www.telugudanam.co.in         చీరాల

తెలుగు పాఠాలు

చిన్నపిల్లల కోసం

మాగురించి

పత్రికలలో తెలుగుదనం

               మా అనుబంధ వెబ్‌సైట్..

సంస్కృతి, సంప్రదాయాలు

వనితల కోసం

సైట్‌మ్యాప్

తెలుగుదనం బ్లాగు

సాహిత్యం

అందరికోసం

సలహాలు

మా గీతా.కో.ఇన్

వంటలు(కొన్ని)

మజ్జిగ పులుసు

కావలసిన వస్తువులు:

పెరుగు - 2 కప్పులు.

శనగ పిండి - 1  స్పూను.

ధనియాలు - 1/4  టీ స్పూను.

మెంతులు - 1/4  టీ స్పూను.

ఎండు మిర్చి - 6.

వెల్లుల్లి - 10 పాయలు.

ఆవాలు - 1/2  టీ స్పూను.

కరివేపాకు - 1 రెమ్మ.

పసుపు - 1/2  టీ స్పూను.

పచ్చి మిర్చి - 5.

ఉల్లిపాయ - సగం.

సొరకాయ, వంకాయ, క్యారట్, గుమ్మడి, బెండ - 100 గ్రా.

రెఫైండ్ ఆయిల్ - కొద్దిగా.

తయారు చేసే విధానం:

పెరుగును బాగా గిలకొట్టాలి. శనగపిండిని కొన్ని నీళ్ళతో కలిపి వరుసగా కలపాలి. ధనియాల పొడి, ఉప్పు, పసుపు, వరుసగా కలపాలి. గిన్నెలో ఆయిల్ వేడి చేసి ఆవాలు, వెల్లుల్లి, ఎండుమిర్చి, జీలకర్ర, మెంతులు వేసి దోరగా వేయించాక మజ్జిగ కలపాలి. సొరకాయ, వంకాయ, క్యారెట్, గుమ్మడి, బెండలను హాఫ్ బాయిల్ చేసి మజ్జిగలో కలపాలి.

టమోట రైస్

కావలసిన వస్తువులు:

టమోటాలు - 1/4 కిలో

బియ్యం - 1/2 కిలో (2 డబ్బాలు)

ఉల్లిపాయలు - 1/4 కిలో

గరం మసాల - 2 ప్యాకెట్లు (2 స్పూన్లు).

ఉప్పు - తగినంత.

నూనె - 2 స్పూన్లు.

తయారు చేసే విధానం:

ముందుగా టమోటాలు, ఉల్లిపాయలు చిన్న ముక్కలుగా తరిగి పెట్టుకోవాలి. తరువాత బియ్యం కడిగి అన్నం వండుకోవాలి. అన్నం వండిన తరువాత ఒక పెద్ద పళ్ళెంలో ఆ అన్నాన్ని ఆరబెట్టి అందులో కొంచం కరివేపాకు వేసి కలయబెట్టాలి. తరువాత మూకుట్లో (బాండీ, frying pan)నూనె వేసి తరిగిన టమోటాలు, ఉల్లిపాయముక్కలు వేసి వేయించాలి. వేగిన తరువాత ఆ ముక్కలను అన్నంలో పోసి, గరం మసాల కూడా  వేసి, ఉప్పు వేసి కలపాలి. ఇప్పుడు వేడి వేడి టమోటా రైస్ సిద్దం.

వాంగీ బాత్

కావలసిన వస్తువులు:

వంకాయలు - 1/2 కిలో.

ఉల్లిపాయలు - 1/4 కిలో.

పచ్చి మిరపకాయలు - 4.

బియ్యం - 1/2 కిలో (2 డబ్బాలు).

నూనె - వేయించటానికి సరిపడినంత ( 200 గ్రా.).

ఉప్పు - తగినంత.

మసాలా కారం తయారు చేయడానికి కావలసినవి

పచ్చి పప్పు - 50 గ్రా.

సాయి మినపప్పు - 50 గ్రా.

ధనియాలు - 50 గ్రా.

ఎండు మిరపకాయలు - 6.

