telugudanam.co.in

      telugudanam.co.in

   

వంటలు (కొన్ని)

బొంబాయి రవ్వ ఉప్మా

కావలసిన వస్తువులు:

బొంబాయి రవ్వ - 1 కప్పు.
పచ్చిమిరపకాయలు - 3.
పల్లీలు - 2 స్పూన్లు.
పచ్చి శనగపప్పు - 2 స్పూన్లు.
తాలింపు గింజలు (సాయి మినపప్పు, ఆవాలు, జీలకర్ర) - 2 స్పూన్లు.
నూనె - 50 గ్రా.
కరివేపాకు - 2 రెబ్బలు.
ఎండు మిర్చి - 3.
ఉప్పు - తగినంత.

తయారు చేసే విధానం:

మూకుట్లో (బాండీ, frying pan) లేక గిన్నెలో నూనె వేసి పచ్చి శనగపప్పు, పల్లీలు, తాలింపు గింజలు వేసి వేయించి, పచ్చిమిర్చి ముక్కలు వేసి వేగనివ్వాలి. కరివేపాకు చిటపటలాడనిచ్చి 1 కప్పు రవ్వకు 2 1/2 (2.5) కప్పుల నీళ్ళు పోసి మరిగించాలి. తరువాత తగినంత ఉప్పు వేయాలి. అప్పుడు రవ్వవేసి (గడ్డ కట్టకుండా తిప్పుతూ) ఉడికించాలి. అది కొంచెం గట్టి పడే దాక పొయ్యి మీదనే ఉంచి తరువాత దించాలి. ఇప్పుడు బొంబాయి రవ్వ ఉప్మా సిద్దంగా ఉన్నట్లే.


[ వెనుకకు ]

గోధుమ రవ్వ ఉప్మా

కావలసిన వస్తువులు:

గోధుమ రవ్వ - 1 కప్పు.
పచ్చిమిరపకాయలు - 3.
పల్లీలు - 2 స్పూన్లు.
పచ్చి శనగపప్పు - 2 స్పూన్లు.
తాలింపు గింజలు (సాయి మినపప్పు, ఆవాలు, జీలకర్ర) - 2 స్పూన్లు.
నూనె - తగినంత.
కరివేపాకు - 2 రెబ్బలు.
ఎండు మిర్చి - 3.
ఉప్పు - తగినంత.

తయారు చేసే విధానం:

మూకుట్లో (బాండీ, frying pan) లేక గిన్నెలో నూనె వేసి పచ్చి శనగపప్పు, పల్లీలు, తాలింపు గింజలు వేసి వేయించి, పచ్చిమిర్చి ముక్కలు వేసి వేగనివ్వాలి. కరివేపాకు చిటపటలాడనిచ్చి 1 కప్పు రవ్వకు 2 కప్పుల నీళ్ళు పోసి మరిగించాలి. తరువాత తగినంత ఉప్పు వేయాలి. అప్పుడు రవ్వవేసి ఉడికించాలి. అది కొంచెం గట్టి పడే దాక పొయ్యి మీదనే ఉంచి తరువాత దించాలి. ఇప్పుడు గోధుమ రవ్వ ఉప్మా సిద్దంగా ఉన్నట్లే.


[ వెనుకకు ]

సేమ్యా ఉప్మా

కావలసిన వస్తువులు:

సేమ్యా - 1 కప్పు.
పచ్చిమిరపకాయలు - 3.
పల్లీలు - 2 స్పూన్లు.
పచ్చి శనగపప్పు - 2 స్పూన్లు.
తాలింపు గింజలు (సాయి మినపప్పు, ఆవాలు, జీలకర్ర) - 2 స్పూన్లు.
నూనె - తగినంత.
కరివేపాకు - 2 రెబ్బలు.
ఎండు మిర్చి - 3.
అల్లం - చిన్న ముక్క
ఉల్లిపాయలు - 2.
ఉప్పు - తగినంత.

