రా.
ఉప్పు - సరిపడినంత.
కొత్తిమీర - 1 రెమ్మ.
నిమ్మరసం - కొద్దిగా.
ఉల్లిపాయ - 1 .
శనగ పిండి - 50 గ్రా.
క్యాప్సికం - 8.
రిఫైండ్ ఆయిల్ - సరిపడినంత.
తయారు చేసే విధానం:
ముందుగా మెంతికూర వేడినీళ్ళలో కొద్ది సేపు ఉడికించి, నీటిని వడగట్టి ఆరనివ్వాలి. కడాయిలో ఆయిల్ వేడయ్యాక జీలకర్ర, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, తరిగిన ఆలు వరసగా వేసి ఐదు నిమిషాలు ఉడికించాలి. మెంతికూర, జీరా పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, కొత్తిమీర, నిమ్మరసం, వేసి కలిపి సన్నని సెగపై ఉడకనివ్వాలి. క్యాప్సికం ను మధ్యలో కట్ చేసి వాటిలో గింజలు తీసివేసి ఆలు మెంతికర్రీ అందులో కూర్చాలి. శనగ పిండిని తగినన్ని నీటితో జారుగా కలిపి క్యాప్సికంను అందులో అద్ది ఆపై దోరగా వేయించాలి.
వెనుకకు | మొదటి పేజీ | ఆఖరి సారి మెరుగు పరిచిన తేది: 25-03-2009 | హక్కులు: తెలుగుదనం.కో.ఇన్ | రూపకర్త: గీతా.కో.ఇన్ | ప్రశ్నలు, సలహాలు, సూచనలకు: editor@telugudanam.co.in