తయారు చేసే విధానం:

ముందుగా మసాలా కారం తయారు చేయటం చూద్దాం:

పచ్చిపప్పు, ధనియాలు, సాయి మినపప్పు, ఎండుమిరపకాయలు తీసుకొని బాండిలో ఒక స్పూను నూనె వేసి వీటిని దోరగా వేయించాలి. అవి ఆరాక వాటిని మిక్సిలో కాని రోటిలో కాని వేసి మెత్తగా పొడి చేసుకొని ఉంచుకోవాలి. ఇప్పుడు మసాల కారం సిద్ధంగా ఉన్నట్టు.

ఇప్పుడు బియ్యం కడిగి అన్నం వండుకోవాలి. అన్నం వండిన తరువాత ఒక పెద్ద పళ్ళెంలో పోసి ఆరబెట్టాలి. తరువాత మూకుట్లో నూనె వేసి వంకాయ ముక్కలు వేసి కొంచం వేగిన తరువాత ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి వేయించాలి. అన్నం ఆరిన తరువాత అందులో ఈ వేగిన వంకాయ, ఉల్లిపాయ ముక్కలు, మసాలా కారం, ఉప్పు వేసి కలపాలి. దాంతో ఘుమ ఘుమలాడే వాంగీబాత్ రెడీ అయినట్లే. దీన్ని టమోటా సాస్‌తో వేడి వేడిగా తింటే బాగుంటుంది.

ఆలూచిప్స్

కావలసిన వస్తువులు:

బంగాళ దుంపలు (ఆలూ) చెక్కు తీసినవి - 1/2 కిలో.

తయారు చేసే విధానం:

బంగాళాదుంపలను శుభ్రంగా కడిగి తీసి సన్నని ముక్కలుగా నిలువుగా కోసుకోవాలి. ఆ ముక్కల్ని నీళ్లలో ఐదు నిముషాల పాటు నానపెట్టాలి. తరువాత వడకట్టి పొడి బట్టలో వేసి వాటిలో ఉన్న పిండి పోయేవరకు మెత్తగా ఒత్తాలి. ఇలా చెయ్యడం వల్ల ముక్కలు ఒకదానికొకటి అతుక్కోవు, వేగించినప్పుడు కళాయికి అంటుకుపోవు. బాగా కరకరలాడేట్టు రావాలంటే ముక్కలను వేగించేముందు పిండిలో దొర్లించాలి. రెస్టారెంట్లలో ఇదే పద్ధతిని అనుసరిస్తారు. ఒకవేళ వేగంగా చిప్స్ సిద్ధం కావాలంటే ముక్కలు వేగించేముందు కాసేపు ఉడికిస్తే సరిపోతుంది.

సేమ్యాతోపకోడి

కావలసిన వస్తువులు:

శనగపిండి - 1/2 కిలో.

సేమ్యా - 1/4 కిలో.

ఉల్లిపాయ ముక్కలు - 2 కప్పులు.

పచ్చిమిర్చిముక్కలు - 2 చెంచాలు.

ఉప్పు, కారం - తగినంత.

నూనె - అవసరమైనంత.

తయారు చేసే విధానం:

ముందుగా సేమ్యాని నీటిలో ఉడికించి వార్చి ఒక గుడ్డ మీద ఆరబెట్టాలి. సేమ్యాలు బాగా ఆరిన తరువాత ఒక బేసిన్‌లోకి తీసుకొని దానికి శనగపిండి, ఉల్లిపాయ ముక్కలు, మిర్చిముక్కలు, ఉప్పు, కారం, తగినంత నీరు చేర్చి పకోడీ పిండిలా కలుపుకోవాలి. బాణలిలో నూనె వేసి మరిగాక పై మిశ్రమాన్ని కొద్ది కొద్దిగా తీసుకుని మరిగే నూనెలో వేసి బాగా వేగాక తీసి పళ్లెంలో వేసుకోవాలి. వేడి వేడిగా తింటే ఈ పకోడి ఎంతో రుచి ఉంటుంది.


వెనుకకు | మొదటి పేజీ | ఆఖరి సారి మెరుగు పరిచిన తేది: 25-03-2009 | హక్కులు: తెలుగుదనం.కో.ఇన్  | రూపకర్త: గీతా.కో.ఇన్ | ప్రశ్నలు, సలహాలు, సూచనలకు: editor@telugudanam.co.in