తయారు చేసే విధానం:

మూకుట్లో (బాండీ, frying pan) లేక గిన్నెలో నూనె వేసి పచ్చి శనగపప్పు, పల్లీలు, తాలింపు గింజలు, పచ్చిమిర్చి ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు వేసి వేగనివ్వాలి. కరివేపాకు చిటపటలాడనిచ్చి 1 కప్పు సేమ్యాకు 2 కప్పుల నీళ్ళు పోసి మరిగించాలి. తరువాత తగినంత ఉప్పు వేయాలి. అప్పుడు సేమ్యా వేసి ఉడికించాలి. అది కొంచెం గట్టి పడే దాక పొయ్యి మీదనే ఉంచి తరువాత దించాలి.


[ వెనుకకు ]

బియ్యపు రవ్వ ఉప్మా

కావలసిన వస్తువులు:

బియ్యపు రవ్వ - 1 కప్పు.
పచ్చిమిరపకాయలు - 3.
పల్లీలు - 2 స్పూన్లు.
పచ్చి శనగపప్పు - 2 స్పూన్లు.
తాలింపు గింజలు (సాయి మినపప్పు, ఆవాలు, జీలకర్ర) - 2 స్పూన్లు.
నూనె - తగినంత.
కరివేపాకు - 2 రెబ్బలు.
ఎండు మిర్చి - 3.
ఉప్పు - తగినంత.

తయారు చేసే విధానం:

మూకుట్లో నూనె వేసి పచ్చి శనగపప్పు, పల్లీలు, తాలింపు గింజలు వేసి వేయించి, పచ్చిమిర్చి ముక్కలు వేసి వేగనివ్వాలి. కరివేపాకు చిటపటలాడనిచ్చి 1 కప్పు రవ్వకు 2 కప్పుల నీళ్ళు పోసి మరిగించాలి. తరువాత తగినంత ఉప్పు వేయాలి. అప్పుడు రవ్వవేసి ఉడికించాలి. అది కొంచెం గట్టిపడే దాక పొయ్యి మీదనే ఉంచి తరువాత దించాలి. ఇప్పుడు బియ్యపు రవ్వ ఉప్మా సిద్దంగా ఉన్నట్లే.


[ వెనుకకు ]

టమోట బాత్

కావలసిన వస్తువులు:

బొంబాయి రవ్వ - 1 కప్పు.
టమోటాలు - 2.
క్యారెట్ - 1.
ఉల్లిపాయలు - 2.
బంగాళ దుంప - 1.
అల్లం - చిన్న ముక్క
పచ్చిమిరపకాయలు - 3.
పల్లీలు - 2 స్పూన్లు.
పచ్చి శనగపప్పు - 2 స్పూన్లు.
తాలింపు గింజలు (సాయి మినపప్పు, ఆవాలు, జీలకర్ర) - 2 స్పూన్లు.
నూనె - తగినంత.
కరివేపాకు - 2 రెబ్బలు.
ఎండు మిర్చి - 3.
ఉప్పు - తగినంత.

తయారు చేసే విధానం:

ముందుగా క్యారెట్, బంగాళదుంప, టమోటాలు, ఉల్లిపాయలు శుభ్రంగా కడిగి ముక్కలు చేసి పెట్టుకోవాలి. తరువాత మూకుట్లో (బాండీ, frying pan) లేక గిన్నెలో నూనె వేసి పచ్చి శనగపప్పు, పల్లీలు, తాలింపు గింజలు వేసి వేయించి, పచ్చిమిర్చి ముక్కలు, ఈ తరిగిన ముక్కలన్నీ వేసి గోధుమ రంగు వచ్చే వరకు వేగనివ్వాలి. కరివేపాకు చిటపటలాడనిచ్చి 1 కప్పు రవ్వకు 2 1/2 (2.5) కప్పుల నీళ్ళు పోసి మరిగించాలి. తరువాత తగినంత ఉప్పు వేయాలి. అప్పుడు రవ్వవేసి (గడ్డ కట్టకుండా తిప్పుతూ) ఉడికించాలి. అది కొంచెం గట్టి పడే దాక పొయ్యి మీదనే ఉంచి తరువాత దించాలి. ఇప్పుడు టమోటా బాత్ సిద్దంగా ఉన్నట్లే.


[ వెనుకకు ]

Telugudanam.co.in
వెనుకకు | మొదటి పేజీ | తెలుగుదనం బ్లాగు | మాగురించి | సలహాలు | పత్రికలలో తెలుగుదనం                                సందర్శకుల సంఖ్య: